పురందేశ్వ‌రి ఆగ్ర‌హంతో ఆ నాయ‌కుడికి ద‌క్క‌ని ప‌దవి!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఆగ్ర‌హించ‌డంతో సొంత పార్టీకి చెందిన కోలా ఆనంద్‌కు ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఇటీవ‌ల టీటీడీ పాల‌క మండ‌లి బోర్డును కూట‌మి స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ త‌ర‌పున…

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఆగ్ర‌హించ‌డంతో సొంత పార్టీకి చెందిన కోలా ఆనంద్‌కు ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఇటీవ‌ల టీటీడీ పాల‌క మండ‌లి బోర్డును కూట‌మి స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ త‌ర‌పున తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నాయ‌కుడు కోలా ఆనంద్‌కు ఇవ్వాల‌ని జాతీయ నాయ‌క‌త్వం భావించింది. అయితే త‌న‌కు వ్య‌తిరేకంగా కోలా ఆనంద్ జాతీయ నాయ‌క‌త్వానికి ఘాటు లేఖ రాయ‌డాన్ని పురందేశ్వ‌రి మ‌న‌సులో పెట్టుకున్నారు.

శ్రీ‌కాళ‌హ‌స్తి టికెట్‌ను కోలా ఆనంద్ ఆశించారు. ఇందుకోసం ఆయ‌న జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. బ‌లిజ సామాజిక వ‌ర్గానికి పురందేశ్వ‌రి తీవ్ర ద్రోహం చేశార‌ని, ఇలాగైతే పార్టీ ఎలా ఎదుగుతుందంటూ ఆవేద‌న‌తో జాతీయ నాయ‌క‌త్వానికి ఫిర్యాదు చేశారు. త‌న సామాజిక వ‌ర్గం కోస‌మే పురందేశ్వ‌రి ప‌ని చేస్తున్నార‌నే సంకేతాల్ని ఇచ్చేలా కోలా ఆనంద్ విరుచుకుప‌డ్డారు.

అప్ప‌టి నుంచి కోలా ఆనంద్‌పై పురందేశ్వ‌రి అక్క‌సు పెంచుకున్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. అదుపు చూసి ఆనంద్‌ను దెబ్బ‌కొట్టార‌ని వారు అంటున్నారు. బీజేపీ కోటాలో టీటీడీ స‌భ్య‌త్వాన్ని కోలా ఆనంద్‌కు ఇవ్వాల‌ని జాతీయ నాయ‌క‌త్వం ఆలోచించిన‌ప్ప‌టికీ, అందుకు పురందేశ్వ‌రి స‌సేమిరా అన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందుకే బీజేపీ సిఫార్సు వ‌చ్చే వ‌ర‌కు అధికారికంగా బోర్డును కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌లేదు.

చివ‌రికి కోలా ఆనంద్‌కు కాకుండా, ఎవ‌రికి ఇచ్చినా త‌న‌కు అభ్యంత‌రం లేదంటూ, తిరుప‌తి బీజేపీ నాయ‌కుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి వైపు ఆమె మొగ్గు చూపార‌ని బీజేపీ ముఖ్య నాయ‌కులు తెలిపారు. ఆ బీజేపీ నాయ‌కుడు ఇవాళ టీటీడీ బోర్డు స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

14 Replies to “పురందేశ్వ‌రి ఆగ్ర‌హంతో ఆ నాయ‌కుడికి ద‌క్క‌ని ప‌దవి!”

  1. పురందీశ్వరి ఒక్క కోలా ఆనంద్ నేనా దెబ్బతీసింది.

    ఒరిజినల్ బీజేపీ వాళ్ళనందరనీ దెబ్బ తీసింది.

    భానుప్రకాష్ రెడ్డి అంటే విష్ణుకుమార్ రాజూ కామినేని శ్రీనివాస్ లాగా బీజేపీ (TDP) అన్నమాట. తనువు ఇక్కడ, మనసు అక్కడ లాగా

    కేంద్రం కోలా ఆనంద్ ను గట్టిగా తలుచుకుని ఉండదు. ఉంటే భానుప్రకాష్ రెడ్డికి ఇవ్వసాధ్యం అయ్యేది కాదు.

    కేంద్రనాయకత్వంకు ఎవరు ఒరిజినలో ఎవరు డూప్లికేటో బాగానే తెలుసు. తెలుసుకాబట్టే అమ్మోరిని పక్కన పెట్టి , ఒరిజినల్ బీజెపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు పదవి ఇచ్చారు.

    అలాగే సృజనా చౌదరి లాంటి వారిని కాదని సత్యకుమార్ కు ఇచ్చారు.

    వసుదేవుడు గాడిదకాళ్ళు పట్టుకున్నట్లు, ఇప్పుడు బీజేపీ ఆంధ్రలో ఈ డూప్లికేట్ బీజేపీ (TDP) తో తంటాలు పడుతున్నది

    1. నీలాంటి భూమికి భారమైన ఎధవలు సారాయి సోంబేరు గాడిది , గుజరాత్ పకోడీ ( మోడీ ) గాడిదది , ముక్కోడిది , ఆర్థిక నేరస్తుడు నీచుడు జగన్ రెడ్డి ది పట్టుకుని అదే సనాతన ధర్మం అనుకుంటున్నారు

  2. అంటె ఒక రెడ్దికి పదవి వచ్చెలా పురందెశ్వరి పావులు కదిపారు అంటావా!

    .

    ఒరెయ్ తుగ్లక్! బానుప్రకష్ రెడ్డి అన్ని విదాలా ఆ పదవికి అర్హుడు. అయన జగన్ అదికారం ఉండగానె తిరుమల లొ అనెక విషయల మీద కొర్టుకు సైతం వెళ్ళారు!

    1. BJP leader files PIL against spending of TTD funds on cleanliness works in Tirupati 

      BJP leader G. Bhanu Prakash Reddy stated in the petition that spending TTD funds on non-religious activities is in violation of Section 111 of the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act of 1987 and Articles 25 and 26 of the Constitution

      thehindu.com/news/national/andhra-pradesh/bjp-leader-files-pil-against-spending-of-ttd-funds-on-cleanliness-works-in-tirupati/article67620805.ece

    2. BJP leader files PIL against spending of TTD funds on cleanliness works in Tirupati 

      BJP leader G. Bhanu Prakash Reddy stated in the petition that spending TTD funds on non-religious activities is in violation of Section 111 of the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act of 1987 and Articles 25 and 26 of the Constitution

Comments are closed.