పుష్ప-1 Vs పుష్ప-2.. మారిన పరిస్థితులు!

పుష్ప-1తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకోవాలంటే, పుష్ప-2 కచ్చితంగా ఆడాల్సిందే. అది కూడా మామూలుగా ఆడితే చాలదు.

కాలం గిర్రున తిరిగింది. అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి. పుష్ప-1, పుష్ప-2 మధ్య కళ్లముందే మూడేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఈ మూడేళ్లలో సినిమాపై అంచనాలు పెరిగాయే తప్ప అస్సలు తగ్గలేదు. అదే టైమ్ లో పరిస్థితులు కూడా మారాయి.

ఆకాశాన్నంటిన అంచనాలు..

పుష్ప-1 విడుదలైనప్పుడు సినిమాపై ఉన్న అంచనాలు వేరు. అల వైకుంఠపురములో లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత పుష్ప-1 వచ్చింది. ఆ అంచనాల్ని అది ఈజీగానే అందుకుంది. ఇంకా చెప్పాలంటే, అంతకుమించిన ఘనత సాధించింది.

అదే ఇప్పుడు పుష్ప-2కు ఇబ్బందికరంగా మారింది. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన అంచనాల్ని పుష్ప-2 అందుకోవాల్సి ఉంది. అన్ని భాషల ప్రేక్షకుల్ని ఈ సినిమా సంతృప్తి పరచాల్సి ఉంది. మరీ ముఖ్యంగా జాతీయ అవార్డ్ అందుకున్న తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడంతో పుష్ప-2పై ఎక్స్ ట్రా లగేజీ పడినట్టయింది.

కళ్లు చెదిరే బిజినెస్..

బిజినెస్ పరంగా కూడా పరిస్థితులు బాగా మారిపోయాయి. పుష్ప-1 సినిమా రిలీజ్ టైమ్ కు బన్నీ పాన్ ఇండియా స్టార్ కాదు. అప్పుడు అతడి ఆలోచనలు వేరు, టార్గెట్స్ వేరు. వాటిని అతడు ఈజీగానే అందుకున్నాడు. కానీ పుష్ప-2 బిజినెస్ చూస్తుంటే మతిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసింది ఈ మూవీ.

తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే… ట్యాక్సులు, కమీషన్లు, అద్దెలు, కరెంట్ బిల్లులు పోను.. 215 కోట్ల రూపాయల షేర్ సాధించాల్సి ఉంది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు ఎంతగా మారిపోయాయో చెప్పడానికి ఈ 215 కోట్లు అనే నంబర్ సరిపోతుంది.

పెరిగిన వ్యతిరేకత..

మారిన పరిస్థితుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో అంశం.. బన్నీపై వ్యతిరేకత. ఈ మూడేళ్లలో అల్లు అర్జున్ పై క్రేజ్ ఎంత పెరిగిందో, అదే స్థాయిలో వ్యతిరేకత కూడా పెరిగింది. పవన్ తో ఏళ్లుగా నడుస్తున్న అభిప్రాయబేధాలు ఏపీ ఎన్నికల టైమ్ లో తారాస్థాయికి చేరాయి. ఆ గ్యాప్ ఇంకా అలా కొనసాగుతూనే ఉంది.

ఫ్యాన్స్ మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దీనికితోడు గేమ్ ఛేంజర్, విశ్వంభర, ఓజీ మాత్రమే మన సినిమాలు.. పుష్ప-2 కాదంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఆల్రెడీ ట్రోలింగ్ మొదలైంది. రిలీజ్ టైమ్ కు ఇది పతాక స్థాయికి చేరుకుంటుంది. దీన్ని తట్టుకొని నిలబడాలి పుష్ప రాజ్.

ఓవర్సీస్ లో మారిన పరిస్థితులు..

అటు ఓవర్సీస్ లో కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ మూడేళ్లలో కొన్ని పెద్ద సినిమాల రాకతో ఓవర్సీస్ లో కొత్త రికార్డులు, కొత్త కలెక్షన్ నంబర్లు తెరపైకొచ్చాయి. ఆ టార్గెట్స్ ను కూడా పుష్ప-2 అందుకోవాల్సి ఉంది.

పాన్ ఇండియా అప్పీల్..

వీటన్నింటికంటే ముఖ్యమైంది పాన్ ఇండియా అప్పీల్. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మొన్న పాట్నాలో అతడి కోసం వచ్చిన జనాల్ని చూసి టాలీవుడ్ జనం ముక్కున వేలేసుకున్నారు. ఇక ముంబయిలో ఈవెంట్ కూడా సక్సెస్. పుష్ప-1తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకోవాలంటే, పుష్ప-2 కచ్చితంగా ఆడాల్సిందే. అది కూడా మామూలుగా ఆడితే చాలదు. నార్త్ బెల్ట్ లో అరివీర భయంకరంగా ఆడాల్సి ఉంటుంది.

ఈ మూడేళ్లలో పుష్ప-2కు ఎంత క్రేజ్ పెరిగిందో, మారిన పరిస్థితుల మూలంగా సవాళ్లు కూడా అంతే పెరిగాయి. ఈ లెక్కలు, అంచనాల్ని అందుకొని మార్కెట్లో కూడా తగ్గేదేలే అనిపించుకోవాలి అల్లు అర్జున్.

30 Replies to “పుష్ప-1 Vs పుష్ప-2.. మారిన పరిస్థితులు!”

  1. సినిమా బాగుంటే అందరి ఫ్యాన్స్ చూస్తారు…ఇక్కడ ఏ ఒక్క అంశం శాశ్వతం కాదు ,చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు అంటే ఒక్క మెగా అభిమానులే చూస్తే అవ్వలేదు పైగా చిరంజీవి మెగాస్టార్ అయ్యే సరికి మెగా అభిమానులు అనబడే చాల మంది పుట్టనే లేదు…కాబట్టి సినిమా బాగుంటే చూడండి చాలు….అది ఎవ్వరిదైనా…పరిశ్రమ బాగుంటుంది

  2. ముఖ్యం ga ticket rates…. అప్పట్లో మన అన్నయ్య పైశాచిక ఆనందానికి బలి అయ్యింది…ఇప్పుడు pawan ఇచ్చిన 300 hike తో అన్ని అంచనాలను అందుకొని hit అవుతుంది….మీరు మాత్రం credit కోసం కొట్టుకోండి…😂😂

  3. ముఖ్యం గా ticket rates గురించి చెప్పు GA…. అప్పట్లో మన అన్నయ్య పైశాచిక ఆనందం కోసం 50RS పెట్టించి నాశనం చేశాడు….ఇప్పుడు pawan మాత్రం 300 rs hike ఇచ్చి సపోర్ట్ చేశాడు…. మీరు మాత్రం final credit kosam కొట్టుకు చావండి….siggu లేకుండా….😂😂

  4. మీరు టికెట్ రేట్ 50 rs petti movie ను చంపేస్తే…pawan 300 rs hike ఇచ్చి ఇప్పుడు బతికిచ్చాడు….మీరు ఈ రుద్దుడు ఆపి final credit కోసం కొట్టుకు చావండి GA….😂😂😂

  5. మీరు టికెట్ రేట్ 50 rs petti movie nu చంపేస్తే…pawan 300 hike ఇచ్చి సపోర్ట్ చేశాడు….😂😂

  6. మీరు అప్పట్లో టికెట్ రేట్ 50 rs petti movie ను ముంచేస్తే….pawan 300 rs hike ఇచ్చి సపోర్ట్ చేశారు…

  7. Theatre ki vacche public 50% of the population nundi 10% ki padipoyindhi ani film makers mi telisi, ee vacche 10% vaari mida ne, ticket rates 500% penchi collections gunjudhaamu ani plan. Audience ee tricks ki padoddu. Film bagundi, 2nd week daaka wait cheste, rates taggaaka choodu, leda OTT varaku wait chesi, aa full year threatre lo spend chese dabbu ni oka SIP start chesi mutual funds lo vesthe, 20 years lo meere rich avuthaaru…vallani enduku rich cheyyadam anavasaranga..

  8. Theatre ki vacche public 50% of the population nundi 10% ki padipoyindhi ani film makers ki telisi, ee vacche 10% vaari mida ne, ticket rates 500% penchi colls gunjudhaamu ani plan. Audience ee tricks ki padoddu. 2nd week daaka wait cheste, rates taggaaka choodu, leda OTT varaku wait chesi, aa theatre lo spend chese dabbu ni oka mutual funds SIP start cheste better

  9. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం… పుష్ప 1 నాటి కి OTT కి జనాలు అంతగా అలవాటు పడలేదు. ఇప్పుడు అంతా OTT మయం

  10. సినిమా అంటే 2 గంటలే ఉంటుంది.. 3గంటలు దాటింది అంటే.. తలపోటు,గుండెపోటు వచ్చి icu లో పనుకోవాల్సివస్తుంది.

Comments are closed.