తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేక రాజకీయ కుట్రల బారిన పడి.. చాలా దెబ్బతింది. ఎంతో కింది స్థాయి నుంచి రాజకీయం ప్రారంభించి.. నాయకులుగా ఒక రేంజికి ఎదిగిన వారు అనేక మంది.. పార్టీ కష్ట కాలంలో ఉన్న రోజుల్లో ఏమాత్రం విలువలు లేకుండా.. తమ దారి తాము చూసుకున్నారు. కానీ ఇప్పుడు, ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త దశదిశ నిర్దేశించే కృషితో పాటు, తెలంగాణ లో కూడా తెలుగుదేశాన్ని పునరుజ్జీవింపజేయాలని అధినేత చంద్రబాబునాయుడు అనుకుంటున్న తరుణంలో కొన్ని శుభసంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇదివరకు పార్టీని వీడి వెళ్లిన కీలక నాయకులు కొందరు.. తిరిగి తెలుగుదేశంలోకి రాబోతున్నారు. కొందరు ఇప్పటికే తమ చేరికలను ధ్రువీకరించారు.. మరికొందరు చంద్రబాబుతో మంతనాలు పూర్తి చేసుకున్నారు. మొత్తానికి రాబోయే కొన్ని నెలల్లో తెలంగాణ తెలుగుదేశానికి మంచి రోజులు వస్తాయని, పార్టీ కొత్త జవసత్వాలను కూడా సంతరించుకోబోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి ఒకప్పట్లో తెలంగాణలోనే వైభవస్థితి ఉండేది. రాష్ట్ర విభజన నాటికి కూడా పార్టీ పరిస్థితి మరీ దిగనాసిల్లిపోలేదు. కానీ.. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన భారాస అధినేత కేసీఆర్.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి మొత్తానికి రకరకాలుగా వెంటపడి గులాబీదళంలో కలిపేసుకున్నారు.
ఇవాళంటే కాంగ్రెసులోకి వెళ్లిన గులాబీ ఎమ్మెల్యేల గురించి ఫిరాయింపు నీతులు మాట్లాడుతున్నారు గానీ.. ఆ రోజుల్లో తెలుగుదేశం నుంచి ఫిరాయించి వచ్చిన వారికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టి రాజకీయ నైతిక విలువలను బొందపెట్టారు కేసీఆర్. తర్వాతి పరిణామాల్లో కొందరు కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. తెలంగాణ తెలుగుదేశం నామమాత్రంగా మారిపోయింది.
ఇప్పుడు చంద్రబాబునాయుడు పార్టీ పునరుజ్జీవం మీద శ్రద్ధ పెడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఒకప్పుడు తెలుగుదేశం తరఫున హైదరాబాదు నగర మేయర్ గా కూడా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు తాను కుటుంబసభ్యుల సహా తెలుగుదేశంలో చేరబోతున్నట్టు ప్రకటించారు. రాజధాని నగర రాజకీయాల్లో తీగల కృష్ణారెడ్డి బలమైన నాయకుల్లో ఒకరు. అదే విధంగా మరో కీలక నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం భారాసలో ఉన్న ఆయన తన అల్లుడు శశిధర్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో భేటీ కావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వీరిద్దరూ కూడా తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ఉంది. ఏది ఏం జరిగినప్పటికీ.. తెలంగాణ తెలుగుదేశం మళ్లీ వికసిస్తుందని, పూర్వవైభవం కాకపోయినా.. కనీసం అస్తిత్వాన్ని కాపాడుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.
Nuvvu anchavesav
ee saari telangana TDP lo Kachara gaadu kuda join ayyettu vunnadu…
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
మల్లారెడ్డి అల్లుడు శశిధర్ రెడ్డి కాదురా ఎదవ…రాజశేఖర్ రెడ్డి చెక్ చేస్కో
తీగల వెంట ఒక్క తీగ కూడా లేదు …భజన ఆపు
సాక్షి సంస్థకి సిగ్గూ, పరిమితులూ అన్నవి ఏమాత్రం లేవన్నట్టు చూస్తుంటే, మనసులో ఒక్కటే అనిపిస్తుంది: ఇది నిజంగా సంస్థేనా, లేక రచ్చ పుట్టించడానికి పుట్టిన ఓ యంత్రమా? ఏ చిన్న మంచి విషయం కనిపించినా, సాక్షి ముందుగా ఓ పెద్ద చెంబుతో బురదనే తీసుకువస్తుందని గ్యారంటీ! ఈసారి కూడా అదే పనికి పూనుకుంది. ఎవరూ ఊహించకుండానే, ఆ బురద తానే ముంచుకుంది!
సాక్షి సూటిగా నడుస్తుందా? అసలు అలాంటి మాటే దాని డిక్షనరీలో ఉండదు! ఆ వంకర బుద్ధి ఎప్పుడూ ఏదో కొత్త రచ్చ కోసం తహతహలాడుతూ ఉంటుంది. “ఇక్కడ కూడా గందరగోళం సృష్టించొచ్చు” అనే ఆలోచనతో, ఎక్కడ చూసినా సాక్షి తన కుట్రల వ్యూహాలను విస్తరించి, చివరికి తానే తింటున్న ప్లేటులోనే బురద పోస్తుంది.
ఈసారి సాక్షి కుట్రల స్థాయి మరింత పెరిగిందా అని అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఏ చిన్న విషయం జరిగినా, సాక్షి దాన్ని మామూలుగా విడిచిపెట్టదు. “ఇక్కడ ఎలాంటి గందరగోళం లేవు కదా?” అనుకున్న క్షణాన, అది ఏకంగా ఒక పెద్ద మేకపందిరి కట్టేసినట్టు ఉంటుంది. దూకుడు, అబద్ధాలు, దుమారం – ఇవే దాని సాధనాలు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే, సాక్షి మాత్రం “ఇదే నా మోమెంటు!” అంటూ గందరగోళం సృష్టించడం కచ్చితమే!
జనం సాక్షి చేసే రచ్చ చూసి నవ్వుకుంటారు, ఎందుకంటే ఎంత దూకినా, చివరికి నష్టపోయేది సాక్షే! కానీ ఆ వంకర బుద్ధి మాత్రం ఏమాత్రం పాఠం నేర్చుకుంటుందా? అస్సలు కాదు! ఎందుకంటే, సాక్షికి కొంచెం బుద్ధి ఉంటే, ఇంత రచ్చ రేపడం ఎప్పుడో ఆపేసేది!