దువ్వాడ వాణిపై ఏం చ‌ర్య తీసుకున్నారు?- హైకోర్టు నిల‌దీత‌!

భార్య దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె హైంద‌విపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ ఫిర్యాదుపై ఎలాంటి చ‌ర్య తీసుకున్నారో చెప్పాల‌ని టెక్క‌లి పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. దువ్వాడ శ్రీ‌నివాస్ ఇంటి వ‌ద్ద‌కెళ్లి వాణి, కుమార్తెలు నానా…

భార్య దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె హైంద‌విపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ ఫిర్యాదుపై ఎలాంటి చ‌ర్య తీసుకున్నారో చెప్పాల‌ని టెక్క‌లి పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. దువ్వాడ శ్రీ‌నివాస్ ఇంటి వ‌ద్ద‌కెళ్లి వాణి, కుమార్తెలు నానా హంగామా చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై భార్య‌, కుమార్తె దాడికి వ‌చ్చారంటూ దువ్వాడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న నేప‌థ్యంలో దువ్వాడ ఫిర్యాదును పోలీసులు ప‌ట్టించుకోలేన్న మాట వినిపిస్తోంది.

దీంతో దువ్వాడ శ్రీ‌నివాస్ న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇవాళ హైకోర్టు సీరియ‌స్‌గా స్పందించింది. దువ్వాడ ఫిర్యాదుపై ఆయ‌న భార్య వాణి, హైంద‌విపై ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని టెక్క‌లి పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో వ్య‌వ‌హారం హైకోర్టు ప‌రిధిలోకి వెళ్లిన‌ట్టైంది.

ఇప్ప‌టికి 12 రోజులుగా దువ్వాడ ఇంటి వ‌ద్ద వాణి, వారి కుమార్తెలు నిర‌స‌న చేప‌ట్టారు. త‌మ‌ను ఇంటిలోప‌ల‌కి రానివ్వాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే త‌న‌పై దాడికి వ‌చ్చి కుటుంబ ప‌రువును బజార్లో ప‌డేశార‌ని, ఇక విడాకులు త‌ప్ప మ‌రో ర‌క‌మైన రాజీ లేద‌ని దువ్వాడ శ్రీ‌నివాస్ తేల్చి చెప్పారు. విడాకులు కోరుతూ వాణికి లాయ‌ర్ ద్వారా నోటీసులు కూడా పంపిన‌ట్టు దువ్వాడ శ్రీ‌నివాస్ వెల్ల‌డించారు. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ఏమ‌వుతుందో చూడాలి.

24 Replies to “దువ్వాడ వాణిపై ఏం చ‌ర్య తీసుకున్నారు?- హైకోర్టు నిల‌దీత‌!”

  1. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన బార్య వాణి, కుమార్తె హైందవిపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ ముక్క రాయవా GA?

    ఇన్ని రొజులగా దువ్వాడ విషయం మీద ఎంత గొల జరుగుతున్నా రాయలెదు. కొర్టు అఫ్ఫిడవిట్ వెయముంది అంట, ఇక ఎదొ దువ్వడ పరమ పవిత్రుడు అని కొర్టు చెప్పినట్టు GA కలరింగ్ ఇస్తున్నాడు.

    ఇప్పటి వరకూ నెను చెసింది adultery అని దైర్యం గా చెప్పుకున్నది మన దువ్వాడె కదా అంటవా? ఇలా ఎ TDP నాయకుడొ అంటె, మన GA, MBS కూడా రంగం లొకి దిగి ఎంత గొల చెసె వాళ్ళొ!

  2. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన బార్య వాణి, కుమార్తె హైందవిపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ ముక్క రాయవా GA?

    ఇన్ని రొజులగా దువ్వాడ విషయం మీద ఎంత గొల జరుగుతున్నా రాయలెదు. కొర్టు అఫ్ఫిడవిట్ వెయముంది అంట, ఇక ఎదొ దువ్వడ పరమ పవిత్రుడు అని కొర్టు చెప్పినట్టు GA కలరింగ్ ఇస్తున్నాడు.

    ఇప్పటి వరకూ నెను చెసింది adultery అని దైర్యం గా చెప్పుకున్నది మన దువ్వాడె కదా అంటవా? ఇలా ఎ TDP నాయకుడొ అంటె, మన GA, M.-.B.-.S కూడా రంగం లొకి దిగి ఎంత గొల చెసె వాళ్ళొ!

  3. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన బార్య వాణి, కుమార్తె హైందవిపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ ముక్క రాయవా GA?

  4. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన బార్య వాణి, కుమార్తె హైందవిపై కే.-.సు నమోదు చేసి 41ఏ నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ ముక్క రాయవా GA?

    ఇన్ని రొజులగా దువ్వాడ విషయం మీద ఎంత గొల జరుగుతున్నా రాయలెదు. కొర్టు అఫ్ఫిడవిట్ వెయముంది అంట, ఇక ఎదొ దువ్వడ పరమ పవిత్రుడు అని కొర్టు చెప్పినట్టు GA కలరింగ్ ఇస్తున్నాడు.

    ఇప్పటి వరకూ నెను చెసింది adultery అని దైర్యం గా చెప్పుకున్నది మన దువ్వాడె కదా అంటవా? ఇలా ఎ TDP నాయకుడొ అంటె, మన GA, M.-.B.-.S కూడా రంగం లొకి దిగి ఎంత గొల చెసె వాళ్ళొ!

  5. అన్నయ్య అధికారంలో ఉన్నప్పుడు సజ్జల గారు పెద్దరికం చేశారంట ..

    అన్నయ్య అధికారంలో లేడు కాబట్టే కో-ర్టు మెట్లు ఎక్కిన శీను అన్న

  6. సేమ్ to సేమ్ అక్క చెల్లెమ్మ లు కూడా అదే అనుకుంటున్నారు ..ఏకపత్నీవ్రతుడు ఐన మా జగనన్న పార్టీ లో ఇలాంటి వాళ్ళ అని …అలానే అన్న ఎం ఆక్షన్ తీసుకుంటారో అని కూడా చూస్తున్నారు

Comments are closed.