అదానీ కథ ముగిసింది, ఇప్పుడు మీడియాకు చిక్కే కొత్త బకరా ఎవరో?

నిజానిజాల సంగతి పక్కన పెట్టి జేబులో నాలుగు రూపాయలు వేసుకొని చేతులు దులిపేసుకోవడం అన్నది రోజువారీ దినచర్యగా మారిపోయింది.

మన మీడియా చేష్టలు ఎలా ఉంటాయంటే ఎలాంటి వాడినైనా వందడుగుల గోతిలో పాతిపెట్టడం, ఏమీలేని అనామకుడికి వందడుగులు పైకెత్తి నిలబెట్టడం ఎలాగో మీడియా సంస్థలకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు.

మనం చెప్పే వార్తలు… మనం ప్రచురించే కథనాలు ఎంతవరకు నిజం.. ఎంతవరకు నీతిగా, నిజాయితీగా మన వార్తలను ప్రచురణ చేస్తున్నాం అనే విషయం పక్కన పడేసి టీవీలలో రేటింగ్స్ కోసం నచ్చిన వార్తలను బ్రేకింగ్ న్యూస్ పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఎవర్ని ఎందుకు ఎలా బద్నామ్ చేస్తున్నామో తెలియకుండా, నిజానిజాల సంగతి పక్కన పెట్టి జేబులో నాలుగు రూపాయలు వేసుకొని చేతులు దులిపేసుకోవడం అన్నది రోజువారీ దినచర్యగా మారిపోయింది.

అదానీకు సంబంధించి ఏదో జరిగిపోతుందని, అమెరికాకు చెందిన దిక్కుమాలిన చెత్త రాతలు రాసే మీడియాలో ప్రచురించడంతో అది నిజమా కదా అనే స్పృహ మన మీడియా సంస్థలకు లేక పోగా, అదానీ గురించి మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు రాసి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు అదానీ కంపెనీలలో షేర్స్ పెట్టిన సామాన్య ప్రజల భవిష్యత్తులను గత వారం రోజులుగా ప్రశ్నర్ధాకంలో పడేశాయి. కానీ అమెరికాకు చెందిన పాచ్యాత్య మీడియా మన దేశానికి చెందిన బిలియనీర్లపై అక్కసు వెళ్లగక్కడం అనేది కొన్ని గత దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. కానీ ఆ దేశాల మీడియా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అదే ప్రచురణ చేసి తరువాత నాలుక కరుచుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.

అదానీ విషయంలో మన దేశ పార్లమెంట్ కూడా గత మూడురోజులుగా దద్దరిల్లి పోవడంతో పాటు అదానీ షేర్స్ కొన్నవారు భయం భయంగా కాలం గడిపి, ఉన్నదిపోయే ఉంచుకున్నది పోయే అనేలా వచ్చినకాడికి షేర్స్ అమ్మేసుకోని తీవ్ర నష్టాలను కళ్ళ చూసారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అదానీ పేరుగాని, అతడి బంధువు పేరు మరియు ఆ సంస్థకు చెందిన డైరెక్టర్ ఇతరుల పేర్లు ఎక్కడ అవినీతికి సంబంధించిన ఆరోపణలు రాలేదని కేవలం సెక్యూరిటీస్ పై మాత్రమే ఆరోపణలు వచ్చాయని ఆ సంస్థ తెలియచేసింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ మీద అమెరికాలో వచ్చిన లంచం, అవినీతి బాగోతాలపై భారత స్టాక్ ఎక్సేంజ్ కి ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం “ఎఫ్.పీ.సీఏ అమెరికా ఫారిన్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందా గౌతమ్ అదానీ మరియు అతడి దగ్గర బంధువు సాగర్, కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీత్ జైన్ పై వచ్చిన అవినీతి, లంచం ఆరోపణలపై వచ్చిన అభియోగాలపై తాము తీవ్రంగా కండిస్తున్నామని, అవన్నీ వాస్తవాలు కాదని, వీరంతా సెక్యూరిటీస్ కు సంబంధించిన మోసం ఆరోపణలను మాత్రమే ఎదుర్కొంటున్నారని, వారిపై లంచం అవినీతి అభియోగాలు నమోదు కాలేదని, అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో అసలు ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావన లేదని తమ కంపెనీ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని” మన దేశ స్టాక్ ఎక్సేంజ్ కు లిఖితపూర్వకంగా తెలియచేసారు. వీరిపై వచ్చిన సెక్యూరిటీస్ ఆరోపణలలో కూడా మేము ఎలాంటి తప్పు చేయలేదని, మాపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేసి, వార్తలు రాసిన వారిపై కూడా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

దీనితో అదానీకు చెందిన షేర్స్ నిన్న, ఈరోజు కాస్త కోలుకోవడంతో పాటు ఈరోజు అయితే దాదాపుగా 10 శాతంకు పైగా లాభాలలో అన్ని షేర్స్ కొనసాగుతున్నాయి. కానీ అమెరికా మీడియా కూసిన కారుకూతలు వలన అదానీ షేర్స్ కొన్న సామాన్యుడు నుంచి కోటీశ్వరుడు వరకు వందల నుంచి వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. దీని అంతటికి కారణం మన మీడియా మాత్రమే. 24 గంటల న్యూస్ పేరుతో ప్రతి క్షణం బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఒకటికి నాలుగు జోడించి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తూ అదానీ కేసులో అసలు ఆరోపణలు ఏమిటి, ఆరోపణలలో ఎంత వరకు నిజం ఉందని తెలుసుకోకుండా వాళ్ళు లంచం ఇచ్చారని, అవినీతి చేసారని కోర్టులో ఫైల్ అయిందని, దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారని గుడ్డ కాల్చి మొహం మీద వేసి తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తే ఈరోజు నష్టపోయింది సామాన్యుడు… ఇష్టానుసారంగా వేసిన వార్తలతో ప్రేక్షకాదరణ పొంది డబ్బు సంపాదించింది మాత్రం సో కాల్డ్ మీడియా సంస్థలు.

మన దేశానికి చెందిన బిలియనీర్ల ఎదుగుదల ఎప్పటికి అమెరికా లాంటి పాచ్యత్త దేశాలకు కంటగింపుగానే ఉంటుంది. ఎప్పుడు ఎలా ఎక్కడ దొరుకుతారా అని కాచుకుని కూర్చుకుని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తుంటే, మన మీడియా సంస్థలు అవేవి ఆలోచించకుండా గొర్రెలా వారితో ఫాలో అవ్వడంతో మన దేశ ఆర్ధిక వ్యవస్థను మనకు మనమే కూకటి వేళ్ళతో సహా పీకేసుకునే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నాం.

ఇప్పుడు అదానిపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవాలని తేలడంతో, ఇప్పుడు న్యూస్ చానెల్స్ తమ రేటింగ్స్ పెంచుకోవడానికి మరొకర్ని బకరాను చేయడానికి కాచుకుని కుర్చున్నాయని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి అసత్య ఆరోపణలు నిజానిజాలు తెలుసుకోకుండా ఎన్నో ఆశలతో షేర్ మార్కెట్ లో రూపాయి రూపాయి కూడపెట్టుకుని పెట్టిన పెట్టుబడులు ఒక్కరోజులోనే కుప్పకూలిపోవడంతో ఎంతో మంది జీవితాలు రోడ్డునపడ్డాయి. మన మీడియా సంస్థలు ఇలాంటి విషయాలు ఆలోచించే పరిస్థితులలో లేరు, కేవలం గొర్రెల్లా పాచ్యాత్త మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలను ప్రచురించి, నిజమైన జర్నలిజాన్ని ఎప్పుడో సమాధిలో పాతిపెట్టేశారు.

ఈరోజులలో మీడియా అంటే డబ్బే… ఆ డబ్బుతోనే మీడియా సంస్థలు ప్రభుత్వాలను పడకొట్టడం, నిలబెట్టడం.. బిలియనీర్లను వారిని నమ్ముకున్న సామాన్యులను బిక్షగాళ్లను చేయడం అంతా వారి చేతుల మీదగానే చేసేస్తూ… వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఈ సమాజం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఎంతో సిగ్గు చేటు.

శ్రీకాంత్ రెడ్డి గుదిబండి

36 Replies to “అదానీ కథ ముగిసింది, ఇప్పుడు మీడియాకు చిక్కే కొత్త బకరా ఎవరో?”

  1. ఇలానే ఒక కొంకిస్క గాడు, వాళ్ళ నాన్న మరణం వెనుక అంబాని నే కారణం అని ఆరోపణ చేశాడు, ఆధారాలు లేకుండా. ఆ టైమ్ లో ఇదే గ్రేట్ ఆంద్ర కూడా ప్రచారం చేసింది.

    దాని వలన అంబాని బిజినెస్ లా మీద రాళ్ళ దాడులు చేశారు. చాలా నష్టం జరిగింది.

    తరువాత అదే కొంకిస్కా గాడు, అదే అబాని కాళ్ళు పట్టుకుని క్ష*మాపణ అడిగాడు, అబద్ధా*లు చెప్పాను అని.

    1. ఇప్పుడు ఆ కొంక్ఇస్కా గాడు, అంబాని ది తేనె. వేసుకుని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ప్యాలస్ లో.

      ఆ కొంకిష్కా గాడి మాటలు నమ్మి అంబాని షాపులు మీద రాళ్ళు వేసిన కార్యకర్తలు , పోలిసు కేసుల్లో చిక్కుకుని ఉద్యోగాలు రా కా నష్ట పోయారు. తరవాత చిన్నాన్ నీ కూడా వీడే లేపేశాడు అని తెలిసి సొంత నాన్న నీ కూడా వీడే లేపేసి వుంటాడు అని అనుమానం చేసారు.

  2. ఇతను మొన్న ఓపెన్ లెటర్ రాసినట్టున్నాడు, us లో లంచాలు ఇవ్వలేదని, ఫ్రాడ్లు మాత్రమే చేశానని అతని వెర్షన్.

    మన బాబా గారు, ఆయన భక్తులు ఉన్నంతకాలం వీళ్లని ఏమీ చేయలేరు.

  3. ఆర్నెల్లక్రితమే ఒక బకరా దొరికాడు. ఇంకో 2, 3 ఏళ్లు గట్టిగా వాడతారు. ఈలోపు వచ్చే బకరాలు అన్ని చిన్న చిన్నవే

  4. వైసిపి నుండి ఎవడో ఒక బకరా వుండే వుంటాడు🤣🤣. అన్ని మంచి పనులు చేశారు మరే

  5. Really Pathetic State of People and Investors who believe rumours than Facts.Atleast from onwards Media should realise that they are putting common Man and small Investors on Road and duping them with their pretty news which is not fact and real 🙏

  6. ///ఇప్పుడు అదాని పై వచ్చిన వార్థలు అన్ని అవాస్తవం అని తెలటం తొ…////

    .

    Ha! Ha!! LoL!! ఎక్కడ తెలింది రా అయ్య? ఎవరు తెల్చారు??

    మద్యలొ జగన్ పెరు వచ్చింది కనుక ఇది మన దెశం మీద కుళ్ళుతొ కెవలం మీడియా స్రుష్టి.. అన్నట్టు చెపుతున్నవ్! ఇంతకీ US Department of Justice, US Securities and Exchange commission అదాని లంచాలు ఇచ్చారు అంటుందా? కాదా? ఈ విషయం మత్రం రాయనెలెదు ఎమిటయ్యా?

    జనానికి ఆమాత్రం తెలీదు అనుకుంటె ఎలా?

  7. దున్నపోతు ఈనిదంటే దూడ ను కట్టేయ్య మన్నడట అలాగే వుంది ఈనాడు even written సయింగ్ that FBI is great and సిబిఐ, ED and cbcid as waste just because there is a reference of AP govt. Official.

  8. పనిలో పనిగా సాక్షి పేపర్ మరియు మీడియా లో అన్ని నిజాలు వెలికి తీసి జనాలు ముందు ఉంచబట్టే స్టాక్ మార్కెట్ కోలుకుంది అని కూడా రాయి అప్పుడు ఈ వ్యాసం సంపూర్తి గా ఉంటుంది.

  9. Babu Sreekanth, NY times, Reuters and other prominent media wrote about what US Justice department delivered. According to you those media are chetta then what about GA and your writings on this? Go and check the facts on US justice department site. Opikunte, read those 54 page indictment documents.

  10. “ఇప్పుడు అదాని పై వచ్చిన వార్థలు అన్ని అవాస్తవం అని తెలటం తొ” – ఎక్కడ తేలింది?

    పాలస్ డిస్కషన్స్ లోనా..సాక్షి ఇన్ఫెస్టిగేషన్ లోనా..

    సాక్షి డింగ్ డాంగ్ లోనా..

  11. ముచ్చట వెబ్మీడియా లో రాసారు, విజయ్ మాల్యా తాలూకు బీర్ / వైన్ మార్కెట్ తగ్గించడం కోసం ఇలాగే చేశారు అని, ఇప్పుడు విజయ్ మాల్యా కంపెనీ కంటే తక్కువ క్వాలిటీ ఉండేవి ఎక్కువ అమ్ముడు అవుతున్నాయి అని.

  12. అదానీ భారతీయుడు. అదానీ లంచాలు ఆఫర్ చేసాడు (ఇవ్వలేదు ఇంకా) అన్నది భారతీయముఖ్యమంత్రులకు. కేసు పెట్టింది అమెరికాలో. అమెరికా ప్రభుత్వం ఇండియాలో జరగబోయింది అన్న ఆరోపణలు మీద కేసులు పెట్టి ప్రాసెక్యూట్ చేసే అధికారం ఉన్నదా? అమెరికా ప్రభుత్వం ఇండియా వచ్చి దర్యాప్తు చేసి కేసులు పెట్టిందా, లేక గాలి పోగేసుకువచ్చి ఆ గాలి ఆధారంగా కేసులు పెట్టిందా? అమెరికా దున్నపోతు ఈనింది. ఇక్కడ దూడను కట్టేస్థానికి పరుగెట్టే VP లను అడుగుతున్నాను

  13. అదానీ భారతీయుడు. అదానీ లంచాలు ఆఫర్ చేసాడు (ఇవ్వలేదు ఇంకా) అన్నది భారతీయముఖ్యమంత్రులకు. కేసు పెట్టింది అమెరికాలో. అమెరికా ప్రభుత్వం ఇండియాలో జరగబోయింది అన్న ఆరోపణలు మీద కేసులు పెట్టి ప్రాసెక్యూట్ చేసే అధికారం ఉన్నదా? అమెరికా ప్రభుత్వం ఇండియా వచ్చి దర్యాప్తు చేసి కేసులు పెట్టిందా, లేక గాలి పోగేసుకువచ్చి ఆ గాలి ఆధారంగా కేసులు పెట్టిందా?

  14. అదానీ భారతీయుడు. అదానీ లంచాలు ఆఫర్ చేసాడు (ఇవ్వలేదు ఇంకా) అన్నది భారతీయముఖ్యమంత్రులకు. కేసు పెట్టింది అమెరికాలో. అమెరికా ప్రభుత్వం ఇండియాలో జరగబోయింది అన్న ఆరోపణలు మీద కేసులు పెట్టి ప్రాసెక్యూట్ చేసే అధికారం ఉన్నదా?

  15. ఇంతకు..ముందు..యెల్లో..వైరస్…తెలుగు..రాష్ట్రాల్లోనే..ఉండేది. ఇప్పుడు..దేశము..మొత్తానికి..పాకింది, మోడీ..చేసిన..ఒక్క..తప్పు..4..ఎంపీ ..సీట్లకు..కక్రుత్తి ..పడి ..EVM..టాంపరింగ్ ..తో..చేసిన..తప్పువలన..చచ్చిన..యెల్లో..వైరస్..ను..మల్లి..బతికిచ్చాడు. అందరు..చదవండి…https://votefordemocracy.org.in/

  16. మరి బాబు Rs 6 కు అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా. ఎంత తిన్నాడు?

    Rs6 కరెక్ట్? ₹2.49 రాంగ్?

    ఎల్లో గ్యాంగ్ అబద్దాల బతుకులు

  17. మరి బాబు Rs 6 కు అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా. ఎంత తిన్నాడు?

    Rs6 కరెక్ట్? ₹2.49 రాంగ్?

    ఎల్లో గ్యాంగ్ అబద్దాల బతుకులు. ……

    1. ఇవ్వాళ్ళ ఉన్న మార్కెట్ దరలకి సరి చూసుకొని తక్కువ ధరికి ఎక్కడ వస్తుందొ వారితొ అగ్రిమెంట్ చెసుకుంటారు!

      సొలర్ ఎనర్జీ దరలు తగ్గుతూ వస్తుంది. 8 ఎళ్ళ క్రితం దరల తొ పొల్చి తక్కువ అని చెప్పటం మీకె చెల్లింది.

      1. Sir, please talk with sense and use your brain. Solar power was not expensive when he bought for 6 rupees. If he is clever enough and think about public , he wouldn’t have bought solar energy when price is high. When you can get power from other sources at much cheaper price. If he is visionary, he wouldn’t have signed a long term deal as he knows that prices will fall in the future. Do you still think 6 rupees + interest state charges is a better deal than 2.4? All lies and misleading public is what I can see in the current government. They don’t change and people will not change because brainless guys trust media than reality.

      2. 2-3 years లో 4.50 తగ్గేంత సోలార్ పురోగతి ఎప్పుడు వచ్చింది మిత్రమా?? కన్వీనియెంట్ గా ఆర్గ్యూ చేస్తున్నావు. అయినా మీకు దమ్ముంటే 2.49 కంటే తక్కువ తెచ్చి చూపించండి

  18. Ore great Andhra nuvvu kuda media vadive entasepu Jagan lanti criminal ni venakesukuratam tappa meeru chestunnadi eamity mundu meeru nijaiteega rayandi tarvata verevallani anandi dayachesi Andhra ni nasanam ch cheyakandi great Andhra kadura kadura ANDHRA SATRUVU Ani petukondi

  19. As long as Modi is PM, Adani will not pay single Paisa to any other politician. He will get his requirements accomplished thru Modi. Remember what happened in Mumbai Airport case!!!!

Comments are closed.