భయపెట్టి ఓట్లు వేయించగలరా?

ఇలా అరెస్ట్ అయిన వారు, వారి కుటుంబీకులు, సంబంధీకులు వీరంతా ఇంక ఎప్పటికీ యాంటీ తెలుగుదేశంగా, వైకాపా అనుకూలంగా వుండిపోవాల్సిందే కదా?

ఆర్నెల్లలో అన్నీ జరగవు. రోడ్లు బాగైపోవు.. ఇతరత్రా సమస్యలు సద్దు మణిగిపోవు. కానీ అక్కడక్కడ సన్నాయి నొక్కులు వినిపిస్తూనే వుంటాయి. వైకాపా సోషల్ మీడియా లేదా వైకాపా అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అస్సలు సమస్యలు కనిపించ‌కూడదు, వినిపించకూడదు అనే ప్లానింగ్ తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మద్యం వ్యవహారాలు, ఇసుక రేట్లు ఇలాంటివి అన్నీ నిత్యం ప్రముఖ దినపత్రికల జిల్లా పేజీల్లో కనిపిస్తూనే వున్నాయి. మరీ ఎక్కువగా కాకున్నా వీలయినంత వరకు ప్రజా సమస్యలను వార్తలుగా వేస్తూనే వున్నారు.

కానీ ఇవే వార్తలు లేదా సమస్యలు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. వైకాపా రూలింగ్ టైమ్ లో ఇలాంటివి అన్నీ కొండంతలుగా సోషల్ మీడియాలో కనిపించేవి. రోడ్ల గోతులు, ఇసుక రేట్లు, మద్యం పాట్లు ఇలా అన్నీ అటు జనసేన, ఇటు తేదేపా అనుకూల హ్యాండిల్స్ లో విపరీతంగా కనిపించేవి. ఇప్పుడు వైకాపా హాండిల్స్ ఆ పని చేయడం లేదు. దీనికి కారణం మరేమీ లేదు. అరెస్ట్ ల భయం. ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా జనాలను అరెస్ట్ చేసి, లోపల వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెగిటివిటీ అన్నది సద్దు మణిగిపోయింది.

కానీ ఇక్కడ ఒకటే అనుమానం. ఇలా అరెస్ట్ అయిన వారు, వారి కుటుంబీకులు, సంబంధీకులు వీరంతా ఇంక ఎప్పటికీ యాంటీ తెలుగుదేశంగా, వైకాపా అనుకూలంగా వుండిపోవాల్సిందే కదా? ఒక సారి దెబ్బతిన్నవారు, జైలుకు పోయిన వారు, కేసులు ఎదుర్కొన్న వారు అనుకూలంగా మారే అవకాశం తక్కువ కదా? వీరంతా వైకాపా ఓటు బ్యాంక్ అనుకుంటే, వాళ్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయడం లేదు. వారిని మరింత టార్గెట్ చేయడం ద్వారా, అటు పక్కే వుంచేస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు 40 శాతం ఓటు బ్యాంక్ వున్నట్లు వెల్లడైంది. అంతటి నెగిటివిటీలో కూడా నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు. కూటమి ప్రభుత్వం ఈ ఓటు బ్యాంక్ తగ్గించే ప్రయత్నం చేయకుండా, అలాగే స్థిరంగా వుంచేలా చేస్తోంది. ఇది సరి కాదేమో?

20 Replies to “భయపెట్టి ఓట్లు వేయించగలరా?”

  1. పిచ్చి GA…మీ MLA, Ministers తోనే opposition వాళ్ళని బలవంతం గా బూతులు తిట్టిoచి….పాపం వాళ్ళని వేరే పార్టీ లోకి వెళ్ళనివ్వకుండా చేసిన మన అన్నయ్య వీళ్ళని మాత్రం వదులుతాడా…..ఆలోచించు….FOOD FOR THOUGHT…

  2. లోపాలు చూపి విమర్శలు చెయ్యటం రానివాళ్లు ఏమి పోస్ట్లు పెడతారు వాళ్లకు వచ్చింది మహిళలను బూతులు తిట్టడం మాత్రమే ఆ 40 % వోటింగ్ కూటమికి ఏమి చేసిన రాదు అది జగన్ గారికి వచ్చిన వోటింగ్ గ భ్రమపడతున్నారు కానీ అది కూటమికి వ్యతిరేక వోటింగ్ ఇంకా చెప్పాలంటే అది కాంగ్రెస్ వోటింగ్ వాళ్లకు ఏమి చేసిన కూటమికి వెయ్యరు కాంగ్రెస్ బలపడితే కాంగ్రెస్ కి వెళ్లిపోయే వోటింగ్

    1. అది కూడా నాలుగు పార్టీలు పోటీ పడితే.. అందులో టీడీపీ కి 40% ఓట్లు వచ్చాయి..

      2024 లో అలా కాదు.. కూటమి ని ఒక పార్టీ గా తీసుకుంటే.. రెండు పార్టీలు పోటీ పడినట్టు.. అందులో వైసీపీ కి 40% రావడం .. ఏమంత గొప్పతనమో అర్థం కాదు..

      ఈ లెక్కలే చాలా సార్లు చెప్పాను.. కానీ వైసీపీ కొండగొర్రెలకు అర్థం కాదు..

      ..

      2019 లో ప్రజలకు 4 పార్టీల ఆప్షన్స్ ఉన్నప్పుడు.. 40% ప్రజలు టీడీపీ కి ఓటేశారు..

      2024 లో ప్రజలకు రెండే ఆప్షన్స్.. అందులో వైసీపీ కి 40% ఓట్లు… నిజాలు కనపడుతున్నా.. వాడేదో సాధించినట్టు భజన చేస్తుంటారు..

      1. బ్రో, oka request
        24 ఎన్నికల్లో వైసీపీకి 39.37% ఓట్లు వచ్చాయి.

        దయచేసి ఈ number ne mention cheyandi.

        GA Gaadu eng lo type cheste sachipotunnadu anduke telugu lo rastunna
  3. అధికారం ఇచ్చింది case లు పెట్టడానికి కాదు.. ఇంత అన్యాయం గ అనేక చోట్ల కేవలం ఒక పార్టీ వారినే target చెయ్యటం దారుణం.. అది కూడా అస్లీలత లేని కేవలం వ్యగ్యం తో కూడిన పోస్ట్ లు పెడితే arrest చెయ్యటం అన్యాయం.. ప్రజలు చూస్తున్నారు కర్రు కాల్చి వాత పెడతారు రాబోయే రోజుల్లో

  4. అధికారం ఇచ్చింది case లు పెట్టడానికి కాదు.. ఇంత అన్యాయం గ అనేక చోట్ల కేవలం ఒక పార్టీ వారినే target చెయ్యటం దారుణం.. అది కూడా అస్లీలత లేని కేవలం వ్యగ్యం తో కూడిన పోస్ట్ లు పెడితే arrest చెయ్యటం అన్యాయం.. ప్రజలు చూస్తున్నారు కర్రు కాల్చి వాత పెడతారు రాబోయే రోజుల్లో

  5. GA GARU తప్పేట KOYTADAMANI జగనన్నకు పాటలు చెప్పితే మీకు కూడా మంచి పేరు వస్తుంది

  6. G A GARU MEERU జగనన్న మాదిరి 6రాజధానులు మరియు 12 కొంపలు ఎర్పాటు చేసుకోండి కానీ ప్రజలనసాగించవద్దు

  7. Don’t think everything as votebank. YCheap gundaalu social media lo Yevarini ainaa yentha darunam gaa troll chesaaro chustune unnam. Vallaki oka bayyam raavaali Geetha daati personal level ki vellalante.

  8. నీవు విషయాన్ని వక్రీకరించడంలో expert వి, వాళ్లు రాజకీయ విమర్శలు చేస్తే ఓకే, అలాకాక వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతున్నారు. అన్ని కుటుంబాల లాగానే జగన్ కి, షర్మిల గారికి కుటుంబ తగాదాలు ఏర్పడ్డాయి, విజయమ్మ గారు కూతురు పక్షాన నిలబడ్డారు. నీవు సమర్దించే వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళని కూడా వదలలేదు, కనీసం జగన్ కూడా ఆపలేదు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు, ఎవ్వరైనా రాజకీయ విమర్శలే కే పరిమితమైతే ఏ పార్టీ వారికైనా మంచిది

Comments are closed.