నాని తల్లిగా రమ్యకృష్ణ!

సినిమాలో హీరో తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకుంటున్నారని తెలుస్తోంది.

దసరా సినిమా కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా పారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు, సుధాకర్ చెరుకూరి నిర్మాత, నాని హీరో. ఈ సినిమా చాలా భారీ సినిమా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో స్టార్ కాస్ట్ బయటకు వస్తోంది.

ఈ సినిమాలో విలన్ పాత్రకు సీనియర్ హీరో మోహన్ బాబును తీసుకున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో వార్త ఏమిటంటే సీనియర్ హీరో రమ్య కృష్ణను కూడా ఈ సినిమాకు తీసుకుంటున్నారన్నది.

సినిమాలో హీరో తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు తల్లి పాత్ర చాలా కీలకం. అసలు ఈ పాత్రతో కథ ముడిపడి వుంటుందని, హీరో క్యారెక్టరైజేషన్ ఆధారపడి వుంటుంది తెలుస్తోంది. అందువల్ల రమ్యకృష్ణ లాంటి నటి అయితే ఆ పాత్రకు వెయిట్ వస్తుంది. అందుకే ఆమెను తీసుకుంటున్నారని బోగట్టా.

ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం ఓ గ్లింప్స్ కట్ చేసారు. కానీ ముందే టైటిల్ లీక్ అయిపోయిందని, ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టారు. హీరో నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నారు. దాని తరువాత ఈ పారడైజ్ సినిమా మీదకు వస్తారు.

3 Replies to “నాని తల్లిగా రమ్యకృష్ణ!”

Comments are closed.