విరాళాల్లో అవినీతికి పాల్ప‌డ్డ కూట‌మి నేత‌లు

వ‌ర‌ద‌లొస్తే అవినీతికి పాల్ప‌డొచ్చ‌ని దేశంలోనే నిరూపించిన ఘ‌న‌త కూట‌మి స‌ర్కార్‌కు ద‌క్కుతుంద‌ని వైసీపీ యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా ల‌క్ష‌లాది ప్ర‌జానీకం, వేలాది కుటుంబాలు న‌ష్ట‌పోయాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం…

వ‌ర‌ద‌లొస్తే అవినీతికి పాల్ప‌డొచ్చ‌ని దేశంలోనే నిరూపించిన ఘ‌న‌త కూట‌మి స‌ర్కార్‌కు ద‌క్కుతుంద‌ని వైసీపీ యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా ల‌క్ష‌లాది ప్ర‌జానీకం, వేలాది కుటుంబాలు న‌ష్ట‌పోయాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద‌ల్లో న‌ష్ట‌పోయిన బాధితుల‌ను ఆదుకునేందుకు విరాళాలు ఇస్తే, వాటిని టీడీపీ నాయ‌కులు జేబులో వేసుకునే విధంగా కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న సాగిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. విరాళాల్ని కూడా సొంతానికి వాడుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌న్నారు.

రూపాయి రూపాయి కూడ‌బెట్టి చిన్న పిల్ల‌లు సైతం వ‌ర‌ద బాధితుల‌కు విరాళం ఇస్తే, దానిలో కూడా అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య‌వాడ‌కు వ‌ర‌దొస్తుంద‌ని తెలిసి కూడా, కేవ‌లం త‌మ ఇంటిని కాపాడుకునేందుకే ప్ర‌జ‌ల్ని గాలికి వ‌దిలేసిన ఘ‌న‌త కూట‌మి స‌ర్కార్‌కు ద‌క్కుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు. న‌ష్ట‌పోయిన వ‌ర‌ద బాధితుల‌కు ఇంత వ‌ర‌కూ ఎలాంటి సాయం అందించ‌లేద‌ని అవినాష్ విమ‌ర్శించారు.

సాయం చేయ‌డం మానేసి, కేవ‌లం త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని దేవినేని అవినాష్ మండిప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వానికి పెద్ద మొత్తంలో విరాళాలు వ‌చ్చిన‌ట్టు కూట‌మి ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకుంటోంద‌న్నారు. విరాళాలు ఇచ్చిన వాళ్ల‌ను తాము కూడా అభినందిస్తున్నామ‌న్నారు. అయితే ఆ విరాళాలు ఏమ‌య్యాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయ‌ని ఆయ‌న నిలదీశారు.

తాత్కాలిక వ‌స‌తి సౌక‌ర్యానికి రూ.1.40 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం లెక్క‌లు చెబుతోంద‌న్నారు. అయితే ఎవ‌రికి, ఎక్క‌డ తాత్కాలిక సౌక‌ర్యం క‌ల్పించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌నీసం ఒక్క శిబిర‌మైనా ఏర్పాటు చేశారా? అని ఆయ‌న నిల‌దీశారు. భోజ‌నానికి రూ.368 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని చూపుతున్నార‌న్నారు. క‌నీసం వ‌ర‌ద బాధితుల‌కు ఒక్క అన్నం ప్యాకెట్‌, పాల, నీళ్ల ప్యాకెట్ ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ప్ర‌భుత్వం చెప్పే లెక్క ప్ర‌కారం మొత్తం 6 ల‌క్ష‌ల మందికి, ఒక్కొక్క‌రికి రూ.240 ఖ‌ర్చు చేశార‌న్నారు. ఫైవ్‌స్టార్ హోట‌ల్ నుంచి తీసుకొచ్చారా? అని అవినాష్ ప్ర‌శ్నించారు. మంచినీటికి రూ.26 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌న్నారు. కొవ్వొత్తులు, అగ్గి పెట్టెల‌కి రూ.23 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. శానిటేష‌న్‌కు రూ.50 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశార‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శానిటేష‌న్ సిబ్బందిని పిలిపించి క‌నీసం వాళ్ల‌కు స‌రైన భోజ‌నం కూడా పెట్ట‌లేద‌ని దేవినేని అవినాష్ విమ‌ర్శించారు.

25 Replies to “విరాళాల్లో అవినీతికి పాల్ప‌డ్డ కూట‌మి నేత‌లు”

  1. కోర్ట్ పాస్పోర్ట్ ఇస్తే.. దేశం వదిలి పారిపోయే.. ఇలాంటి చెక్కగాళ్ళు కూడా కామెడీ చేస్తున్నారంటే.. చంద్రబాబు మంచితనాన్ని ప్రశ్నించుకోవాలి.. అంతే..

    1. నిజమే. అసలు ఇతను, వంశీ, కొడాలి మీద చర్యలు లేవు. వాళ్ళు చక్కగా దేశంలో తిరుగుతున్నారు.

  2. చివరికి వీడూ మాట్లాడే వాడే, ఆ పార్టీలో అందరూ ఇలా హాఫ్ నాలెడ్జ్ గాల్లె ఉన్నారు, విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారు అంతే తప్ప వాస్తవాలు అర్థం చేసుకోలేరు, ఎవరైనా చెప్పినా అర్థం కాదు

  3. వీడి బొంద! పాపం అని TDP టిక్కెట్ ఇస్తె, అమ్ముడు పొయి TDP ఆఫిసు మీద దాడి చెయించిన సన్నాసి వీడు!

    వీడి బతుకు ఇక ఎటూ జైలె! అప్పటి వరకూ అలా పడి మొరుగుతూ ఉంటాడు!

  4. కనీసం లుకౌట్ నోటీసు ఉంది అనే ఇంగితం లేకుండా అర్ద రాత్రి దేశం వదిలిపోవడానికి జారుకుంటుంటే మామ లకి రెడ్ హందెద్ గ దొరికి పోయి నోడు …వీడు కూడా మాటాడేయడమే …ఖర్మ రా బాబు ..కనీసం లుకౌట్ నోటీసు ఉంది అనే ఇంగితం లేకుండా అర్ద రాత్రి దేశం వదిలిపోవడానికి జారుకుంటుంటే మామ లకి రెడ్ హందెద్ గ దొరికి పోయి నోడు …వీడు కూడా మాటాడేయడమే …ఖర్మ రా బాబు ..

  5. సరే మీ కోటి రుపాయల విరాళం సంగతి ఏంటి రాజా …జనాలకి ఎప్పుడు పంచారు ఎలా పంచారు చెప్పరాదు కొంచెం

  6. సమయానికి సహాయం అందిందో లేదో బాధితులు కదా చెప్పాలి? ఎప్పుడు అవకాశం వస్తుందా దేశం విడిచి పారిపోదాం అని ప్లాన్ చేసిన నువ్వుగానీ, బెంగుళూరు ప్యాలెస్ లో సేదదీరిన మీ అన్నగానీ కనీసం ఒక పులిహోర ప్యాకెట్ అయినా పంచినట్లు ఫొటో ఉంటే పెట్టు!

  7. Corruption tho vachina dabbulatho biscuits koni paccha kukka laki vesinattu vunnadu babu anduke baaga morugutunnayi ikkada. Kaani janam ni ee kukkalu influence cheyyalevu anedaaniki last 5 years best example.

  8. Corruption-tho-vachina-dabbula-tho-biscuits-koni-paccha-kukka-laki-vesinattu-vunnadu-Lokesam-anduke-baaga-morugutunnayi-ikkada. Kaani-janam-ni-ee-kukkalu-influence-cheyyalevu.

  9. సాక్షి సంస్థకి సిగ్గూ, పరిమితులూ అన్నవి ఏమాత్రం లేవన్నట్టు చూస్తుంటే, మనసులో ఒక్కటే అనిపిస్తుంది: ఇది నిజంగా సంస్థేనా, లేక రచ్చ పుట్టించడానికి పుట్టిన ఓ యంత్రమా? ఏ చిన్న మంచి విషయం కనిపించినా, సాక్షి ముందుగా ఓ పెద్ద చెంబుతో బురదనే తీసుకువస్తుందని గ్యారంటీ! ఈసారి కూడా అదే పనికి పూనుకుంది. ఎవరూ ఊహించకుండానే, ఆ బురద తానే ముంచుకుంది!

    సాక్షి సూటిగా నడుస్తుందా? అసలు అలాంటి మాటే దాని డిక్షనరీలో ఉండదు! ఆ వంకర బుద్ధి ఎప్పుడూ ఏదో కొత్త రచ్చ కోసం తహతహలాడుతూ ఉంటుంది. “ఇక్కడ కూడా గందరగోళం సృష్టించొచ్చు” అనే ఆలోచనతో, ఎక్కడ చూసినా సాక్షి తన కుట్రల వ్యూహాలను విస్తరించి, చివరికి తానే తింటున్న ప్లేటులోనే బురద పోస్తుంది.

    ఈసారి సాక్షి కుట్రల స్థాయి మరింత పెరిగిందా అని అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఏ చిన్న విషయం జరిగినా, సాక్షి దాన్ని మామూలుగా విడిచిపెట్టదు. “ఇక్కడ ఎలాంటి గందరగోళం లేవు కదా?” అనుకున్న క్షణాన, అది ఏకంగా ఒక పెద్ద మేకపందిరి కట్టేసినట్టు ఉంటుంది. దూకుడు, అబద్ధాలు, దుమారం – ఇవే దాని సాధనాలు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే, సాక్షి మాత్రం “ఇదే నా మోమెంటు!” అంటూ గందరగోళం సృష్టించడం కచ్చితమే!

    జనం సాక్షి చేసే రచ్చ చూసి నవ్వుకుంటారు, ఎందుకంటే ఎంత దూకినా, చివరికి నష్టపోయేది సాక్షే! కానీ ఆ వంకర బుద్ధి మాత్రం ఏమాత్రం పాఠం నేర్చుకుంటుందా? అస్సలు కాదు! ఎందుకంటే, సాక్షికి కొంచెం బుద్ధి ఉంటే, ఇంత రచ్చ రేపడం ఎప్పుడో ఆపేసేది!

Comments are closed.