న్యాయాధికారిపై రాజ‌గురువు ప‌త్రిక దురుద్దేశం!

వైసీపీ పాల‌న‌లో గ‌నుల‌శాఖ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన వీజీ వెంక‌ట‌రెడ్డిని కూట‌మి స‌ర్కార్ అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌ల కేసులో అరెస్ట్ చేసింది. గ‌త రాత్రి ఆయ‌న బెయిల్‌పై విడుద‌ల‌య్యాయ‌రు. 50 రోజుల పాటు ఆయ‌న జైల్లో…

వైసీపీ పాల‌న‌లో గ‌నుల‌శాఖ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన వీజీ వెంక‌ట‌రెడ్డిని కూట‌మి స‌ర్కార్ అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌ల కేసులో అరెస్ట్ చేసింది. గ‌త రాత్రి ఆయ‌న బెయిల్‌పై విడుద‌ల‌య్యాయ‌రు. 50 రోజుల పాటు ఆయ‌న జైల్లో ఉన్నారు. బెయిల్ పొంద‌డం అనేది ఏ నిందితుడికైనా చ‌ట్ట‌ప‌ర‌మైన‌ హ‌క్కు. అయితే టీడీపీ అనుబంధ మీడియా ఆయ‌న‌కు బెయిల్ రావ‌డ‌మే నేర‌మైన‌ట్టు తెగ‌బాధ‌ప‌డిపోతూ క‌థ‌నాలు రాయ‌డం గ‌మ‌నార్హం.

మ‌రీ ముఖ్యంగా వెంక‌ట‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయాధికారి పేరును రాజ‌గురువు ప‌త్రిక‌ ప్ర‌ముఖంగా రాయ‌డం వెనుక‌…ఆ ప‌త్రిక దురుద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాజ‌గురువు ప‌త్రిక‌లో గ‌నుల ఘ‌నుడు వెంక‌ట‌రెడ్డి 50 రోజుల్లో బ‌య‌టికి వ‌చ్చాడ‌నే శీర్షిక పెట్ట‌డంతో పాటు స‌బ్ హెడ్డింగ్‌గా బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్ర‌త్యేక కోర్టు న్యాయాధికారి హిమ‌బిందు అని పేరు రాయ‌డం న్యాయ‌వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

రాజ‌గురువు ప‌త్రిక అక్క‌సుకు కార‌ణం లేక‌పోలేదు. గ‌తంలో స్కిల్ స్కామ్ కేసులో చంద్ర‌బాబును రిమాండ్‌కు ఆదేశించిన న్యాయాధికారి ఆమే. త‌మ‌కిష్ట‌మైన వాళ్ల విష‌యంలో చ‌ట్టాన్ని అనుస‌రించి ఆదేశాలు ఇచ్చినా, ఒప్పుకునే ప్ర‌శ్నే లేద‌నే అర్థం రాజ‌గురువు ప‌త్రిక అక్ష‌రాల్లో క‌నిపిస్తోంది.

వెంక‌ట‌రెడ్డి అవినీతి, అక్ర‌మాల‌పై ఆధారాలుంటే ఖ‌చ్చితంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. అధికారంలో వుంటూ ఆయ‌న‌పై అభియోగాల‌కు సంబంధించిన ఆధారాలు లేవ‌ని, అందువ‌ల్లే బెయిల్ ల‌భించింద‌ని ఏడ్వ‌డం ఏంటో అర్థం కాదు. ఇది ఎవ‌రి వైఫ‌ల్యం? మీరు నియ‌మించుకున్న ఏసీబీ అధికారులు చేత‌కాని వాళ్ల‌ని చెప్ప‌ద‌లుచుకున్నారా? స‌రైన ఆధారాలు లేక‌పోతే, న్యాయ‌మూర్తులు ఏం చేస్తారు? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. స‌హ‌జంగా ఎవ‌రికైనా బెయిల్ ల‌భిస్తే, ఫ‌లానా కోర్టు మంజూరు చేస్తుంద‌ని రాస్తుంటారు. కానీ రాజ‌గురువు ప‌త్రిక మాత్రం… ప్ర‌త్యేకంగా ఫ‌లానా న్యాయాధికారి అని పేరు రాయ‌డంలోనే ఆ ప‌త్రిక దురుద్దేశం ఏంటో స్ప‌ష్టంగా తెలిసిపోతోంద‌న్న విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది.

19 Replies to “న్యాయాధికారిపై రాజ‌గురువు ప‌త్రిక దురుద్దేశం!”

  1. మన న్యాయస్థానాలకు సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలు చేసేవాళ్లను శిక్షించే శ్రద్ధ ప్రింట్ మీడియా విషయంలో ఉంటుంది అని అనుకోవటం విచిత్రం అందులో కొన్ని మీడియా విషయాలలో, ఏళ్ల తరబడి సాగతీస్ నిజాం తెలిసిందేగా

  2. వ్యూహత్మక దురుద్దేశం ఆపాదిస్తుంది ఈనాడు. ఇది పత్రిక ముసుగులో judiciary ని చేస్తున్న blackmail చెయ్యటమే.. మిగిలిన judges ని బెదిరించటమే..ఉషోదయాన్నే విలువలు అంటూ చెపుతూ .. రామోజీ పోయిన తరువాత మరింత ఓ పార్టీ కరపత్రిక మారింది అనటం లో సందేహం లేదు

  3. ఈనాడు లో దురుద్దేశాలు ఎవరికీ కనపడలా… అంటే నీ మనసులో మాటను ఈనాడు మీదకు తోసేస్తున్నావేమో అనిపిస్తుంది గబ్బాంద్రా… Judgements are confessions of a charector

  4. స్కిల్ కేసులొ ఆధారాలు ఉండడంవల్లే చంద్రబాబు కు రిమాండ్ విధించిందన్నమాట కోర్టు……

    అయితే తప్పనిసరిగా శిక్షపడుతుందన్నమాట బాబుకి…..

Comments are closed.