తెలంగాణ హైకోర్టులో కేఏ పాల్‌కు షాక్

ఇప్ప‌టికే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై తీర్పు వెలువ‌రించిన అంశాన్ని పాల్‌కు కోర్టు గుర్తు చేసింది.

తెలంగాణ హైకోర్టులో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌కు షాక్ త‌గిలింది. పాల్ వేసిన మ‌ధ్యంత‌ర పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ల‌కుండా ఆదేశించాల‌ని కోరుతూ కేఏ పాల్ పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌లో కీల‌క అంశాల్ని పాల్ ప్ర‌స్తావించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోకుండా, అలాగే తీర్మానాల‌కు సంబంధించి ఓటింగ్‌లో పాల్గొన‌కుండా ఆదేశించాల‌ని పాల్ కోరారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేంద‌ర్ అంశాన్ని పాల్ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇలా పార్టీలు మారుతూ పోతే ప్ర‌జాస్వామ్యంపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పోతుంద‌ని పాల్ తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే, ఇదో ఆన‌వాయితీగా మారుతుంద‌ని పాల్ అభిప్రాయ‌ప‌డ్డారు.

పాల్ పిటిష‌న్‌పై విచారించిన తెలంగాణ హైకోర్టు కీల‌క కామెంట్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు స్పీక‌ర్‌కు సంబంధించింద‌ని కోర్టు పేర్కొంది. ఇప్ప‌టికే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై తీర్పు వెలువ‌రించిన అంశాన్ని పాల్‌కు కోర్టు గుర్తు చేసింది. సింగిల్ జ‌డ్జి ఇచ్చిన నెల రోజుల కాల‌ప‌రిమితి చెల్ల‌ద‌ని డివిజ‌న్ బెంచ్ తెలిపింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఎప్పుడు చ‌ర్య‌లు తీసుకోవాల‌నేది స్పీక‌ర్‌కు సంబంధించిన అంశమ‌ని, దాంట్లో తాము జోక్యం చేసుకోలేమ‌ని కోర్టు ఇటీవ‌ల తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. అందుకే పాల్ పిటిష‌న్‌ను ఇవాళ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

4 Replies to “తెలంగాణ హైకోర్టులో కేఏ పాల్‌కు షాక్”

Comments are closed.