చాలా కాంప్రమైజ్ అయ్యాను – అనన్య పాండే

మనల్ని మనం పూర్తిగా అర్పించుకున్నప్పుడే ప్రేమకు అర్థం ఉంటుందని, అదే టైమ్ లో ఎదుటి వ్యక్తి నుంచి అది ఆశించడంలో తప్పులేదని అంటోంది.

ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత అతడిపై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తోంది హీరోయిన్ అనన్య పాండే. నేరుగా అతడి ప్రస్తావన తీసుకురాకుండా తన కోసం మొత్తం వెళ్లగక్కుతోంది.

బ్రేకప్ తర్వాత తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టానని, ఫొటోలు అలా కాలుస్తూ ఉంటే చాలా బాధ తగ్గిందని వెల్లడించింది. ఇప్పుడు అతడిపై మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించింది. గత రిలేషన్ షిప్ లో తను చాలా కాంప్రమైజ్ అయ్యానని, కానీ చెడ్డ వ్యక్తుల పట్ల మరీ అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదని అంటోంది.

తను రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు భాగస్వామిలో కేవలం మంచిని మాత్రమే చూశానని, అతడి కోసం ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యానని, తననుతాను మార్చుకున్నానని తెలిపింది. మనల్ని మనం పూర్తిగా అర్పించుకున్నప్పుడే ప్రేమకు అర్థం ఉంటుందని, అదే టైమ్ లో ఎదుటి వ్యక్తి నుంచి అది ఆశించడంలో తప్పులేదని అంటోంది.

అలా తను భాగస్వామి నుంచి ఆశించినప్పుడు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకొచ్చింది. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు గౌరవం, విధేయత కలిగి ఉండాలని, అది లేనప్పుడు ఏ సంబంధం నిలవదని అంటోంది. రిలేషన్ షిప్ ప్రారంభించిన కొత్తలో భాగస్వామిని మెప్పించేందుకు చాలా పనులు చేస్తుంటామని, అలా కాంప్రమైజ్ అయ్యే క్రమంలో మనం చాలా మారిపోతామని అంటోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కొత్త డేటింగ్ లో ఉంది. వాకర్ బ్లాంకో అనే వ్యక్తితో ఆమె డేటింగ్ చేస్తోంది. తన క్లోజ్ సర్కిల్ లో కొంతమందికి అతడ్ని పరిచయం చేసింది కూడా.

4 Replies to “చాలా కాంప్రమైజ్ అయ్యాను – అనన్య పాండే”

Comments are closed.