ఏపీ హైకోర్టులో వ‌ర్మ మ‌రో పిటిష‌న్‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ న్యాయ పోరాటం సినిమాను త‌ల‌పిస్తోంది. వ‌ర్మ‌కు సినిమా క‌ష్టాలు వ‌చ్చాయి.

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ న్యాయ పోరాటం సినిమాను త‌ల‌పిస్తోంది. వ‌ర్మ‌కు సినిమా క‌ష్టాలు వ‌చ్చాయి. ఏపీలో ప్ర‌భుత్వం మార‌డంతో ఆయ‌న్ను కూట‌మి స‌ర్కార్ టార్గెట్ చేసింది. ఇప్ప‌టి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై వ్యంగ్యాత్మ‌క చిత్రాల‌ను ఆయ‌న తీసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కూట‌మి నేత‌లు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వ‌ర్మపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లాలో న‌మోదైన కేసుపై ఆయ‌న న్యాయ పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రో పిటిష‌న్‌ను ఆయ‌న ఏపీ హైకోర్టులో వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌న‌పై కేసులు న‌మోదు చేయ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని, ఇక‌పై న‌మోదు చేయ‌కుండా ఆదేశించాలంటూ ఆయ‌న ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుల‌పై అనేక కేసులు న‌మోదు చేస్తున్నార‌ని, ఒక విష‌య‌మై ఇన్ని కేసులు న‌మోదు చేయ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని పిటిష‌న్‌లో ఆయ‌న పేర్కొన్నారు.

అలాగే త‌న‌పై న‌మోదైన కేసుల‌న్నింటిని క్వాష్ చేయాల‌ని ఆయ‌న పిటిష‌న్‌లో కోరారు. ఇప్ప‌టికే క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు గ‌తంలో కొట్టి వేసింది. అయిన‌ప్ప‌టికీ కేసులే లేకుండా చేసుకోవాల‌ని ఆయ‌న న్యాయ పోరాటం చేస్తున్నారు. ముంద‌స్తు బెయిల్ కూడా రాక‌పోవ‌డంతో వ‌ర్మ అజ్ఞాతంలో గ‌డుపుతున్నారు.

అయితే త‌ను షూటింగ్ ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు వ‌ర్మ చెబుతున్నారు. వ‌ర్చువ‌ల్ విధానంలో విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డానికి ఆయ‌న సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. కానీ నేరుగా విచార‌ణ అంటే స‌సేమిరా అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తాజా పిటిష‌న్‌పై హైకోర్టు స్పంద‌న ఎలా వుంటుందో చూడాలి.

18 Replies to “ఏపీ హైకోర్టులో వ‌ర్మ మ‌రో పిటిష‌న్‌”

  1. అధికారం ఇచ్చింది case లు పెట్టడానికి కాదు.ఇంత అన్యాయం గ అనేక చోట్ల కేవలం ఒక పార్టీ వారినే target చెయ్యటం దారుణం.. అది కూడా అస్లీలత లేని కేవలం వ్యగ్యం తో కూడిన పోస్ట్ లు పెడితే arrest చెయ్యటం అన్యాయం.. ప్రజలు చూస్తున్నారు కర్రు కాల్చి వాత పెడతారు రాబోయే రోజుల్లో

  2. అధికారం ఇచ్చింది case లు పెట్టడానికి కాదు.. ఇంత అన్యాయం గ అనేక చోట్ల కేవలం ఒక పార్టీ వారినే target చెయ్యటం దారుణం.అది కూడా అస్లీలత లేని కేవలం వ్యగ్యం తో కూడిన పోస్ట్ లు పెడితే arrest చెయ్యటం అన్యాయం..ప్రజలు చూస్తున్నారు కర్రు కాల్చి వాత పెడతారు రాబోయే రోజుల్లో

  3. ఆర్ జి వీ గారి లాజిక్ మాత్రం అద్ధిరి పోయింది.

    ఎవడో… ఎవడి మీదో … పోస్ట్ పెడితే… ఆ పోస్ట్ ఎవడి మీదైతే పెట్టారో…. వారికి కాక… వేరేఎవరికో… మనోభావాలు దెబ్బతిని… కేసులు పెట్టడం ఏంటి? అది కూడా సంవత్సరాలు తరువాత… పోలా… అద్దిరిపోలా🤣🤣

    1. ఎవడో ఎవడినో bsdk అంటే అతనే వెళ్లి కొట్టాలిగా..ఎవరికో bp వచ్చి వాళ్లెందుకు పార్టీ ఆఫీస్ మీద దాడి చెయ్యాలి..?

      ఈ లాజిక్ అర్థం కాదులే బ్లూ బ్యాచ్ కి..

  4. వెధవ పనులు చేయడం దేనికి ఇలా దొంగ లాగా తప్పించుకుని తిరుగుతూ పిటిషన్లు వేయడం దేనికి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అది అడ్డు పెట్టుకుని విర్రవీగితే ఫలితం ఇలానే వుంటుంది

Comments are closed.