ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలంటే, ముందుగా తమ అనుకూల పత్రికల్లో కథనాలు రాయిస్తుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు అధికారంలో వుంటే, ఈ పని చక్కగా జరిగిపోతూ వుంటుంది. ఇదిగో ఎన్నికల హామీ నెరవేరుస్తున్నామంటూ 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం అంటూ హడావుడి చేశారు. అబ్బో, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఎంత నిబద్ధతతో వుందో అని అంతా మెచ్చుకున్నారు.
కానీ రోజురోజుకూ డీఎస్సీపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి టీచర్ల భర్తీ పూర్తి అవుతుందని ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థుల్లో అనుమానాలున్నా, మంత్రి చెప్పారు కదా, నమ్మొచ్చని సరిపెట్టుకున్నారు.
కానీ టీడీపీ అనుబంధ మీడియాలో ఇవాళ డీఎస్సీపై వచ్చిన కథనం, అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ చాలా సానుకూల ఆలోచనతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందంటూనే, షెడ్యూల్ ప్రకారం టీచర్ల భర్తీ అనుమానమే అని రాసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డీఎస్సీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చిందనేది ఆ కథనం సారాంశం.
ఎస్సీ వర్గీకరణ ప్రకారం నోటిఫికేషన్‌ను రివైజ్‌డ్ చేయాల్సి వుందని, దానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే వాదన వినిపిస్తోందట. మళ్లీ న్యాయపరమైన చిక్కుల్ని తెరపైకి తేవడం వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారనే విమర్శ లేకపోలేదు. ఇదంతా జాప్యం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న కుట్రగా డీఎస్సీ అభ్యర్థులు అనుమానిస్తున్నారు. అందుకే డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వ పెద్దలు మాత్రం సానుకూలంగా మాట్లాడుతూ, మరోవైపు అనుకూల మీడియాతో మాత్రం అభ్యర్థులను గందరగోళంలో పడేసేలా కథనాలు వస్తున్నాయనే చర్చకు తెరలేచింది.
డీఎస్సీ నిర్వహణ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చిత్తశుద్ధికి పరీక్ష. డీఎస్సీ అభ్యర్థుల్ని మోసగించేలా నడుచుకుంటే మాత్రం, ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లోకేశ్‌ను విద్యావంతులు ఎప్పటికీ నమ్మరు. కావున డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
andaru nammedi okka tuglaq ne antav?
Ledu 1995 nundi media lo tappa jananki em cheyanu oka langa and vadni nammi eduti vallani thulanade kojja gallani anta.. aithe emantav
orey tuglak ani kaadu…meeru chepindi chesthey happy ..else jagan laaga same result istharu…
arey babu….isthey happy ..ledu antey jagan resultey meeku antunadu….whats wrong in that…
vc estanu 9380537747
Aa rebook endi dora
boring articles. boring site.