అఖిల్ పెళ్లిపై అవన్నీ పుకార్లే

ప్రస్తుతానికి తమ కుటుంబం దృష్టి మొత్తం చైతూ-శోభిత పెళ్లిపై మాత్రమే ఉందని.. ఆ తర్వాత అఖిల్ పెళ్లి గురించి ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఓవైపు అంతా నాగచైతన్య పెళ్లిపై ఫోకస్ చేస్తున్న వేళ.. సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ తనవైపు ఆకర్షించాడు అఖిల్. జైనాబ్ రౌజీతో అతడి ఎంగేజ్ మెంట్ పూర్తయింది. ఈ సందర్భంగా అఖిల్ పెళ్లిపై ఓ పుకారు చెలరేగింది.

డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య-శోభిత పెళ్లితో పాటు.. అఖిల్-జైనాబ్ పెళ్లి కూడా చేయబోతున్నారని.. ఒకే వేదికపై ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లను నాగార్జున జరిపించబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇంత హడావుడిగా చిన్న కొడుక్కి ఎంగేజ్ మెంట్ చేయడానికి కారణం కూడా ఇదేనంటూ కథనాలొచ్చాయి.

వీటిని నాగార్జున ఖండించారు. ప్రస్తుతానికి తమ కుటుంబం దృష్టి మొత్తం చైతూ-శోభిత పెళ్లిపై మాత్రమే ఉందని.. ఆ తర్వాత అఖిల్ పెళ్లి గురించి ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాదిలోనే అఖిల్-జైనాబ్ పెళ్లి జరుగుతుందని అన్నాడు.

ఈ సందర్భంగా తన చిన్న కొడుకు, కాబోయే చిన్న కోడలపై స్పందించిన నాగ్.. ఇద్దరి జంట బాగుందని, కలిసి జీవించాలని వాళ్లే నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.

వ్యాపారవేత్త జుల్ఫీ రౌజీ కుమార్తె జైనాబ్ రౌజీ. స్వతహాగా ఈమె పెయింటర్. ఇప్పటికే ఇండియా, దుబాయ్, లండన్ లో పెయింటింగ్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. అఖిల్-జైనాబ్ తొలిసారి ఎక్కడ కలుసుకున్నారు.. ఎలా దగ్గరయ్యారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

4 Replies to “అఖిల్ పెళ్లిపై అవన్నీ పుకార్లే”

Comments are closed.