కోర్టుల చుట్టూ తిరుగుతున్న హీరో

బహుశా, ధనుష్ జాతకంలో కోర్టుల చుట్టూ తిరుగుతారని రాసిపెట్టుందేమో. ఒకటి క్లోజ్ అయిన వెంటనే ఇంకోటి మొదలైంది. ఆశ్చర్యంగా రెండూ ఒకే రోజు జరగడం విశేషం.

బహుశా, ధనుష్ జాతకంలో కోర్టుల చుట్టూ తిరుగుతారని రాసిపెట్టుందేమో. ఒకటి క్లోజ్ అయిన వెంటనే ఇంకోటి మొదలైంది. ఆశ్చర్యంగా రెండూ ఒకే రోజు జరగడం విశేషం.

ధనుష్-ఐశ్వర్య విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసు కొలిక్కి వచ్చింది. వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ, చెన్నై ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఓవైపు ఈ కేసు తెగిందనుకునేలోపే ధనుష్ నుంచి మరో కేసు మొదలైంది. తాజాగా అతడు నయనతారపై కోర్టు మెట్లు ఎక్కాడు. ఆమెపై మద్రాసు హైకోర్టులో సివిల్ దావా వేశాడు. ధనుష్ కు విడాకులొచ్చిన రోజునే, ఈ కేసు లిస్టింగ్ అయింది.

నిర్మాతగా తను తీసిన సినిమా నుంచి, తన పర్మిషన్ లేకుండా 3 సెకెన్ల విజువల్ ను అధికారికంగా వాడారంటూ కోర్టుకెక్కాడు ధనుష్. దీనికి సంబంధించి 10 కోట్లు చెల్లించాల్సిందిగా నయనతారకు ఇప్పటికే అతడు నోటీసు పంపించిన సంగతి తెలిసిందే.

నయనతారపై నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యూమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ధనుష్ నిర్మాతగా, నయన్ భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో, నయనతార హీరోయిన్ గా నటించిన ‘నేనూ రౌడీనే’ క్లిప్స్ ను వాడాలనుకున్నారు. అయితే దీనికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు.

దీంతో తమ మొబైల్ నుంచి తీసిన వర్కింగ్ విజువల్స్ ను డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రయిలర్ లో వాడారు. దీనిపై ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, 10 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీసు పంపించాడు. దీంతో నయన్ భగ్గుమంది. ధనుష్ పై బహిరంగ లేఖ విడుదల చేసి మరీ తిట్టింది.

ఇప్పుడీ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. నయనతార, విఘ్నేష్ తో పాటు.. భారతదేశంలో నెట్ ఫ్లిక్స్ కంటెంట్ వ్యవహారాలు చూసుకునే ముంబయి కంపెనీ లాస్ గాటోస్ కంపెనీపై కూడా కేసు పెట్టడానికి హైకోర్టు, ధనుష్ కు అనుమతిచ్చింది.

సో.. విడాకుల రూపంలో ధనుష్ నుంచి ఓ కోర్టు కేసు క్లియర్ అయింది. ఇప్పుడు నయనతార డాక్యుమెంటరీతో మరో కోర్టు కేసు మొదలైంది.

4 Replies to “కోర్టుల చుట్టూ తిరుగుతున్న హీరో”

Comments are closed.