విశాఖకు హైకోర్టు బెంచ్ కావాలని చాలా కాలంగా అంతా కోరుతున్నారు. దీని మీద గతంలోనూ ప్రస్తుతం న్యాయవాదులు అంతా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్రలో మొత్తం మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. కేసులు కూడా ఎక్కువగానే ఉంటాయి. దాంతో హైకోర్టు బెంచ్ ఉత్తరాంధ్రకు కేటాయించాలన్నది ఒక చిరకాలం డిమాండ్ గా ఉంది. దీని మీద భారత అత్యున్నత న్యాయస్థానానికి ఒక విన్నపం చేశామని విశాఖ హైకోర్టు బెంచ్ సాధన సమితి ప్రతినిధులు తెలియచేస్తున్నారు.
విశాఖకు హైకోర్టు బెంచ్ అన్నది ఏనాటి నుంచో ఉన్న డిమాండ్ గా వారు చెబుతున్నారు. విశాఖకు ఎందుకు హైకోర్టు బెంచ్ ఉండాలి దాని ఆవశ్యకత మీద సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫీసుకు అందచేశామని తెలిపారు.
విశాఖకు హైకోర్టు బెంచ్ ఇవ్వాలని వారు అంటున్నారు. ఇటీవలే కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. దాని మీద అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. కర్నూల్ కి న్యాయం చేసే దిశగా ఇది ఒక కీలక పరిణామం అని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
రాయలసీమ మాదిరిగానే ఉత్తరాంధ్ర కూడా వెనకబడిన ప్రాంతమని ఇక్కడ కూడా అనేక కేసులు నిత్యం ఉన్నాయని అమరావతి దాకా వెళ్లలేని వారు ఉన్నారని అందువల్ల విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చాలా అవసరం సముచితమని అంటున్నారు. అమరావతిలో హైకోర్టు ఉన్న క్రమంలో కర్నూలుతో పాటు విశాఖకు కూడా హైకోర్టు బెంచ్ లని మంజూరు చేస్తే సమగ్రమైన న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.
5 yrs notlo em pettukunnaru
నువ్వు తప్పించి ఎవరూ అడగట్లేదు.
సుప్రీం కోర్ట్ బెంచ్ హైదరాబాద్ కి ఇవ్వాలి
Call boy works 7997531004
ప్రతి జిల్లాకో బెంచ్ అడిగితే సరిపోద్ది కదా..
High court kurnool lo పెడితే just 4 benches వస్తాయి అన్నారు. ఇప్పుడు బెంచ్ మాత్రమే ఇస్తే ఏమొస్తుందో చంబా నే చెప్పాలి. ఐనా రాయలసీమ వాసులకు ఆత్మభిమానమ్ తో high court కోసం మరియు రాయలసీమ కు అంతకు ముందు వచ్చిన kopparti సెజ్ లాంటి అనేకం అమరావతి తరలిపోకుండా కాపాడుకోవాల్సిన నమయం.