నమ్మండి.. ఇది గుణశేఖర్ సినిమానే

గుణశేఖర్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. ఆ అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఏదైనా కనిపిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. యుఫోరియా సినిమాతో అలాంటి షాకింగ్ కంటెంట్ నే ఎత్తుకున్నాడు గుణశేఖర్.…

గుణశేఖర్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. ఆ అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఏదైనా కనిపిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. యుఫోరియా సినిమాతో అలాంటి షాకింగ్ కంటెంట్ నే ఎత్తుకున్నాడు గుణశేఖర్.

‘వరల్డ్ ఆఫ్ యుఫోరియా’ పేరిట ఈరోజు రిలీజైన గ్లింప్స్ చూస్తే, అసలిది గుణశేఖర్ సినిమాయేనా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే, గ్లింప్స్ మొత్తం డ్రగ్స్, తాగుడు, అమ్మాయిలపై అత్యాచారాలు, మోడ్రన్ కల్చర్… ఇలాంటి ఎలిమెంట్స్ కనిపించాయి. వీడియో మొదలవ్వడమే, ఓ అమ్మాయి డ్రగ్స్ తీసుకొని మెట్రో రైలు ఎక్కిన సీన్ తో ప్రారంభమౌతుంది.

ఇలాంటి ఎలిమెంట్స్ తో గుణ సినిమా తీస్తారని ఎవ్వరూ ఊహించరు. అందుకే యుఫోరియా గ్లింప్స్ పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కోసం యంగ్ ఆర్టిస్టులతో పాటు.. భూమిక, నాజర్ లాంటి సీనియర్లను కూడా తీసుకున్నారు. కాలభైరవ సంగీత దర్శకుడు. గ్లింప్స్ కాబట్టి కథ ఏంటనేది క్లారిటీ లేదు.

శాకుంతలం ఫ్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న గుణశేఖర్, యుఫోరియా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ కాంటెంపరరీ కాన్సెప్ట్ తో అతడు ఈసారైనా సక్సెస్ కొడతాడేమో చూడాలి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా రిలీజ్ అవుతుంది.

3 Replies to “నమ్మండి.. ఇది గుణశేఖర్ సినిమానే”

Comments are closed.