తమన్, దేవిశ్రీ కంటే ఇతడు బెటర్ అంట!

ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్ వెర్సెస్ దేవిశ్రీ రచ్చ నడుస్తోంది. పుష్ప-2 కోసం ఆఖరి నిమిషంలో తమన్ ను తీసుకోవడంపై చాలా పెద్ద చర్చ సాగుతోంది. తమన్ లోపాల్ని దేవిశ్రీ అభిమానులు.. దేవిశ్రీ లోపాల్ని…

ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్ వెర్సెస్ దేవిశ్రీ రచ్చ నడుస్తోంది. పుష్ప-2 కోసం ఆఖరి నిమిషంలో తమన్ ను తీసుకోవడంపై చాలా పెద్ద చర్చ సాగుతోంది. తమన్ లోపాల్ని దేవిశ్రీ అభిమానులు.. దేవిశ్రీ లోపాల్ని తమన్ అభిమానులు ఎత్తిచూపిస్తున్నారు.

ఆఖరి నిమిషం వరకు కంటెంట్ ఇవ్వరనేది ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లపై కామన్ గా వినిపించిన విమర్శ. అన్ని సినిమాలకు కాకపోయినా, కొన్ని సినిమాల వరకు ఇది నిజమే. అందుకే తెలుగులో జీవీ ప్రకాష్ లాంటి సంగీత దర్శకులు వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు.

ఒకట్రెండు పాటలు మినహాయించి, టాలీవుడ్ లో పెద్దగా మెరవలేదు జీవి ప్రకాష్. అయినప్పటికీ ఇండస్ట్రీ ఇతడి వెంట పడుతోంది. దీనికి కారణం దేవిశ్రీ, తమన్ తో పోలిస్తే, జీవీ ప్రకాష్ సకాలంలో కంటెంట్ డెలివరీ చేస్తాడు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత కచేరీలు చేస్తాడు. తమన్ కూడా కొన్ని సంగీత కార్యక్రమాలకు జడ్జిగా ఉన్నాడు. వీళ్లలానే జీవీ ప్రకాష్ కు కూడా వేరే వ్యాపకం ఉంది. ఇతడు నటుడిగా కూడా రాణిస్తున్నాడు. అయినప్పటికీ మ్యూజిక్ పరంగా.. దేవిశ్రీ, తమన్ పై వచ్చిన విమర్శలు జీవీ ప్రకాష్ పై రాలేదు.

“మ్యూజిక్ విషయంలో అన్ టైం ఉంటాను. నా వర్క్ ని టైంకి డెలివర్ చేస్తాను, నేను ఎప్పుడూ ఆఖరి నిమిషం వరకు వర్క్ చేయను. వారం ముందే అవుట్ ఫుట్ ఇచ్చేస్తాను. అందుకే నిర్మాతలు నాతో వర్క్ చేయడానికి ఇష్టపడతారు.” అనేది జీవీ ప్రకాష్ మాట.

నెలలో 12 రోజలు యాక్టింగ్ చేస్తాడట. మిగతా అన్ని రోజులూ సంగీతానికే ప్రాధాన్యం ఇస్తాడట. ఈ షెడ్యూల్స్ అన్నీ 2 నెలల ముందే ఫిక్స్ చేసుకుంటాడట. మధ్యలో ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా చేయడంట. ఈ కమిట్ మెంట్ తో ఉంటాడు కాబట్టే జీవీ ప్రకాష్ కు తెలుగులో వరుసగా అవకాశాలొస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో అతడికి 2 మ్యూజికల్ హిట్స్ పడ్డాయంటే టాలీవుడ్ లో పాతుకుపోయినట్టే.

3 Replies to “తమన్, దేవిశ్రీ కంటే ఇతడు బెటర్ అంట!”

Comments are closed.