చిక్కుల్లో ముగ్గురేసి..: ఇక్కడ ఐఏఎస్ లు.. అక్కడ ఐపీఎస్ లు!

రెండు చోట్ల కూడా ముగ్గురేసి సివిల్ సర్వీసెస్ అధికారులు కేసుల ఉచ్చులో లోతుగా చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది.

ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వాల తప్పులను వెతికి బయటకు తీయడానికి నానా కష్టాలు పడుతుండడం చాలా సహజం. ఆ క్రమంలో తమ రాజకీయ ప్రత్యర్థుల తప్పులను బయటకు తీయాలని చూస్తుంటారు. కానీ వాస్తవానికి ఎవరి చేతుల మీదుగా అయితే తప్పులుగా వారు భావించే పనులు జరుగుతాయో.. ఆ అధికారులు బలవుతుంటారు.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అదే మాదిరి పరిస్థితి కనిపిస్తోంది. రెండు చోట్ల కూడా ముగ్గురేసి సివిల్ సర్వీసెస్ అధికారులు కేసుల ఉచ్చులో లోతుగా చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణలో ఐఏఎస్ అధికారులు- ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులు ఇలాంటి కేసుల ఉచ్చులో ఉండడం గమనార్హం!

తెలంగాణలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఇప్పుడు క్లిష్టంగా ఉంది. ఇప్పటికే పదవీ విరమణ కూడా చేసిన సీనియర్ అధికారి, తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ జమానాలో చీఫ్ సెక్రటరీగా కూడా సేవలందించిన సోమేశ్ కుమార్ జిఎస్టి స్కాం లో కీలక నిందితులుగా ఉన్నారు. అలాగే ఫార్ములా ఈ రేస్ కేసు ఇప్పుడు కేటీఆర్ చుట్టూ బిగుసుకుంటున్న సంగతి అందరికీ తెలుసు. ఈ కేసులో కీలక నిందితులుగా మరో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నా రు. అలాగే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో విచ్చలవిడిగా సాగిన భూ కుంభకోణాలలో ఐఏఎస్ అధికారులు అమోయ్ కుమార్ ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్నారు.

ఏపీలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. అక్కడ కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారుల పరిస్థితి క్లిష్టంగా ఉంది. కాకపోతే ఈ ముగ్గురూ ఒకే కేసులో సహనిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటుండడం గమనించాల్సిన సంగతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కు ఆయన వివాహేతర సంబంధం కలిగినటువంటి ముంబాయి నటి కాదంబరి జత్వానికి మధ్య సాగిన వివాదం కేసులపర్వంలో అత్యుత్సాహం కనబరిచారంటూ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద బలమైన కేసులు నమోదై ఉన్నాయి. నిఘా విభాగాధిపతిగా సేవలందించిన పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణా తాతా, మరో ఐపిఎస్ అధికారి విశాల్ గున్నీ ఈ కేసులో విచారణలు ఎదుర్కొంటున్నారు.

రెండు రాష్ట్రాల్లోనూ ఆయా అధికారులు వారితో ముడిపడి ఉన్న కేసుల విషయంలో ఇప్పటి ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలు సేకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వాలను అప్పటి నాయకుల చర్యలను బదనాం చేసే ప్రయత్నం.. అధికారుల మెడకు చుట్టుకుంటోంది అనడంలో ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

4 Replies to “చిక్కుల్లో ముగ్గురేసి..: ఇక్కడ ఐఏఎస్ లు.. అక్కడ ఐపీఎస్ లు!”

  1. ఆంజనేయులు ప్యాలస్ లో వినాశం కి పక్కలు వేసే వాడు అని తాడేపల్లి లో అందరూ చెబుతారు.

    కాంతి అనే అతను ప్యాలస్ పులకేశి చెప్పులు తన నాలికతో నాకి శుభ్రం చేసి ప్యాలస్ పులకేశి వేసే బిచ్చం ఎరుకునేవాడు.

    గున్ని నే ఆ ముఠా లో చేరడం విచారకరం

Comments are closed.