అధినేతను బద్నాం చేయడానికి ఇదో పొలిటికల్ గేమ్!

కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో పోలీసులకు తెలుసు. కాంగ్రెస్ నాయకులకూ తెలుసు.

రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడానికి, వారిని ప్రజల్లో బద్నాం చేయడానికి పొలిటికల్ లీడర్స్ రకరకాలుగా పొలిటికల్ గేమ్స్ ఆడుతుంటారు. కొన్ని సిల్లీగా ఉంటే, కొన్ని జనాలను ఆలోచింపచేస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ గేమ్ కొత్తదేమీ కాదు. గతంలో అనేక పార్టీలు ఆడిన గేమే.

కాకపొతే ప్రజలను ఆలోచింపచేస్తుంది. కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ చిన్నా చితక లీడర్ మీద కాదు. గులాబీ పార్టీ అధినేత అండ్ మాజీ సీఎం కేసీఆర్ మీద. దీనివల్ల ఆయనకు కలిగే నష్టం ఏమీలేదు. కాకపొతే ఆయన నియోజకవర్గం ప్రజల్లో చర్చ జరుగుతుంది.

ఇంతకూ ఏమిటా పొలిటికల్ గేమ్ అంటే …మిస్సింగ్ కేసు. కేసీఆర్ చాలా రోజులుగా కనబడటంలేదని, ఆయన ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకోవాలని ఆయన నియోజకవర్గమైన గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎవరి ఫిర్యాదునైనా తీసుకుంటారు కాబట్టి ఈ మిస్సింగ్ కేసును కూడా తీసుకున్నారు.

కానీ కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో పోలీసులకు తెలుసు. కాంగ్రెస్ నాయకులకూ తెలుసు. ఆయన ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ లో ఉన్నాడని రాష్ట్రమంతా తెలుసు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండో మూడో బహిరంగ సభల్లో మాట్లాడాడు. బడ్జెట్ సమావేశాలప్పుడు ఒకేసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చాడు. ఇక ఆ తరువాత నుంచి పత్తా లేడు.

వరదలొచ్చినా మాట్లాడలేదు. హైడ్రా గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ లేడీ మినిస్టర్ తన పిల్లకాయ మీద ఘోరమైన ఆరోపణలు చేసినా మాట్లాడలేదు. ఏ విషయంలోనూ నోరు విప్పడంలేదు. ప్రభుత్వం మీద ఇద్దరు పిల్లకాయలే అంటే కేటీఆర్ అండ్ హరీష్ రావే విమర్శలు, ఆరోపణలు చేస్తూ పోరాటం చేస్తున్నారు.

కానీ కేసీఆర్ మాట్లాడితే కదా రేవంత్ రెడ్డికి కూడా మజా వచ్చేది. కేసీఆర్ కూతురు కవిత కూడా తండ్రి బాటలోనే నడుస్తోంది. కాకపొతే ఆమెను మిస్సింగ్ అనలేం. ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీ కాబట్టి ఆమెకు నియోజకవర్గం ఉండదు కదా.

5 Replies to “అధినేతను బద్నాం చేయడానికి ఇదో పొలిటికల్ గేమ్!”

  1. వెయ్యి-పీనుగలని-తిన్న-రాబందు-ఒక్క-ఎలక్షన్స్-కి-చచ్చి-ఫార్మ్-హౌస్-కె-పరిమితం-ఇంకో-రాబందు-జగన్-రెడ్డి-గాడు-బెంగళూరు-పాలస్-కి-పరిమితం

Comments are closed.