లెక్సెస్.. టాలీవుడ్ కొత్త మోజు

హీరో నాగార్జున ఈ కొత్త కారు తీసుకున్నారు. లెక్సెస్ లో హై-ఎండ్ మోడల్ ఇదే. ఈ కారు మోడల్ పేరులోనే వీఐపీ ఉంది.

ఇండస్ట్రీలో డబ్బుకు కొదవలేదు. మరీ ముఖ్యంగా స్టార్స్ దగ్గర. మన హీరోలు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కార్లు మారుస్తుంటారు. మొన్నటివరకు రేంజ్ రోవర్ వెంటబడిన టాలీవుడ్, ఇప్పుడు కొత్త మోజు వెతుక్కుంది. మెల్లమెల్లగా లెక్సెస్ కు టర్న్ అవుతోంది.

హీరో నాగార్జున ఈ కొత్త కారు తీసుకున్నారు. లెక్సెస్ లో హై-ఎండ్ మోడల్ ఇదే. ఈ కారు మోడల్ పేరులోనే వీఐపీ ఉంది. ఇక మనోళ్లు తగ్గుతారా..! అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర అక్షరాలా 2 కోట్ల 46 లక్షల రూపాయలు. రోడ్డుపైకొచ్చేసరికి అటుఇటుగా 2 కోట్ల 80 లక్షలు అవుతుందనేది ట్రేడ్ మాట.

ఇప్పుడీ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు నాగార్జున. అధికారుల సమక్షంలో ఫొటో దిగి, డిజిటల్ సిగ్నేచర్ చేసి రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేశారు. తిరిగి అదే కారులో ఠీవిగా ఇంటికెళ్లిపోయారు. ఇండస్ట్రీలో ఇదే తొలి కారు కాదు. ఇదే మోడల్ కు చెందిన కారును కొన్నాళ్లుగా రామ్ చరణ్ వాడుతున్నాడు.

మొన్నటివరకు ఇండస్ట్రీ ఫేవరెట్ కారు రేంజ్ రోవర్. చిరంజీవి, రానా, పవన్ కల్యాణ్, బన్నీ, రవితేజ.. ఇలా చాలామంది హీరోల దగ్గర ఈ కార్లు ఉన్నాయి. ఆ తర్వాత కొన్నాళ్లు టయోటా వెల్ ఫైర్ రాజ్యమేలింది. ఇప్పుడు లెక్సెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు చాలామంది హీరోలు.

12 Replies to “లెక్సెస్.. టాలీవుడ్ కొత్త మోజు”

    1. IT వాళ్ళని చూసి non IT వాళ్ళూ ఇదే అనుకుంటారు.

      Everything depends on Market. జూనియర్ ఆర్టిస్ట్ కి కేవలం భోజనం… రోజు కూలీ మాత్రమే ఇస్తారు.

Comments are closed.