ఎమ్బీయస్‍: సందట్లో సడేమియా

పరిపాలన విషయాల్లో వ్యక్తిగత జీవితం ప్రస్తావన రాదు, కానీ మత ప్రవచనాలకు, నీతిబోధలకు దిగితే మాత్రం తప్పకుండా వస్తుంది.

తిరుపతి లడ్డూ వివాదంలో కల్తీ నేతిని లడ్డూలో ఉపయోగించారో లేదో ఆధారాలతో చెప్పకుండానే బడే మియా ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని, ఛోటే మియా అయిన ఉప ముఖ్యమంత్రి మరో లెవెల్‌కు తీసుకెళ్లి దాన్ని మతపరమైన వివాదంగా మార్చడానికి చూస్తున్నారంటూ ఎమ్బీయస్‍: బూమెరాంగా? భూస్థాపితమా? అనే వ్యాసాన్ని ముగించాను. నిజానికి లడ్డూ వివాదం ఒక ఆర్థికపరమైన అవినీతి మాత్రమే అని అనేక అంశాలతో చెప్పడానికి ప్రయత్నించాను. వెయ్యి టన్నుల కాంట్రాక్టు ఎఆర్ ఫుడ్స్ సంస్థకు దక్కేట్లా వైసిపి ప్రభుత్వ హయాంలో టెండర్ షరతులను మార్చారు. కాంట్రాక్టు దక్కించుకున్న ఎఆర్ ఫుడ్స్ టిడిపి హయాంలో సప్లయిలు మొదలు పెట్టింది.

320 రూ.లకే సప్లయి చేస్తున్న ఏఆర్ సంస్థను తప్పించి, దాని స్థానంలో రూ.450లకు సప్లయి చేస్తున్న ఆల్ఫా, నందిని సంస్థలను తేవాలని టిడిపి హయాంలోని టిటిడి సంకల్పించింది. దానికి గాను ఏఆర్ సప్లయి చేయబోయిన నెయ్యి కల్తీది అని నిరూపించడానికి పూనుకుంది. ఇంతవరకు ఆర్థిక నేరమే, కానీ దాన్ని రాజకీయాలకు వాడుకుందామని బాబు చూశారు. కల్తీ జరిగిందని భావించిన నేతి ట్యాంకర్లను తిప్పి పంపేశామని ఓ పక్క ఈఓ చెప్తూండగా, అబ్బే ఆ నేతిని లడ్డూలో కలిపివేశారని బాబు అనేసి, గతంలో జగన్ హయాంలో కూడా యిలాగే జరిగింది అని చేర్చేసి, టిటిడి అధికారులు, నిర్వాహకులు అలా చేయడానికి కారణం జగన్‌ నిర్వాకమే అని రాజకీయ లబ్ధి పొందుదామని చూశారు. ఈ క్రమంలో తనిచ్చిన స్టేటుమెంటు కోట్లాది భక్తుల మనోభావాలను ఎలా దెబ్బ తీస్తుందో అంచనా వేయలేదు. బూమెరాంగ్ అయ్యాక బుకాయింపులు మొదలుపెట్టారు.

లడ్డూ నాణ్యతపై భక్తులు ఫిర్యాదు చేశారని, అందుకే నేతి విషయం గట్టిగా పట్టించుకున్నామని సిద్ధార్థ లూథ్రా చేత సుప్రీం కోర్టులో చెప్పించారు. లడ్డూలో ఏమేమి వాడతారు అనే వివరాలతో 06-10-24 ఆంధ్రజ్యోతి ఆదివారంలో ‘తరతరాల సౌరభం, మహా ప్రసాదం’ పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది. దాని ప్రకారం 5100 లడ్డూలు తయారు చేయడానికి ఆవు నెయ్యి 108 కిలోలు, శనగపిండి 200 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 35 కిలోలు, ఎండుద్రాక్ష 17.5 కిలోలు, కలకండ 10 కిలోలు, యాలకులు 5 కిలోలు ఉపయోగిస్తారు. మొత్తం 851 కిలోలన్నమాట. ఈ 851 కిలోలలో నేతి వాటా 108 కిలోలు, అంటే ఎనిమిదో వంతు. లడ్డూ బాగా లేదంటే, తక్కిన ఏడు వంతుల దినుసుల నాణ్యత కూడా చెక్ చేయించాలి కదా. కేవలం నేతి మీదనే మొత్తం ఆధారపడినట్లు బిల్డప్ ఎందుకు? నేతి కాంట్రాక్టరును మార్చగానే ‘అబ్బ, యిప్పుడు లడ్డూ దివ్యంగా ఉందండి’ అని టీవీల్లో చెప్పించడం వింతగా లేదూ?

ఆ వ్యాసంలోనే రాశారు – టిటిడి ఏటా 12.5 కోట్ల లడ్డూలకై రూ.493 కోట్లు లడ్డూలకు కేటాయిస్తారు. వీటిని అమ్మడం ద్వారా రూ.544 కోట్లు ఆర్జిస్తుంది. లడ్డూ, యితర ప్రసాదాల తయారీ కోసం (తెప్పించిన వాటిలో 70శాతం లడ్డూల తయారీకి వినియోగిస్తారట) ఏటా 450 టన్నుల నెయ్యి, (లడ్డూలకి రోజుకి 10 టన్నుల నెయ్యి వాడతారు, తక్కిన 2.32 టన్నులు యితర ప్రసాదాలకు వాడతారన్నమాట), 150 టన్నుల జీడిపప్పు, 155 టన్నుల బాదం పప్పు, 13.5 వేల కిలోల యాలకులు, 45 వేల కిలోల ఎండు ద్రాక్ష, 36 వేల కిలోల కలకండ అవసరం అవుతాయి అని రాశారు. ఇన్ని తెప్పించేటప్పుడు వీటి క్వాలిటీ టెస్ట్ చేయడానికి లాబ్ లేకుండా ఎందుకుంటుంది? ‘అబ్బే, లేదు, మేం భౌతికంగా పరీక్షించి, ఏఆర్ నెయ్యి మంచిది కాదని తేల్చాం’ అని ఈఓ అంటే ఫన్నీగా లేదూ? ఒకవేళ అది నిజమే అయితే ఆలయ సంప్రోక్షణ కంటె ముందు చేపట్టవలసిన పని క్వాలిటీ కంట్రోలు విభాగం తెరవడం!

ఏఆర్‌ని తప్పించడానికి ఆతృత పడడంతో ఈఓ పొరపాట్లు చేశారని గత వ్యాసాలలోనే రాశాను. ఇప్పుడు ఏఆర్ కోర్టులో అనేక అంశాలను లేవనెత్తింది. ఎన్‌డిడిబి రిపోర్టు చూపించి, టిటిడి ఏఆర్‌ను బ్లాక్‌లిస్టు చేసింది. ఆ పంపించిన శాంపుల్ మాదేనని ఎలా అనగలరు? అంటూ ఏఆర్ ప్రశ్నించింది. ఈఓ రహస్యంగా శాంపుల్ తీసి పంపడమేమిటి? అని నేను ఒక వ్యాసంలో ప్రశ్నించడంతో మిత్రులు మాదిరాజు గోవర్ధన రావు గారు (మంగళగిరి) ఎఫ్ఎస్ఎస్ఏఐ రూల్సు బుక్ పంపించి, శాంపుల్ కలక్షన్ గురించి పేజీ 20 నుంచి రాశారు చూడండి అన్నారు. దానిలో చచ్చేటంత ప్రొసీజర్ ఉంది. శాంపుల్‌ను విక్రేత ఎదురుగా, వీలైతే అతని ఆవరణ నుంచే తీసుకోవాలి. తీసుకున్నాక నాలుగు భాగాలుగా చేయాలి. ప్రతీదానికీ లేబుల్ వేసి, సీల్ చేయాలి.

ఒక నమూనాను విక్రేతకు, రెండో నమూనాను ఎనాలిసిస్ చేసే ల్యాబ్‌కు పంపి, మూడో దాన్ని ఫిర్యాదు చేసే సంస్థ దగ్గరే అట్టేపెట్టుకోవాలి. రేపు ల్యాబ్ రిపోర్టుపై విక్రేత అనుమానం వ్యక్తం చేస్తే రిఫరీగా నియమించే సంస్థకు యివ్వడానికి అది పనికి వస్తుంది అంటూ చాలా రాశారు. కంటెయినర్ పెద్దగా ఉంటే శాంపుల్ ఎక్కణ్నుంచి, ఎంత తీసుకోవాలో, తీసుకున్నాక స్టెరైల్ పాత్రల్లో ఎలా పెట్టాలో, ప్లాస్టిక్ బాగుల్లో తీసుకుంటే వాటిపై ఫెల్డ్ పెన్‌తో ఎందుకు రాయకూడదో, టెంపరేచర్ ఎలా మేన్‌టేన్ చేయాలో, దాన్ని లాబ్‌కు పంపించినప్పుడు ఎలా స్టోర్ చేయాలో, శాంపుల్ తీసిన విధానం గురించి ఎలా రికార్డు చేయాలో అనేక షరతులు రాశారు. ఇంత రామాయణం ఉండగా సప్లయిరుకి తెలియకుండా మా అంతట మేమే రహస్యంగా తీసేసి, మేం సెలక్టు చేసుకున్న ఓ ల్యాబ్‌కు పంపించేసి, బ్లాక్‌లిస్ట్ చేసేస్తాం అంటే కోర్టులో నిలుస్తుందా?

అది అర్థమై కంపెనీతో వివాదం నడుస్తూండగానే టిటిడి, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ద్వారా కంపెనీని బ్లాక్‌లిస్టు చేయిస్తే తమ వాదనకు బలం చేకూరుతుందని భావించి, వారికి ఫిర్యాదు చేసి వారి చేత కంపెనీకి నోటీసు యిప్పించింది – మీ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ! ఆ నోటీసును కంపెనీ మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌లో ఛాలెంజ్ చేస్తూ అనేక ప్రశ్నలు వేసింది. ‘మేము 1998 యీ వ్యాపారంలో ఉన్నాం, ఎంతోమందికి సప్లయి చేశాం, ఎక్కడా కంప్లయింటు లేదు, కేసు లేదు. ఇప్పుడు మీరిచ్చిన నోటీసులో కూడా మేం చేసిన నేరమేమిటో చెప్పనే లేదు. చెప్పకుండానే బ్లాక్‌లిస్టు ఎందుకు చేయకూడదంటూ షోకాజ్ నోటీసేమిటి?

‘టిటిడి రూలు ప్రకారం నేతిని పంపించేముందు ఎన్ఏబిఎల్ ఎక్రెడిషన్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎప్రూవల్ ఉన్న లాబ్ నుంచి సర్టిఫికెట్టు తెచ్చుకోవాలి. అవి రెండూ ఉన్న కేంద్ర సంస్థ చెన్నై కింగ్స్ లాబ్ నుంచి మేం సర్టిఫికెట్టు తీసుకుని సప్లయి ప్రారంభించాం. మా మొదటి సప్లయిలను టిటిడిలో నలుగురు నిపుణులతో ఉన్న ఇన్-హౌస్ కమిటీ ఎప్రూవ్ చేసింది. (ఈఓ యీ కమిటీ మాటే ఎత్తటం లేదు. భౌతికంగా వాసన చూశాం, రుచి చూశాం, భక్తులు ఫిర్యాదు చేశారు వంటి కబుర్లు చెప్తున్నాడు) తర్వాతి బ్యాచ్ రిజక్ట్ చేసినట్లు కూడా టిటిడి మాకు చెప్పలేదు. హఠాత్తుగా మీరు ఎన్‌డిడిబి ల్యాబ్ రిపోర్టు అంటూ ఏదో చూపిస్తున్నారు. దానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపే లేదు. అలాటప్పుడు దాని రిపోర్టు ఆధారంగా మీరెలా నోటీసు యివ్వగలరు?

‘పైగా ఆ లాబ్‌కు పంపిన శాంపుల్ మా దిండిగల్ యూనిట్‌లోంచి తీసుకోలేదు. నోటీసు యిచ్చాక శాంపుల్ తీశారు. అదైనా లాబ్‌కు పంపారా అంటే అదీ లేదు. నోటీసులో 14 రోజుల గడువు ఉంటాలి. అది లేదేం?’ అని తగులుకుంది. మద్రాసు హైకోర్టు యీ వాదనలతో కన్విన్స్ అయినట్లుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐతో ‘మీ నోటీసులో వారు చేసిన నేరమేమిటో చెప్పనే లేదేం? 14 రోజుల టైమివ్వలేదేం? అన్నీ సరి చేసి, మళ్లీ నోటీసు యివ్వండి, విచారిస్తాం.’ అంది. టిటిడి మాట విన్నందుకు యిప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ జవాబు చెప్పవలసిన పరిస్థితిలో పడింది. అటు ఎన్‌డిడిబికి కూడా చెడ్డపేరు వచ్చింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎప్రూవల్ లేకుండా తగుదునమ్మా అంటూ రిపోర్టు యివ్వడమేమిటని. దానికి తోడు ఎన్‌డిడిబి అధిపతులు, టిటిడి వారిని కలిసిన వెంటనే యివన్నీ జరగడంతో అదీ డిఫెన్సులో పడింది.

ఇవేమీ చూసుకోకుండా చంద్రబాబు హడావుడిగా స్టేటుమెంటు యిచ్చి యిరుక్కున్నారు. అసలు జులైలో కల్తీ నేతిని లడ్డూలో వాడారనడానికి ఆధారాలు చూపించలేక పోతూ ఉంటే, యిక ఎప్పుడో వైసిపి హయాంలో వాడారని చూపడానికి ఆధారాలు ఎక్కణ్నుంచి వస్తాయి? రాష్ట్ర పోలీసుల చేత కల్తీ నేతిని లడ్డూలో వాడారని కేసు పెట్టించేశారు. దానిపై సిట్ వేసేశారు. సుప్రీం కోర్టు అది పనికి రాదని చెప్పి, సిబిఐ పర్యవేక్షణలో మరో కమిటీ వేసింది. నిజానిజాలు తేలుసుకోకుండా రాజకీయాల కోసం బాబు హిందువుల ఫీలింగ్స్‌తో ఆటలాడుకున్నారని విశ్వహిందూ పరిషత్ దగ్గర్నుంచి చాలా మంది కారాలూ, మిరియాలూ నూరుతున్నారు. అనుభవజ్ఞుడైన బాబే తొందరపాటు చేష్ట చేసి, దాన్ని ఎలా భూస్థాపితం చేయాలా అని చూస్తూ ఉంటే, కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఎకాయెకి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన పవన్ కళ్యాణ్ మరో కోణం తీసుకుని తెగ అడావుడి చేస్తూ ‘సందట్లో సడేమియా’లా తయారయ్యారు.

తనకు సంబంధం లేని, అనవసర విషయాల్లో ఎవరూ పిలవకపోయినా తలదూర్చేవారినీ, గొడవతో ఏమాత్రం సంబంధం లేకున్నా, కలగచేసుకుని, అసలు వాళ్ల కంటె ఎక్కువ హంగామా చేస్తుండే వ్యక్తినీ, “సందట్లో సడేమియా..” అంటారు. అదేమిటి, రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కదా, యింత ముఖ్యమైన విషయంతో సంబంధం లేకపోవడమేమిటి? అని అనకండి. కాబినెట్‌లో ఎందరు మంత్రులు లేరు? వాళ్లందరూ మాట్లాడుతున్నారా? కనీసం దేవాదాయ శాఖ మంత్రి ఆనం మాట్లాడుతున్నారా? ఇది ఒక డెలికేట్ వ్యవహారం. జాగ్రత్తగా హేండిల్ చేయగలిగితే జగన్ని హిందువు లందరికీ వ్యతిరేకం చేయగల దివ్యాస్త్రం, హేండిల్ చేయలేక పోతే తిరిగి వచ్చి తమనే దహించగల ప్రమాదం కూడా ఉన్న అస్త్రం.

అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఉపసంహరించడం కూడా తెలిసినవాడే అసలైన ధనుర్దారి. ఆ విద్య తెలిసినది చంద్రబాబు మాత్రమే అనే భావంతో మంత్రులందరూ కిమ్మనకుండా ఉన్నారు. లడ్డూ అంటూ సర్వత్రా గగ్గోలు పుట్టించగలిగిన బాబు రేపు సిట్ రిపోర్టు తమకు ప్రతికూలంగా వస్తే మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా ప్రజల దృష్టిని మరలించగలిగిన దిట్ట. శాంపుల్ కలక్షన్‌లో సరైన ప్రొసీజర్ అనుసరించ లేదంటూ ఈఓ శ్యామలరావుపై తప్పు మోపి, ఆ పదవిలోంచి తీసేసినా తీసేయగలరు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వస్తున్న ‘కొత్త పలుకులు’ చూడండి. బాబు తల్లికి వందనం, రైతు భరోసా పథకాలు అమలు చేద్దామను కుంటున్నారట, పెండింగు బిల్లులు క్లియర్ చేద్దామనుకుంటున్నారట, కానీ అధికారులు అడ్డం పడుతున్నారట. రూల్సు దాటము అంటూ భీష్మిస్తున్నారట. ఇసుక విషయంలో, మద్యం షాపుల విషయంలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు యిష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ సిండికేట్లుగా ఏర్పడుతూ అవినీతికి పాల్పడుతున్నారట. పాపం గంగిగోవు లాటి బాబు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారట.

ఇలా రాయగలిగినవాళ్లు రేపు ‘లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదు’ అని సిట్ తేలిస్తే అప్పుడేం రాస్తారు? ‘ఈఓ కావాలని బాబుకి తప్పుడు సమాచారాన్ని యిచ్చి తప్పుదారి పట్టించారు. ఆయన వేలు విడిచిన బాబాయి అల్లుడు యీ మధ్యే క్రైస్తవం తీసుకుని జగన్‌తో బంధుత్వం కలుపుకున్నాడు.’ అనవచ్చు. ఇది రాయగానే మీరు ‘ఇది టూమచ్‌గా ఉంది’ అనవచ్చు. 12 అక్టోబరు 2024 నాటి కొత్తపలుకులో రాధాకృష్ణ ‘టిడిపి ఎమ్మెల్యేలలో కొందరు ఆదాయమార్గాల అన్వేషణలో వైసిపి వారితో చేతులు కలపడానికి వెనుకాడటం లేదు.’ అని రాశారు. చావుదెబ్బ తిని, లేచే ఓపిక కూడా లేకుండా పడి ఉన్న వైసిపి వారితో విజేతలుగా వెలుగుతున్న టిడిపి వారు చేతులు కలుపుతున్నారని రాస్తే నమ్మగలమా? రాబోయే రోజుల్లో ఏ టిడిపి ఎమ్మెల్యే ఐనా అవినీతి చేస్తూ పట్టుబడితే, ‘అతని వైసిపి మిత్రులే పురి కొల్పి అతని చేత అలా చేయించారు’ అనడానికి బీజం వేశారని అనుకోవాలి.

చెప్పవచ్చేదేమిటంటే, కాబినెట్‌లో సీనియర్ మంత్రులు, రాజకీయాల్లో తలపండిన వారు, రాష్ట్రంలో అధికారం చలాయిస్తూ నిజమైన ఛోటే మియా అనదగిన లోకేశ్ అందరూ లడ్డూ విషయంలో మౌనంగా ఉండగా, ఋతుపవనంలా అప్పుడప్పుడు రాష్ట్రానికి విచ్చేసే రాజకీయాలు చేస్తూ వచ్చి, కొత్తగా కాబినెట్‌లో చోటు సంపాదించుకున్న పవన్ మాత్రం జగన్‌ను కొట్టడానికి యిదే అదనంటూ రెచ్చిపోతున్నారు. బిజెపితో చేతులు కలుపుతూ వచ్చినా చంద్రబాబుకి సెక్యులర్ యిమేజి ఉంది. మైనారిటీలు ఆయన్ని విశ్వసించే పరిస్థితి ఉంది. దాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నట్లు పూనకం తెచ్చుకుని పవన్ చేస్తున్న ఓవరేక్షన్ నవ్వు తెప్పించటం లేదు. బాధ, భయం కలిగిస్తోంది. ఇప్పటికే కులాల వారీగా చీలిన రాష్ట్రం, యిక మతపరంగా కూడా చీలిపోతుందా అని! ఇతని మాటల వలన హిందువులలో చైతన్యం రావడం మాట ఎలా ఉన్నా, మైనారిటీలు రేడికలైజ్ అయి, మతఉగ్రవాదానికి బీజం పడుతుందా అనే సంశయం కలుగుతోంది.

గతంలో అతన్ని అభిమానించి, ‘మాన్ ఆఫ్ ద మ్యాచ్’గా అభివర్ణించిన విశ్లేషకులు సైతం ఇటీవల పవన్ ప్రలాపాలు విని నివ్వెరపోతున్నారు. ఇలా మాట్లాడిస్తున్నది బిజెపియే అని దాని నెత్తిన బండ పడేస్తున్నారు, సిద్ధాంతపరంగా బిజెపిని ఎప్పుడూ వ్యతిరేకించే వర్గాలు. పవన్‌ను ఏ అఘోరా గానో మార్చేసి, దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో తిప్పేసి, అక్కడ అతని చేత బిజెపి జెండా పాతించేద్దామని చూస్తున్నారని ఊహాగానాలు చేసేస్తున్నారు మరి కొందరు. ఎన్నికల అనంతరం మాట్లాడడానికి యూట్యూబర్లకు సబ్జక్టు ఉండటం లేదు. కానీ రోజూ వీడియో చేసే అలవాటు మానుకోలేక పోతున్నారు. అందుకని చెప్పినదే చెప్పి, చెప్పినదానికే కాప్షన్లు మార్చి, పాతవాటినే కొత్తగా అప్‌లోడ్ చేసినట్లుగా భ్రమింప చేస్తూ అవస్థలు పడుతున్నారు.

వాళ్లకి పవన్ ఒక అక్షయనిధిలా మారాడు. వాళ్లకు ఫీడ్ చేయడానికి యితను ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. అతని ప్రతి మాటా, ప్రతి చేష్టా న్యూస్‌వర్దీగా మారింది. తమాషా ఏమిటంటే వీటిలో ఏదీ పరిపాలనకు సంబంధించిన అంశం కాదు. ఓ పది రూపాయలు ఎక్కువ యిస్తాం కానీ.. వాలంటీర్ల ఉద్యోగాలు ఎక్కడికీ పోవు అని యిచ్చిన హామీ ఏమైందో, 33వేల మిస్సింగ్ గర్ల్స్‌లో ఎంతమందిని యింటికి చేర్పించారో, మోదీ, అమిత్‌లతో ఉన్న తన పలుకుబడితో వరద సాయం కాదు, స్టీలు ప్లాంటు కాదు, మరోటి కాదు, కేంద్రం నుంచి యీయన ఏం సాధించుకుని వచ్చాడో.. వీటి గురించి ఎవరూ చెప్పరు, ఆయనా చెప్పడు. వరదబాధితులను చూడడానికి రాలేదేం? అంటే జనం మూగుతారని అంటాడు. మళ్లీ తిరుమల కాలిదారిలో ఆపసోపాలు పడుతూవుంటే జనం మూగుతారన్న జంకు లేదా? ఎన్నికల ప్రచారంలో వారాహి యాత్రలు చేసినప్పుడు ఆ భయం లేదా? ఒక్క మాటకూ లాజిక్ ఉండదు.

ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ప్రకటించినప్పుడే అందరూ నివ్వెర పోయారు. తప్పు చేసినవాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఈయనేం తప్పు చేశాడు? దీక్ష అంటాడు, మధ్యలో ‘‘హరిహర వీరమల్లు’’ సినిమా షూటింగు అంటాడు, విజయవాడలో దేవాలయం మెట్లు కడిగి పసుపు, కుంకుమలు అద్దానంటాడు. ఎన్టీయార్ యిలాటివే చేసి, సన్యాసి వేషం వేసి, వివేకానందుడి తలపాగ పెట్టి, (కొంతకాలానికి మళ్లీ సంసారియై, రంగురంగుల బట్టలేశాడనుకోండి) నవ్వుల పాలయ్యాడు. కన్యను వివాహమాడి అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ ప్రతిపక్ష కాంగ్రెసు యాగీ చేసింది, సినిమాలు తీయించింది. ఎమ్జీయార్ ముఖ్యమంత్రి అయ్యాక ‘‘ఉన్నై విడమాట్టేన్’’ (నిన్ను విడిచిపెట్టను) అనే పేరుతో సినిమా తీయబోయి, ప్రజలు ఆగ్రహిస్తారని, జంకి మానేశాడు. కానీ ఎన్టీయార్ పదవిలో ఉంటూనే ‘‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’’ తీసి, ప్రజలకు చికాకు తెప్పించాడు. పదవెందుకు? సినిమాలు వేసుకో అని యింటికి పంపేశారు. కుర్చీలో కూర్చున్న ఐదేళ్ల పాటైనా మా సేవకు అంకితం కమ్మనమని ప్రజల కోరిక. ఓ పక్క పూజలూ, మరో పక్క సినిమాలూ అంటే వాళ్లు విస్తుపోరా?

ఇవన్నీ ఒక యెత్తు. హిందూ యోధుడిగా అవతార మెత్తడం మరో ఎత్తు. ఒకవేళ లడ్డూలో కల్తీ జరిగిందన్నా, హిందూమతానికి విఘాతం కలిగినట్లు కాదు, ఆ ఆలయనిర్వహణ అలా అఘోరించిందనే అర్థం. హిందూమతం ఏదో ఒక గుడిలో, ఓ విగ్రహంలో, ఓ ప్రసాదంలో, లడ్డూ నేతిలో నిలిచి లేదు. భూకంపంలో గుడి కూలినా, యిరిగేషన్ ప్రాజెక్టులో మునిగినా, దండయాత్రల్లో పగిలినా – అనాదిగా హిందూమతం వర్ధిల్లుతూనే వస్తోంది. ఎందుకంటే అది ఒక భావన. గుండెల్లో ఉండేది. ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపించేది. ఇప్పటికిప్పుడు అర్జంటుగా హిందూమతానికి ఏదో ముప్పు వాటిల్లినట్లు హంగామా చేయడం హాస్యాస్పదం.

సనాతన ధర్మం జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను అంటూ పవన్ రంకెలు వేయడం ఎవరికీ అర్థం కావటం లేదు. సనాతనం అంటే ఏమిటి? ఎటర్నల్, శాశ్వతమైనది అని అర్థం. శాశ్వతమైన దానికి ఎవరైనా హాని చేయగలరా? చేయగలరని నమ్మితే, అది శాశ్వతమైనదనే నమ్మకం నీకే లేదన్నమాట. చాలామంది సనాతన పదానికి, పురాతన పదానికి కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అందువలన పవన్‌ను విమర్శిస్తూ ‘సనాతనం అంటే సతీసహగమనాలు, బాల్యవివాహాలు, పటిష్టమైన వర్ణవ్యవస్థ, హరిజనులపై వివక్ష అన్నీ తిరిగి రావాలా? వితంతు పునర్వివాహాలు కూడవంటావా? మనుస్మృతిని రాజ్యాంగంగా స్వీకరించమంటావా? సముద్రయానం కూడదంటావా?’ అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. వీటికి వేటికీ పవన్ సమాధానం యివ్వటం లేదు. సనాతన ధర్మం అనే పల్లవి ఒక్కటే పట్టుకుని రాపాడిస్తున్నాడు తప్ప దాన్ని నిర్వచించటం లేదు.

కేవలం ధర్మం అని ఉంటే చిక్కు లేకపోయేది. ధర్మం పరిరక్షింపడాలని, ధర్మానికి గ్లాని కలుగకూడదని అందరం కోరుకుంటాం. పైగా ధర్మం యుగం బట్టి మారుతుందనీ అందరికీ తెలుసు. మతాన్ని ఆచరించేటప్పుడు కొంతకాలానికి సంస్కరించ వలసిన అవసరం పడుతుందని భావించి, కొందరు సంస్కరణలు తెస్తారు, కొందరు ఛాందసులు దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఎక్కువమంది దేన్ని ఆదరిస్తే అదే కొత్త ధర్మంగా మారుతుంది. ఇది ఏ మతానికైనా వర్తిస్తుంది. కాలాన్ని వెనక్కి తిప్పాలని చూస్తే అది బెడిసి కొడుతుంది. కొందరు పీఠాధిపతులు పాత పద్ధతులను పొగుడుతూ ప్రసంగాలు చేసినా, ప్రజలు విని ఊరుకుంటారు తప్ప ఆచరించరు. ఇప్పటికే హిందూ, హిందూత్వ పదాల మధ్య గందరగోళంలో పడి కొట్టుకుంటున్నాం. దేని నిర్వచనం ఏదో తెలియటం లేదు. పవన్ యిప్పుడు కొత్తగా ధర్మం, సనాతన ధర్మం మధ్య గందరగోళం తెచ్చిపెట్టారు.

ఇలాటి పదాలు ఎవరైనా ప్రవచనకారులకు, పీఠాధిపతులకు నప్పుతాయి తప్ప పవన్‌కు కాదు. ఆయన తలిదండ్రులది కులాంతర వివాహమైతే, ఆయనది మతాంతర, దేశాంతర వివాహం. ఆయన మొన్నటిదాకా చెప్పుకున్నది విప్లవం, ఆదర్శం, చే గువియెరా, విశ్వమానవ తత్త్వం. ఇప్పుడు హఠాత్తుగా పూజారి వేషం కడితే రక్తి కడుతుందా? నా భార్యది రష్యన్ ఆర్ధోడాక్స్ చర్చ్, నా కూతురు బాప్టిజం తీసుకుంది, బీఫ్ తింటే తప్పేముంది?.. యిలాటివన్నీ చెప్తూ దశావతారాలు ఎత్తిన పవన్ హఠాత్తుగా యింకో అవతారం ఎత్తితే ప్రజలకు జీర్ణం కావద్దూ? కాలం గడుస్తున్న కొద్దీ అభిప్రాయాలు మారవచ్చు, మత విశ్వాసాలు మారవచ్చు, తప్పేమీ లేదు. కానీ నా నమ్మకాలు మారాయి, యిప్పణ్నుంచి యిదే ఆచరిస్తాను అని చెప్పేస్తే గొడవ లేదు. పాతవి తవ్వి తీసి, ప్రశ్నలు గుప్పించరు.

సరే, పవన్ ఛాందసం వైపు మరలుదామనుకుంటే మరలవచ్చు. అంతమాత్రాన యితరులపై దాడి ఎందుకు చేయడం? ఉదయనిధి స్టాలిన్ యిలా అన్నాడు అంటూ అతనిపై పడడం దేనికి? కరుణానిధి కుటుంబానికి అది అలవాటైన వ్యవహారమే! గుళ్లకు వెళుతూనే ఉంటారు, మధ్యమధ్యలో యిలాటి స్టేటుమెంట్లు వదులుతూనే ఉంటారు. వాళ్ల గోలా, వాళ్ల రాజకీయాలూ వాళ్లవి. దాన్ని సహిస్తారో, ఆదరిస్తారో ఆ రాష్ట్రప్రజలు చూసుకుంటారు. గత ఏడాది అతనా మాట అన్నాక, అక్కడి బిజెపి దానిపై చాలా ఆందోళనే జరిపింది. అయినా ఎన్నికలలో ఏమీ లాభించలేదు. ఇప్పుడీయన వెళ్లి కెలకడం దేనికి? ఆంధ్రలో అర్జంటుగా ఎటెండ్ కావలసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. పరిపాలన యింకా గాడిలో పడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఒకటి తీసుకుని, యీ విషయాలపై దృష్టి పెట్టకుండా, పొరుగు రాష్ట్రనాయకుల ప్రకటనలపై పేచీ పెట్టుకోవడం దేనికి?

ఏదైనా మతకలహం జరిగి, హిందువుల ఆలయాలకో, ఆస్తులకో నష్టం కలిగితే, రక్షించడానికి హిందూవీరుడిగా వేషం కడితే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాటిదేదీ జరగకుండానే, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, హిందువులను రెచ్చగొట్టడానికి చూడడం మాత్రం క్షమార్హం కాదు. ‘ఇదే ముస్లిముల్లో జరిగితే ఊరుకుంటారా? క్రైస్తవుల్లో జరిగితే ఊరుకుంటారా? మీరెందుకు ఊరుకుంటున్నారు?’ అంటూ విద్వేషం రెచ్చగొట్టడం దేనికి? మధ్యలో సెక్యులరిజాన్ని తిట్టడం దేనికి? లడ్డూలో కల్తీ అంటూ జరిగితే హిందువులు ఆగ్రహం చూపాల్సింది ఎవరి మీద? టిటిడి అధికారులపైనా? లేక అన్యమతస్తుల పైనా? మధ్యలో వాళ్లెక్కణ్నుంచి వచ్చారు?

మతం పేర ఎవరు అవేశపడి, ప్రత్యక్షచర్యకు దిగినా ఖండించ వలసినదే. వారి ఆవేశకావేషాలు చల్లార్చి పౌరజీవితానికి విఘాతం కలగకుండా చూడవలసిన బాధ్యత కలిగిన పాలకులు, తామే ‘మీకు పౌరుషం లేదా’ అంటూ ఉసి గొల్పి, మతకలహాలు వచ్చే పరిస్థితి కల్పించడం ఏ విధంగా సమర్థించుకో గలరు? అత్యంత బాధ్యతారహితమైన చర్య యిది. దీనిపై విమర్శలు వచ్చినప్పుడైనా పవన్ దూకుడు తగ్గించుకోవాల్సింది. కానీ ఆయన దూకుడు తగ్గటం లేదు. కాబినెట్ సీనియర్‌గా, కూటమి నేతగా చంద్రబాబైనా తగ్గు నాయనా అనైనా చెప్పాలి. నాకు తెలిసి ఆంధ్రలో కులఘర్షణలు జరిగాయి తప్ప, మతకలహాలు జరగలేదు. పవన్ పుణ్యమాని అవీ మొదలైతే దేవుడే రాష్ట్రాన్ని రక్షించాలి.

ధర్మపాలన గురించి పరివ్రాజకులు మాట్లాడితే వినగలం. వివాహం మాట ఎత్తకుండా ఏళ్ల తరబడి సహజీవనం చేసినవారు, వైవాహిక బంధంలో ఉంటూనే యితర స్త్రీలతో సంసారం చేసి, పిల్లల్ని కన్నవారూ ధర్మాచరణ గురించి మాట్లాడితే మనకు మింగుడు పడదు. పరిపాలన విషయాల్లో వ్యక్తిగత జీవితం ప్రస్తావన రాదు, కానీ మత ప్రవచనాలకు, నీతిబోధలకు దిగితే మాత్రం తప్పకుండా వస్తుంది. ఈ ధర్మరక్షణ పాత్రను వేరెవరికైనా యిచ్చేసి, పరిపాలనాదక్షుడి భూమికను చేతనైనంత బాగా పోషించి, తనపై ఆశలు పెట్టుకున్నవారి ఆకాంక్షలు పవన్ నెరవేర్చాలని నా బోటి వారి ఆశ.

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2024)

[email protected]

118 Replies to “ఎమ్బీయస్‍: సందట్లో సడేమియా”

  1. పరమత సహనం పాటిస్తూనే మన ధర్మాన్ని సంప్రదాయాలను గౌరవించండి అని చెప్పడాన్ని మత చాందసం అని అంటారా….దాని వల్ల మత కలహాలు వస్తాయా…..ప్రజలకు మంచి చెడు అర్థం చేసుకునే విజ్ఞత పెరిగింది అని అర్థం చేసుకోకుండా ఇలా బురద చల్లుతున్నారు అంటే ….మీ vote bank politics కి permanant end card పడే రోజు దగ్గర్లోనే వుంది అని భయపడుతున్నారా…..

  2. పరమత సహనం పాటిస్తూనే మన ధర్మాన్ని సంప్రదాయాలను గౌరవించండి అని చెప్పడాన్ని మత చాందసం అంటారా…..దానివల్ల మత కలహాలు పెరుగుతాయా….🙏🙏🙏 ప్రజలకు మంచి చెడు అర్థం చేసుకునే విజ్ఞత, జ్ఞానం లేదు, ఎప్పటికీ రాదు అని మీరు బలంగా నమ్ముతున్నారా…..so sad…

    1. అలా నేను చెప్పానా? ఎవరైనా చెప్పేది, తన మతాన్ని ఆచరిస్తూ, యితర మతాలను సహించమనే! పవన్ ప్రస్తుతం చేస్తున్నది అది కాదు. మీకు పౌరుషం లేదా? అంటూ హిందువులను రెచ్చగొడుతున్నారు. అంత సందర్భం ఏమొచ్చింది? అని నేనడుగుతున్నాను.

      ప్రజలకు విజ్ఞత… లేదు, రాదు అని నేననటం లేదు. ఉప ముఖ్యమంత్రి కంటె ఎక్కువ విజ్ఞత ఉంది కాబట్టే ఆయన రెచ్చగొట్టినా, వాళ్లేమీ రెచ్చిపోయి అల్లర్లకు దిగలేదు. రాష్ట్రం శాంతంగా ఉంది.

      1. Alayala paina dhadi, prasadam kalthi chesthe sahinchala ?, ala jaragadhu eka, evadiki Ela samadanam cheppalo alane chestham…

        Pawan Kalyan rechagottaledu, nijame matladadu… Nee neethulu vere vallaku cheppuko po

          1. ప్రతీదానికీ నెహ్రూ ఫ్యామిలీ అంటూ ఎన్నాళ్లు పొద్దు పుచ్చుతారు? ఓ పక్క హిందూమతానికి వ్యతిరేకంగా, దాన్ని హీనంగా చిత్రిస్తూ పుస్తకాలు వెలువడుతున్నాయి. వాటిని మేధోపరంగా ఎదుర్కునే ఆలోచన లేదు. ఆ దిశగా అడుగులు పడవు. అదీ విషాదం.

          2. మేధోపరం గా అంటే … ఏ మాటకి ఆ మాట … మీరు చెప్తే వింటున్నారా … కాలికేస్తే వేలికి వెలికేస్తే కాలికి

        1. …ఎవరు ఏమి చేసినా..?

          ఇప్పుడు ఏం జరిగింది? అదీ ప్రశ్న

          ఇన్నాళ్లూ మతం లేదు, విప్లవకారుణ్ని, మరోణ్ని అంటూ వచ్చిన పవన్‌ యీ అవతారం ఎత్తడానికి కారణం ఏమిటి? అనేదే నా ప్రశ్న

          1. ప్రసాదం కల్తీ అయిందని ఎవరు తేల్చారు?

            ఒకవేళ కల్తీ అయితే టిటిడి అధికారులది తప్పు. దీనిలో మత ప్రమేయం ఏముంది? దుర్గ గుడిలో, సింహాచలం గుడిలో దొంగతనాలు జరిగినప్పుడు యిలా మతం గురించి మాట్లాడారా?

          2. Evaru thelchasina avasaram ledu, practical ga thinna andariki thelusu… Aa TTD adikarulni niyaminchindi evaru… Venkateswara swamy paina comment chesinollani EO chesindi evaru…Gudu lo simhalu dongalinchindi evaro pattukunnara, ledu Anni dacharu…

          3. అదేలెండి అందరూ అన్ని మీకు చెప్పి చేయాలి … సంతకం ఎందుకు పెట్టలేదు అని అడగడానికి మొహం రాదు …

      2. అసలు మత కలహాలు అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది….ఎవరి మతానికైన against గా మాట్లాడాడా…మన సంప్రదాయాల్ని మనమే హేళన చేసుకోవడం తప్పు అని చెప్తే ఎందుకు బాధ…హిందువులను ఎవరి మీద ఐనా దాడి చెయ్యమని రెచ్చగొట్టడా…ఎందుకు భయం… ఎందుకు ఇలా భుజాలు తడుముకోవడం…

        1. మన సంప్రదాయాల్ని మనమే హేళన చేసుకోవడం తప్పు అని చెప్తే ..

          • అలా చెప్పాడా? పౌరుషం లేదా? అని మాట్లాడలేదా? ఇదే ముస్లిములైతే ఊరుకుంటారా? క్రైస్తవులైతే ఊరుకుంటారా? అని అనలేదా? ఏదో దేశంలో ఎవడో ప్రవక్త మీద కార్టూన్ వేస్త్ పలు దేశాల్లో ముస్లిములు ప్రదర్శనలకు దిగుతారు. హిందువులు కూడా అలాగే చేయాలని పవన్ భావమా? రేడికలైజేషన్ ఎప్పుడూ ప్రమాదకరం. ఏ మతం వారు రేడికలైజ్ అయినా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. భుజాలు తడుముకోవడం ఏముంది దీనిలో?
          1. రాడికలైజేషన్ అనేది మెజారిటీలో ఉన్నవాళ్లకి ఉండదండి….అసలు హిందువులకి ఆ స్పృహ ఉండదు…ఎందుకు అంటే సహనం ఎక్కువ …ఒకపక్క రెచ్చిపోలేదు అంటారు…ఇంకోపక్క రాడికలైజేషన్ అంటారు

          2. అవును వాళ్ళు ఊరుకోరు…ఎన్నొ నిరసనలు చేస్తారు కద? పవన్ అన్నది అదే, దాడి చేయమని కాదు..

      3. నీకు సిగ్గు సరము లేదు ప్రసాదు చంద్రబాబు , పవన్ చేసింది కొంచము ఓవర్ అయ్యింది

        కానీ

        అస్సలు తప్పు జరగలేదు అని చెప్పటానికి

        నువ్వు తినేది అన్నమా జగన్ పెంట??

      4. ఇప్పుడు పవన్ తప్పుచేశాడు అని తీర్పు ఇస్తున్నావు అంతే కదా… జగన్ అమాయకుడు ముత్యం అంటావు. అట్లే అను అనుకుంటా బతికేసేయ.

        1. జగన్ మాట నేను రాశానా? మీరు ఊహించుకుంటే దాన్ని మీ దగ్గరే పెట్టుకోండి, నాపై రుద్దకండి.

          1. మీరు మటుకు మీ ఊహలని ఆర్టికల్స్ గా రాస్తూ మా మీద రుద్దవచ్చు … అసలు మీ ఆరోపణలు అని మీ ఊహలే గా రుజువులు ఉన్నాయా ?

      5. నీ లాంటోల్లు ఉన్నంత వరకు పరమతం వాళ్ళు చెలరేగి పోతారు, మీకు మీ నాయకుడు బాగుంటే చాలు, మీ వాడు కాకపోతే కాలు పట్టుకొని లాగి అవతల పడేస్తారు. పవన్ చేసిన దానికి ప్రజలు రెచ్చిపోయి గొడవలు చేస్తే మీ ఏడుపు వేరేలా ఉండేది

      6. పవన్ ఏమి రెచ్చగొట్టాడు? ఇలా ప్రశ్నించేవాడుంటే రేపు ఎవడైన తప్పు చేయడానికి భయపడ్తాడు. ఆ విషయాన్ని పవన్ ఎప్పుడో చెప్పి వదిలేసాడు, మీలాంటి వాళ్ళె ఇంకా పట్టుకొని వెలాడుతున్నారు…

  3. మీ vote bank politics కి permanent end card పడే రోజు దగ్గర్లోనే ఉంది అని భయపడుతున్నారా….

  4. అర్జెంటు గా ఒక రెఫరెండం లాంటిది తెచ్చి సడే మియాకి వీడుకోలు చెప్పాలి? అంతేగా ?

    అదే కేంద్రం లో కాంగ్రెస్ ఉంటే ఈపాటికి బాబు ప్రభత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన తెచ్చేది .

  5. దేశంలో హిందువులపై, దేవుళ్ళపై, సనాతన ధర్మం పై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మాకు కనిపిస్తోంది.. కాబట్టి సనాతన ధర్మానికి ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు అనొద్దు. ఇప్పుడే ఆ ప్రమాదాన్ని ఆపాలి.. మీరు ఒప్పుకొనవసరం లేదు కానీ లేదు అని ఆర్టికల్స్ రాయొద్దు..

    1. జనరలైజ్ చేయకండి. ఆంధ్రలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? హిందువులను రెచ్చగొట్టడం అవసరమా? అనేది చెప్పండి.

      మీరూ సనాతన ధర్మం అనే పదం వాడారు, హిందూమతంపై అని ఉంటే నాకు అర్థమయ్యేది. సనాతన ధర్మం అంటే ఏమిటో కాస్త నిర్వచించండి

      1. H8dnhuvulaku ఎంత నిద్ర లేపిన అంత రెచ్చి పోరు లెండి .కింద ఉంది అణిగి పోవడం అన్ని మ తలని అద్దరించడం హిందువులకి మా గొప్ప అలవాటు .కుల పిచ్చి మాత్రం విలువ ఎక్కువ మాకు .అసలు చాలా మంది హిందువులకి తాము ఐదు అనే ఫీల్ కూడా ఉండదు రెడ్డి చౌ. బ్రహీమీన్ అని తప్ప.మీలాంటి వాళ్ళకి అంత భయం అక్కరనే లేదు

      2. అస్సలు హిందూయిజం నీ విమర్శించటం ఫ్యాషన్ అయిపోయింది.. హిందువులు చేసీవి అన్నీ. మూర్ఖం అంట

        మరి అన్ని మతాల్లో మూర్ఖంగా చేసే పనులు ఉన్నవి వాటి గురుంచి మాట్లాడాలి అంటే సూ సూ కారుతుంది

    1. ఎందుకో వివరించ గోర్తాను. ఉప ముఖ్యమంత్రి గారి ప్రలాపనలను జనం పట్టించుకోలేదు, మీరు మాత్రం పట్టించుకుని వ్యాసం రాయడమెందుకు? వృథా ప్రయాస… అని మీ అభిప్రాయమా?

  6. వివేకం లేని జనాల మధ్య ఎన్ని లాజిక్కులుతో గొంతు చించుకున్న గంట మోగదు.

  7. వివే LLLకం లేని జనాల మధ్య ఎన్ని లాజిక్కులుతో గొంతు చింLచు కుLన్న గంట మోగదు.

  8. వి:వే:కం లేని జనాల మధ్య ఎన్ని లా::జిక్కు::లుతో గొం::తు చిం::చు::కున్న గం::ట మో::గ::దు.

  9. ఇన్నాళ్ళకు ఒక విషయం స్పష్టంగా విశదమయ్యింది. శాంతి మంత్రం పఠిస్తూ విశ్వమానవకళ్యాణం కోసం పని చేసే శాంతిప్రియమతస్తులు పవన్ కళ్యాణ్ మూలంగా రాడికలైజ్ అయిపోయే ప్రమాదం ఉందని అర్ధం అయిపోయింది

    రాడికలైజ్ కాకపోతేనే దేశంలో అన్ని బాంబులు పేల్చి జనాన్ని చంపి, ఎక్కడ హిందూ ఉరేగింపు జరిగితే అక్కడ జరిపే హింస, వాళ్ళు ఆధిక్యంలో ఉన్నచోట మిగిలినవాళ్ళను బ్రతకనీయని తత్వం ఉంటే, రాడికలైజ్ అయితే బహుశా సిరియా లెబనాన్ గాజా కావచ్చని అయ్యవారు మనను హెచ్చరిస్తున్నారు.

    ఉగ్రవాదానికి మతం ఉండదు కదా . అంటే స్వతంత్రానికి ముందూ స్వతంత్రం తరువాత జరిగినవన్నీ రాడికలైజ్ కాకుండానే కదా. అచ్చం గాంధీతాత చెప్పింది కూడా ఇదే ఇదే

  10. Clearly Pawan Kalyan has become a BJP stooge. All this drama was to help BJP in Haryana and JnK elections by making this a national issue. Guess it worked to an extent also. Since PK is very clear that Babu is not going to let him grow and be the next CM (Babu is grooming Lokesh for that), he is trying to grow his own following to help BJP in the future.

  11. “నాకు తెలిసి ఆంధ్రలో కులఘర్షణలు జరిగాయి తప్ప, మతకలహాలు జరగలేదు.” అని రాశారు రచయిత గారూ..

    తెలంగాణ విడిపోయిన తర్వాత అనే ఉద్దేశ్యం లో రాశారా?

    మా చిన్నప్పుడు చాలాసార్లు హైదరబాద్ లో మతకలహాలు అనే న్యూస్ చాలా సార్లు చదివి ఉన్నాము. అప్పట్లో హైదరబాద్ ఆంధ్ర లోనే ఉంది.

    1. ఒక అయిదారేళ్ళ క్రితం మార్కాపురం దగ్గర వినయకనిమజ్జనం సంధర్భంగా హిందువుల (బోయ & వ్యైశ్య) మీద జరిగింది మతదాడి కాదా ? 1999 ప్రాంతాలలో ఒంగోలు చర్చిల్లో కృష్ణలంక రామాలయం మీద, బందరు క్రైస్తవసభ మీద జరిగింది మతఘర్షణ కాదా ? అప్పుడే గుంటూరు బస్ స్టాండ్ లో చేసిన అల్లకల్లోలం మతదాడి కాదా ? అందులో హిందువుల షాపులను ధ్వంసం చేసింది మతదాడి కాదా ?

      మనకు జ్ఞాపకశక్తి తక్కువ కాబట్టి సెక్యులర్ పుణ్యపురుషులు ఎప్పటికప్పుడు చరిత్రకు తెల్లసున్నం రాసి మభ్యపరుస్తుంటారు. జిహాదీలకు అసలు బలం వాళ్ళ మతపెద్దలు కాదు, హిందువుల్లోని ఈ సెక్యులర్ సత్రకాయగాళ్ళు

    2. ఆంధ్ర అంటే ఆంధ్ర ప్రాంతమనే అర్థంలో రాశాను. తెలంగాణలో మతకలహాలు చాలా జరిగాయి.

      నాకు తెలిసి.. అని క్వాలిఫై కూడా చేశాను. ఎందుకంటే ఒకటో రెండో జరిగితే అవి ప్రజల మనసుల్లో యింకలేదు. మతం పేర ఓట్లడగడం తెలంగాణ ప్రాంతంలో ఉంది. మజ్లిస్, దానికి దీటుగా ఆరెస్సెస్, జనసంఘ్, బిజెపి, తెలంగాణలోనే యాక్టివ్‌గా ఉన్నాయి. ఆంధ్రలో వాటి కార్యకలాపాలు పెద్దగా లేవు. జగన్ హయాంలో దేవాలయాల్లో రథాల దహనం వంటి జరిగినా సత్వర చర్యలు తీసుకోవడం వలన ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.

  12. ఎంత మసి పూసి మారేడుకాయ ఆర్టికల్ రాసినా లడ్డులో నెయ్యి కల్తీ అయింది అన్నది నిజం. టిటిడి ఈఓ చెప్పింది కూడా అదే కల్తీ నెయ్యి మూలంగా లడ్డు సరిగ్గా లేదు అని ఆంధ్ర మొత్తం తెలుసు . లీగల్ గా ఏమి జరుగుతుందో , అని నిందితుల ఆర్గ్యుమెంట్లు మాకెందుకు. తప్పించుకోవడాని నిందితుడు అలాగే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. గుడిలో ఉంటూ రూల్స్ మార్చి ఇలా చేసిన దాన్ని కేవలం ఆర్థిక నేరం అనరు. సంస్థ ప్రతిష్ట ను మంట కలిఫై భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్య అంటారు

  13. ఎవడు జోకర్ అవుతాడో ఎవడు హీరో అవుతాడో అది కాలం ప్రజలు నిర్ణయిస్తారు ఇక ఒకరు రెచ్చి గిడితే రెచ్చి పోయి స్వభావం ఇక్కడ లేదు పక్కితోడు ఇంటికి పోలీసు వస్తేనే భయ పడి చచ్చే భయస్తులు మా వొళ్ళు లేక పోతే ఊరు ఊరు వెళ్లి క్రిస్టియన్ పోస్టర్ లు అంత విచ్చ ల వీ ది గా ప్రచారం చెయ్య గలిగే వారా ?

    1. పాస్టర్లు విచ్చలవిడిగా ప్రచారం చేసి విజయం సాధించడానికి కారణమేమిటో హిందువులు ఆత్మపరిశీలన చేసుకుని యింకా సంస్కరించుకోవాలి. రెచ్చిపోనక్కరలేదు, హిందువులమంతా ఒక్కటే అనే భావన అందరిలో కలిగించాలి. ఈ సాధువులు, పీఠాధిపతులు దళితవాడలకు వెళ్లి ప్రచారం చేయాలి.

      1. దురదృష్టవ శాత్తూ అది ఎప్పటికీ సాధ్యపడదు, ఎందుకంటే ఎవరైనా ముందుకు వచ్చి ఏదో చేద్దాం అనుకుంటే అతన్ని ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చూస్తాం తప్ప మన మ*తా*నికి ఏదో ఉద్దరిస్తున్నాడు అని చూడం, మనకు సంబంధించిన పార్టీ నాయకుడు కాకపోతే చాలు నిందిస్తాం లేదా ఇలాగ పంకాలు పుంఖాలు గా ఆర్టికల్స్ రాస్తూ పోతాం

        మాకు ఆ ఇబ్బంది లేదు అందుకే మాకు మాకు గొడవలు రావు, మాలో కూడా చాలా denominations ఉన్నా కానీ ఎలాంటి గొడవలు ఉండవు.

      2. ఎవరు ఏం చేసిన ఆత్మపరిశీలన మటుకు చేసుకోవాలి … చంపితే చచ్చిపోవాలి… మారు మాట్లాడకూడదు

  14. కేవలం నేతి విషం లోనే ఎందుకు అంటే పంది కొవ్వు గేదె కొవ్వు కలపవచ్చు 
    మిగతవి 3వ తరగతి వాడిన మనకి వచ్చిన ఇబ్బంది లేదు
    1. నేతిలో అవి కలిపారో లేదో లాబ్ యితమిత్థంగా చెప్పలేదు

      2) ఏం కలిపినా, ఆ నేతిని వాడలేదని ఈఓ చెప్తున్నాడు

      3) ఒకవేళ కల్తీ జరిగినా, అక్కడున్న అధికారులది, బోర్డు వాళ్లని దండించాలి

      4) మధ్యలో అన్యమతస్తులు ఎక్కణ్నుంచి వచ్చారు?

  15. జగన్ మేనత్త తల్లి బైబిల్ పట్టు కొని అనిల్ కుమార్ ప్రార్థన కూడికల్లో మనోళ్లు అంత జగన్ కి వెయ్యాలి అని అడగడం సెక్యులర్ మేధావులకు కనిపించదు తావు లకు తావులు ఆర్టికల్స్ అప్పుడు రాయరు .ఎందుకంటే ఇండియా లో సెక్యులరిజం అంటే అర్థం వేరు గా ఉంటుంది

    1. రుద్రాక్ష మాలలు మెడలో వేసుకుని, కాశీతాళ్లు చేతికి చుట్టుకుని, సన్యాసి దుస్తులు వేసుకుని ఎన్నికల సభల్లో మాట్లాడేవాళ్లు, శిఖ్కు మతాచారాలతో వచ్చి మాట్లాడేవాళ్లు, ముస్లిం వస్త్రధారణలో వచ్చి మాట్లాడేవాళ్లు.. యింతమంది ఉండగా కేవలం బైబిల్ పట్టుకుని మాట్లాడేవాళ్ల గురించే ఎందుకు మాట్లాడుతున్నారు స్వామీ?

      1. మన state లో direct గా ఇలా మతాన్ని అడ్డుపెట్టుకొని… church లకు వచ్చే జనాన్ని votes కోసం ఎమోషనల్ black mail చేసే పార్టీ ఎవరిది….చెప్పండి… polarisation ఎప్పుడు రెండు వైపులకు వుంటుంది అని అర్థం చేసుకుంటే మంచిది…..simple…

      2. అంటే బైబిల్ పట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళని సమర్ధించాలన్న మాట!

      3. ఏం సమర్డిస్తున్నావు సామి, స్వామి భక్తి చాలా ప్రదర్శిస్తున్నారు, తప్పు లేదు కానీ…న్యూట్రల్ జర్నలిజం అని పేరు పెట్టుకొని ఇలా ఆర్టికల్ రాయటం నైతికత కాదు, ఆలోచించండి.

        1. చేతిలో బైబిల్ పెట్టుకుని మాట్లాడడం గురించా? మత సభల్లో రాజకీయ ప్రచారం గురించా? దేని గురించి మాట్లాడదాం? మతసభల్లో రాజకీయాలు మాట్లాడడం స్వాతంత్ర్య సంగ్రామ కాలం నుంచి ఉంది.

          1. గుడ్డి ముండాకొడకా… తప్పు గురించి చెబితే ఏవో గుడ్డి పోలికలు తెస్తావా…. చూస్తుంటే జగన్ గాడు వాడి కుటుంబం దోపిడీ చేసినా కూడా, దోపిడీలు రాజుల కాలం నుండి వున్నాయి అనేలా వున్నావు… నీ గుడ్డి తెలివి లో గాడుదులు ఉచ్చపోయా, కోళ్లు పెంట లాగ ఉందిరా నీ యవ్వరం. పని పాట లేని పనికి మాలిన చెత్త నాకొడకా

          2. ఏదో చెప్పి మీ జగ్గాయ్ గాన్ని యనకేసుకొస్తావు గానీ తప్పు ఒప్పుల జోలికి వెళ్ళను అంటావ్.. నువ్వు ఎలాంటి ఏబ్రాసి గానివివో చెప్పడానికి ఇదొక్కటి చాలు..

          3. తప్పు గురించి చెబితే ఏవో గుడ్డి పోలికలు తెస్తావా…. చూస్తుంటే జగన్ గాడు వాడి కుటుంబం దోపిడీ చేసినా కూడా, దోపిడీలు రాజుల కాలం నుండి వున్నాయి అనేలా వున్నావు… నీ గుడ్డి తెలివి లో గాడుదులు ఉచ్చపోయా, కోళ్లు పెంట లాగ ఉందిరా నీ యవ్వారం . పని పాట లేనోడు పస లేని వాదం తో తిరుగుతున్నాడు అన్నట్లుంది

          4. తప్పు గురించి చెబితే ఏవో గుడ్డి పోలికలు తెస్తావా…. చూస్తుంటే జగన్ గాడు వాడి కుటుంబం దోపిడీ చేసినా కూడా, దోపిడీలు రాజుల కాలం నుండి వున్నాయి అనేలా వున్నావు.. పని పాట లేనోడివి ఇలాంటి పసలేని వాదనతోనే బతికేసేయ్….

  16. “నాకు తెలిసి ఆంధ్రలో కులఘర్షణలు జరిగాయి తప్ప, మతకలహాలు జరగలేదు.” 

    ఒక అయిదారేళ్ళ క్రితం మార్కాపురం దగ్గర వినయకనిమజ్జనం సంధర్భంగా హిందువుల (బోయ & వ్యైశ్య) మీద జరిగింది మతదాడి కాదా ? 1999 ప్రాంతాలలో ఒంగోలు చర్చిల్లో కృష్ణలంక రామాలయం మీద, బందరు క్రైస్తవసభ మీద జరిగింది మతఘర్షణ కాదా ? అప్పుడే గుంటూరు బస్ స్టాండ్ లో చేసిన అల్లకల్లోలం మతదాడి కాదా ? అందులో హిందువుల షాపులను ధ్వంసం చేసింది మతదాడి కాదా ?

    మనకు జ్ఞాపకశక్తి తక్కువ కాబట్టి సెక్యులర్ పుణ్యపురుషులు ఎప్పటికప్పుడు చరిత్రకు తెల్లసున్నం రాసి మభ్యపరుస్తుంటారు. జిహాదీలకు అసలు బలం వాళ్ళ మతపెద్దలు కాదు, హిందువుల్లోని ఈ సెక్యులర్ సత్రకాయగాళ్ళు

  17. నూనె సరిగా లేకపోతే దానితో చేసిన ఉప్మా కాని వేపుడు కాని చెడిపోవా? నెయ్యి బాగోపోతే క్వాలిటీ దెబ్బ తింటుంది.

  18. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు వుండాలి, అన్ని దేవాలయాలు ఆ బోర్డు పరిధి లో ఉండాలి అని చెప్పారు. అసలు చర్చి, మసీదులు గవర్నమెంట్ పరిధి లో లేనప్పుడు, దేవాలయాలు మాత్రం ఎందుకు ఉండాలి? వాటిని రాజకీయాలకి ఎందుకు వాడాలి? అన్నది ప్రశ్న. దానిని వదిలేసి ఏదేదో గ్యాస్ లైటింగ్ ఆర్టికల్ రాసారు.

    మళ్లీ అందులోకి రాడికలైజేషన్ అంగెల్ ఒకటి. శాంతి ప్రియుల మతం వాళ్లు అందరూ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విని రాడికేలైజ్ అయిపోతారు అంట.

    వీరికి రాహుల్ గాంధీ, ఓవైసి, ప్రకాష్ రాజ్ మిగతా వాళ్లు డైరెక్ట్ గా హిందూ మతానికి వ్యతిరేకంగ లేదా శాంతి ప్రియుల మతానికి అనుకూలంగా మాట్లాడే అవాకులు చవాకులు కనిపించవు. ఎవరైనా హిందూ మతం గురించి మాట్లాడితే మాత్రం గ్యాస్ లైటింగ్ స్టార్ట్ చేస్తారు

  19. ఒక గజ్జి ఆర్టికల్ రాయడం, జనాలు తుపుక్కున వుమ్మితే సబ్బు పెట్టి కడుక్కోవడం. నీ సామాను కు దండం రాసామీ..

  20. AR dairy ని తీసుకురావడంలో కేవలం ఆర్ధిక కోణం మాత్రమే ఉందని మీరు ఎలా certify చేస్తారు? ఉత్పత్తి సామర్ధ్యం లేని ఒక కంపెనీకి, తతిమా ఎవరికీ సాథ్యం కాని ధరకి, అన్ని రూల్స్ మార్చి, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంలో కలపడానికి వాడే పదార్ధాన్ని supply చేసే బాధ్యతని కట్టబెట్టడం అనే తెంపరితనం భక్తుల మనోభావాలు దెబ్బదీయడం కాక మరేంటి?!

  21. An eye-opener article with logical points. .National media off late realized and several started questioning CBN claim …A big conspiracy might have been unearthed if a Sitting Judge heads the probe

  22. డర్టి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదే పరాకాష్ఠ. ఇంత అనాలోచితంగా ఎలా చేశానా అని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే పరిస్థితి.

    మొత్తం క్రెడిట్ అటే పోతున్నది, మనకూ కొంత దక్కాలనే తాపత్రయం కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు డిప్యూటీ గారు ఈ అనవసర ఊబి లోకి దిగి పీకల్లోతు కూరుకుపోతున్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు.

    కోర్టులు సామాన్య జనం లాగా మనం ఏది చెపితే అది నమ్మవు కదా !

  23. పవన్ (లేదా అతని ద్వారా బీజేపీ) ఈ విషయాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటుందామని చూస్తున్నాడు. ఒక కులాన్ని బూచిగా చూపించి మిగతా కులాలని దాని మీదకు ఎక్కదోద్దామని జగన్ ప్రయత్నిస్తే అదే ఫార్ములాని మతాల ప్రాతిపదికన అమలు చేద్దామని పవన్/బీజేపీ ప్రయత్నిస్తున్నారు.

  24. విశ్లేషకులు అని పేరు పెట్టుకుని ఒకరిమీద ద్వేషం తో లేదా ఒకరిమీద ఇష్టం తో… హిందువు అయి ఉండి హిందూ మతం మీద సెక్యులర్ లేదా లిబరల్ అని పేరు పెట్టుకుని ఇలాంటి రాతలు చూడటం మా దురదృష్టం.. ఏమన్నా అంటే మా వాఖ్యలు తీసివేస్తారు…. (ఎటువంటి వ్యక్తిగత దూషణ లేకపోయినా, నేనెపుడు చేయను అయినా నావితొలగించబడతాయి)..

    ఒక ముసల్మాను లేదా క్రిస్టియన్ నీ అంటే ఊరుకుంటారా అనడం తప్పు ఎలా అవుతుంది…అతివాదం ఎందుకు అవుతుంది అలా అయితే మీ ఆర్టికల్ కంపారిజన్ లేకుండాఒక్క లైన్కూడా రాయలేరూ…

    దశాబ్దాల తరబడి హిందూమతం మీద దాడి జరుగుతూఉంది … ఇప్పుడు జనాలగుండెలు మండుతున్నాయి… మీబోటి వారి మాటలు చూస్తే అసహ్య కలగక మానదు

    మీకు అనిపించిందే కరెక్ట్ … పవన్ కి ఏం అనిపించిన రాంగ్…ఆయన అలా చేయకూడదు…

    1. ఒక ముసల్మాను లేదా క్రిస్టియన్ నీ అంటే ఊరుకుంటారా అనడం తప్పు ఎలా అవుతుంది…

      అలా ఎందుకు అనడం? హిందువులు తమను తాము సంస్కరించుకుంటూనే వస్తున్నారు. అదే ఎత్తి చూపుతూ మాట్లాడవచ్చు. మనం ముస్లిముల్లా ఉందాం, క్రైస్తవుల్లా ఉందాం అనడం వారిని ఎక్కువ చేసి, హిందువులను తక్కువ చేసినట్లే! అది గ్రహించండి.

      మంచితో పోల్చి చూసి, మనమూ అలా ఉందాం అనడం సబబు. ఎవడో ఏదో చేశాడు, మనమూ అలాగే చేసి, వాడితో సమానమవుదాం అనడం దౌర్భాగ్యం

  25. పవన్ భాదేంటో చాల మంది హిందువులకి అర్థం అయింది, అర్థం కానిదల్ల మీ లాంటి కుహన secular మెధావులకి మాత్రమే..అందరిలొ ఒక అలొచన రేకెత్తించడానికి దీక్ష తీసుకున్నాడు, అక్కడితొ అది అయిపొయింది, మళ్ళి తన పని తాను చేసుకుంటున్నాడు…మీలాంటి వాళ్ళే ఇంకా పట్టుకొని వేళ్ళాడుతున్నారు…

  26. మారె ఇంత కన్వెనియెంట్ గ రాసుకుంటే ఎలా? ఎవరెలా అనుకుంటే నాకెందుకు అనే ధీమా నా? రాముడు తలా తెగినప్పుడు ఎక్కడున్నారు, రధం తగల బడినప్పుడు ఎక్కడున్నారు? తిరుపతి లో చర్చి లు అన్ని కడితే ఎక్కడున్నారు, కొండా పైకి వెళ్లే బస్సు టికెట్స్ మీద జరుసలేం డిస్కౌంట్ యాత్ర గురించి యాడ్స్ ఇచ్చినప్పుడు ఏమయ్యారు? ఆఖరికి గో మాంసం, పండి కొవ్వు వెంకన్న కి తినిపిస్తే ఏమయ్యారు, ఆంధ్ర లో పెచ్చుమీరిన కన్వర్షన్ మాఫియా గురించి ఎప్పుడు రాసారు? తమిళనాడు హీనుడమతాన్ని కోవిద్ లాగా అంతమొందిన్చచాలి అన్నప్పుడు మీరు విస్కీ తాగి బీఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారా? పవన్ చేసింది అత్యవసరం, కరెక్ట్ టైమింగ్, ఒక హిందువుగా ఆయనకు చేసే అధికారం వుంది. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రయాచితం చేసాడు, ఇప్పుడు ప్రక్షాళన చేస్తాడు. ప్రజలు అతని వెనకాల వున్నారు. మీరు కళ్ళు అలానే మూసుకోండి.

    1. ఆఖరికి గో మాంసం, పండి కొవ్వు వెంకన్న కి తినిపిస్తే ఏమయ్యారు,

      • తక్కిన వాటిపై అప్పుడప్పుడు ఆర్టికల్స్‌లో రాస్తూనే ఉన్నాను. మీరు చూడకపోతే నేనేం చేయలేను. పై స్టేటుమెంటుకి మీరు కట్టుబడి ఉన్నారా? మీ దగ్గరున్న ఆధారాలు బయట పెడితే సిట్‌కు పనికి రావచ్చు
      1. పతి పనికి మాలిన యదవా ఆధారాలు ఇచ్చేటోడే.. తీసుకోవాడానికి వాళ్ళు కాచుకొని కూర్చున్నారు. లేకపోతే నీ లాంటి అమ్ముడుపోయిన కుక్కలు ఇచ్చే సాక్షాలతోనే వాళ్ళు ఆధారాలు కోర్టులకి సమర్పిస్తున్నారు… నీ అజ్ఞాన పరిధి ఎంతుందో జొళ్లు కార్చుకుంటా నువ్వు ఇస్తున్న వివరణల్లో కనపడుతుంది… నువ్వు జగన్ ది అబగా చీకడం అలవాటు పడిపోయావు…

  27. జనాభా లో ఎక్కువ మంది వున్నా హిందుల తరపున మాట్లాడటం లో తప్పులు ఏమిటి? అది ధర్మ రక్షణ కిందకి రాదా? హిందువులు భాదితులకింద మిగిలిపోవాలా? పవన్ పాలనా మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ ఆఫీస్ లో సీట్ కు అతుక్కుపోవాలా? పవన్ ప్రజలలోకి వస్తే వరద సహాయంలో ఇబ్బందులు తన ఫాన్స్ తో అని రాలేదు అని క్లియర్ గానే చెప్పాడు కదా ? తన సొంత జీవితం లో చాల తప్పులు చేసినంత మాత్రాన్న ధర్మ రక్షణ గురించి పవన్ మాట్లాడే అర్హత లేదని మీరు ఎలా డిసైడ్ చేస్తారు?

    1. పదవి తీసుకున్నది పాలన చేయడానికి. మత రక్షణే ముఖ్యమనుకుంటే, బయటకు వచ్చి హిందువులను జాగృతం చేయమనండి. హిందువుల తరఫున మాట్లాడడంలో తప్పేమీ లేదు, ఉపయోగించే భాష మీదనే అభ్యంతరం. ‘లడ్డూ సెన్సిటివ్ యిస్యూ దానిపై మాట్లాడవద్దు’ అని కార్తీ అన్నదానిలో తప్పేముంది, పవన్ అంతలా విరుచుకు పడడానికి? కార్తీ హిందువు కాదా? నెగటివ్‌గా కామెంట్ చేశాడా? సినిమా ఫంక్షన్‌లో వివాదాస్పద అంశం ఎందుకన్నాడు. అదీ తప్పేనా?

      1. తప్పు గురించి చెబితే ఏవో గుడ్డి పోలికలు తెస్తావా…. చూస్తుంటే జగన్ గాడు వాడి కుటుంబం దోపిడీ చేసినా కూడా, దోపిడీలు రాజుల కాలం నుండి వున్నాయి అనేలా వున్నావు… నీ గుడ్డి తెలివి లో గాడుదులు ఉచ్చపోయా, కోళ్లు పెంట లాగ ఉందిరా నీ యవ్వారం. పని పాట లేని పనికి మాలిన చెత్త నాకొడకా

  28. కాటికి కాళ్ళు చాపుకున్న వయసులో కూడా ఈ కక్కుర్తి, అమ్ముడుబోయిన రాతలు ఎందుకు తాతా ?

    ఇన్నాళ్ళూ చేసిన పనులకి ప్రాయశ్చిత్తం చేసుకునే వయసు ఇది..

    వేస్ట్.. ఇంకో జన్మ వేస్ట్..

  29. పవన్ కళ్యాణ్ గారు చెప్పినది సనాతన బోర్డు వుండాలి, అన్ని దేవాలయాలు ఆ బోర్డు పరిధి లో ఉండాలి, ప్రభుత్వం తప్పు కోవాలి అని. అస్సలు చర్చిస్, మసీదులు ప్రభుత్వం పరిధి లో లేనప్పుడు దేవాలయాలు మాత్రం ఎందుకుఉండాలి. వాటిని పాలిటిక్స్ కోసం ఎందుకు వాడుకోవాలి.

    ఇంకా పెద్ద జోక్ ఏమిటంటేఈ మాటలు విని మత కల్లోలాలు వస్తాయి అంత. ఈ ఆర్టికల్ లో ఏదేదో రాసి గ్యాస్ లైటింగ్ చేద్దాం ఆనుకున్నారు. ఈయనకి రాహుల్ గాంధీ, ప్రకాష్ రాజ్, ఓవైసి మొదలైన వాళ్లు చెప్పే మాటలు కనిపించవు. ఎవరైనా హిందూ మతం గురించి మాట్లాడితే మాత్రం ఇలాంటి ఆర్టికల్స్ రాస్తారు.

    1. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో నిర్వచించి, తర్వాత బోర్డు గురించి మాట్లాడమనండి.

      1. అందుకోసమే చెప్పా, ఇది ఒక గ్యాస్ లైటింగ్ ఆర్టికల్ అని. అసలు మ్యాటర్ వదిలేసి తోక మ్యాటర్ పట్టుకుని మనుపిలేట్ చేయాలని చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ కోసం సనాతనం అంటే డెఫినిషన్ ఇవ్వాలి. మరి మీరు చెప్పిన ప్రతిదానికి మీరు బేసిస్ ఏమిటి మీరు డిఫైన్ చేశారా? మీ ఆర్టికల్ ఏమైనా డాక్టరేట్ ఆర్టికల్ నా? మీ ఓపీనియన్స్ అన్ని మీరు డిఫైన్ చేసి చెప్పారా!! అందరూ చెప్పే ప్రతి మాటకి మీరు డెఫినిషన్ అడుగుతున్నారా. హైపోక్రక్రీ అంటే ఇదే

      2. ముందు మీ గ్యాస్ లైటింగ్ ఆర్టికల్ కి బేసిస్ ఏమిటి మీరు చెప్పండి. మీరు ఏమో మీ ఓపీనియన్స్ అన్ని ఏమేమో రాస్తారు. మిగతా అందరూ ఏమో డెఫినిషన్స్ ఇవ్వాలి మీకు. హైపోక్రసీ కి పరకాష్ట ఈ ఆర్టికల్

      3. మీరు ఇచ్చే గ్యాస్ లైటింగ్ ఆర్టికిల్స్ కి బేసిస్ చెప్పారా ఎప్పుడైనా? మిగతా వాళ్లు మాట్లాడిన దానికి బేసిస్, లాజిక్, డెఫినిషన్ ఎప్పుడైనా అడిగారా? మీకు అసలు అలాంటివి కనిపించవు, వినిపించవు.

        దేశం లో మసీదు, చర్చి సొంతగా రన్ అవుతుంటే, దేవాలయానికి మాత్రం గవర్నమెంట్ కంట్రోల్ ఎందుకు, సొంత బోర్డు ఉంటే సరిపోతుంది అంటే మాత్రం దానికి డెఫినిషన్ కావలి. హైపోక్రిసీ కి పరకష్ట ఈ ఆర్టికల్

  30. Misleading article.

    He is just asking Hindus to be assertive without being disrespecting to other faiths.

    Nothing wrong in taking pride to one’s own faith without being apologetic.

    Today’s Hindu is shy , timid and apologetic of belonging to his faith.

    This is nothing but awakening.

Comments are closed.