‘కార్యకర్తలతో జగనన్న’ వచ్చే ఏడాది మేలుకుంటారట.!

పార్టీ ఓడిపోయి ఆరునెలలు దాటుతుండగా.. ఇప్పుడు ‘కార్యకర్తలతో జగనన్న’ అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం ఏమిటి?

కార్యశీలికి కార్యక్రమాలు అక్కర్లేదు. ఎక్కడ తను పనిచేయాల్సిన అవసరం ఉందో అక్కడ పనిచేసుకుంటూ వెళ్లిపోతాడు. తన పనికి ఒక కార్యక్రమం రూపంలో పేరు పెట్టుకోవాలని.. తద్వారా ఒక హడావుడి సృష్టించాలని అస్సలు అనుకోడు. అవసరం ఉన్నప్పుడు పనిచేయడం, ఆ పని ద్వారా.. వీలైనంత ఫలితాన్ని రాబట్టడం మాత్రమే కార్యదక్షుడైన వ్యక్తి చేయదలచుకునేది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం ఇందుకు కొంచెం భిన్నంగా కనిపిస్తోంది.

తన సొంత పార్టీని కాపాడుకోవడానికి ఆయన ఓడిపోయిన నాటినుంచి పనిచేస్తూనే ఉండి ఉండాలి. కానీ.. వచ్చే జనవరి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని చెబుతూ కొత్త హడావుడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నామకరణం కూడా చేశారు. ‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం’ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అని జగన్ స్వయంగా ప్రకటించారు.

నిజంగానే ఇలాంటి కార్యక్రమం నిర్వహించదలచుకున్నా కూడా ఆ పేరు పెట్టిన తీరును బట్టి.. మరొక నాయకుడు ఆ పేరును ప్రకటిస్తే బాగుంటుంది గానీ.. జగన్ స్వయంగా ప్రకటించుకోవడం చిన్నతనంగా ఉంది.

ఇంద్ర సినిమాలో మూగవాడిగా కనిపించే తనికెళ్ల భరణికి ఒక డైలాగు ఉంటుంది. ఇంద్రసేనారెడ్డి అసలు ఎవరో అందరికీ తెలియజెప్పడానికి ‘‘ఎవడి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్లు ఆనందంతో పులకరిస్తుందో.. ఎవరి పేరు చెబితే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో.. ఆ ఇంద్రసేనారెడ్డి’’ అంటూ ఆ డైలాగు సాగిపోతుంది. అలాంటి డైలాగు పక్కన నిల్చుని తనికెళ్ల భరణి చెబితేనే అందంగా ఉంటుంది. చిరంజీవి స్వయంగా.. డైలాగు అంతా చెప్పి.. ‘అలాంటి ఇంద్రసేనారెడ్డిని నేను’ అని చెప్పుకుంటే కామెడీగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా.. ‘కార్యకర్తలతో జగనన్న’ అనే కార్యక్రమాన్ని ప్రకటించుకోవడం అలాగే ఉంది.

పార్టీ ఓడిపోయి ఆరునెలలు దాటుతుండగా.. ఇప్పుడు ‘కార్యకర్తలతో జగనన్న’ అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం ఏమిటి? ఎలాంటి ప్రకటన లేకుండా ఆ పనిచేసుకుంటూ పోతే బాగుండేది. జనవరి నుంచి ఆ కార్యక్రమం అంటే.. ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ కార్యకర్తలతో తాను మమేకం కాలేకపోయానని, వారికి దగ్గర కాలేకపోయానని జగన్ స్వయంగా ఒప్పుకుంటున్నట్టే కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీ ఓడిపోయిన క్షణంనుంచి బలోపేతానికి కృషి జరుగుతూ ఉండాల్సింది. అలాంటిది వచ్చే జనవరి తర్వాత ఒక ముహూర్తం నిర్ణయించి.. అప్పటినుంచి దిశానిర్దేశం చేస్తానని జగన్ అనడం తమాషాగా ఉంది. బెటర్ లేట్ దేన్ నెవర్ అని సరిపెట్టుకోవచ్చు గానీ.. ఈ ప్రకటన ద్వారా తాను ఇన్నాళ్లూ అలాంటి పనిచేయలేదనే స్పృహతో జగన్ అడుగులు వేస్తే బాగుంటుందని, పార్టీకి మేలు జరుగుతుందని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

35 Replies to “‘కార్యకర్తలతో జగనన్న’ వచ్చే ఏడాది మేలుకుంటారట.!”

  1. అన్నయ్య కు ఎన్ని సార్లు అవకాశం ఇచ్చినా… ప్రజలకు ఐనా , కార్యకర్తలకు ఐనా చేసేది ఇంతే GA…..ఆ క్లారిటీ అందరికీ ఆల్రెడీ వచ్చేసింది GA…వాలంటీర్స్ ను RENEWAL చెయ్యకుండా వాడుకుని వదిలేశాడు…ఇప్పుడు వాల్లెక్కడ వచ్చి మీద పడతారని బైటికి వెళ్ళట్లేదు…అంతే….

    1. ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్న వైసీపీ కార్యకర్తల కోర్ట్ / లాయర్ ఫీజులు కూడా పార్టీ నుండి కట్టడం లేదు..

      ఇక వాళ్ళ కుటుంబాల బతుకులు కూడా నాశనం..

      జగన్ రెడ్డి ని నమ్ముకుని వాడిని అధికారం లో కూర్చోబెడితే.. వైసీపీ కార్యకర్తల కుటుంబాలు రోడ్డున పడ్డాయి..

      ..

      నువ్వు ఇక్కడ టీడీపీ ని, చంద్రబాబు ని తిడితూ ఆనందపడతావేమో.. గ్రౌండ్ లో నీ వైసీపీ కార్యకర్తల కుక్కబతుకులు ఒకసారి చూసి.. జగన్ రెడ్డి కి చెప్పుకో.. వెళ్లి..

      గత యిదేళ్ళు.. టీడీపీ కార్యకర్తలను.. ఆ కుటుంబాలను లోకేష్ ఎలా చూసుకొన్నాడో.. ఒకసారి కనుక్కో..

      నీ జగన్ రెడ్డి కి అధికారం కావాలి.. ఆ అధికారం కోసం కార్యకర్తలు కావాలి..

  2. కార్యకర్తలతో జగనన్న.. :

    1. నాకు ప్రతి పక్ష హోదా కావాలి ..

    2. శాలువా కప్పాలి ..

    3. పొగడ్తలతో ముంచెత్తాలి..

    4. అవార్డో గివార్డో ఇవ్వాలి …

    5. జగన్ మామయ్యా అంటూ అరవాలి..

    6. ఈనాడు ,ABN లో తిడుతూ రాయకూడదు

    ఈ డిమాండ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే.. జగన్ రెడ్డన్న బయటకు వస్తాడు.. లేదంటే.. ముసుగు తన్ని బజ్జున్టాడు …

    ఉంచుకున్న దాని అలక లాంటిది.. జగన్ రెడ్డన్న రాజకీయం..

  3. సారీ, నాకు ఎంత బుర్ర చించుకున్న అర్థం కాలేదు కొత్తగా అన్న కామెడీ అయ్యేది ఏముంది అని.

  4. ఎందుకు GA చచ్చిన పాముని ఇంకా చంపుతావు. వాడి లోకం లో వాడు బతుకుతున్నాడు. అలాగే వదిలేయ్ . ప్లీజ్…

  5. నువ్వు ఐదెళ్ళు ప్రజలతొ ఆడుకున్నావ్

    ఇక ప్రజలు జివితాంతం నితొ అడుకుంటారు

    ప్రజల emotions అంటె నీకు వెంట్రుకతొ సమానం

    ఇకపై నువ్వు పొర్లుదండాలు పెట్టినా..మొకాళ్ళ యాత్ర చెసిన నువ్వు CM అయ్యె చాన్స్ లెదు

  6. ఆన్న తో కలిసి ఫోటో దిగాలి అంటే 10వేలు రేటు అని ప్యాలస్ లో సైడ్ బిజినెస్ ప్లాన్ నిర్ణయం అయ్యింది కదా, అది కూడా రాయి.

    ఆన్న తల లో ఆకు పీకితే లక్ష అంట కదా.

  7. ప్యాలస్ గేటు దగ్గర రే*ట్లు పెట్టిన బోర్డు:

    ఆన్న తలలో ఆ*కు పీకడం : లక్ష

    ఆన్న తో ఫోటో : 50 వేలు

    ఆన్న తో షేక్ హ్యాండ్: 25 వేలు

    ఆన్న నీ దూరంగా వుంది చూడటం: 10 వేలు

    ఆన్న నీ ఇలా గి*న్ని పం*ది లాగ వాడుకుని ఇంకా డ*బ్బు సంపాదిస్తున్నారు.

  8. జగన్ గారు సిఎం గా ఉండగా…. ఆయనతో లంచ్ చేయడానికి వచ్చిన… ఆయన బావగారు… ఈరోజు లోకేష్ గారిని కలిసి … ఫోటోలు తీయించుకుని… X .. ఇన్స్టాగ్రం లలో పెట్టుకుని… మురిసిపోతున్నారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే… పవర్ లేకుంటే… ఎవరూ మనల్ని దేఖరూ అని.

  9. అంటే..

    • మాట్లాడ్డానికి మ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి..
    • ఫేషియల్స్ చేపించికోవాలి, జాలిగా కనపడాలిగా
    • పొడవడానికో, విసరడానికో బకరాలను వెతకాలి
    • తల్లి చెల్లి మీద కేసులు కోర్ట్ బయట క్లియర్ చేసుకోవాలి
    • టూర్ కి ఖర్చులు ఎవడు పెడతాడో చూసూవాలి
    • ఆ టైం కి నా కొ(గుట్కా బ్యాచ్), వ వ(పశువుల డాక్టర్), రోజా, గు అమర్నాథ్ లాంటి వాళ్లు అరెస్ట్ అవ్వకుండా ఉండాలి
    • ఇలా చాలా లెక్కలు ఉంటాయిగా
  10. ఇంకా బోలెడు కామెడీ స్టఫ్ దొర్కుతుంది యూట్యూబర్ల కి. పండగే ఇక. పెద్ద కామెడీ ఇస్తాడు రెడీ గా ఉండండిరా..అయినా ..

    పరదాలు ఎవరు కడతారు?

    చెట్లు ఎవరు నరుకుతారు?

    డ్వాక్రా మహిళలను ఎవరు తెస్తారు?

  11. అదికారంలో ఉన్నపుడు రాజబోగాలు నువ్వూ నీ మందీ మార్బలం అనుభవించి. కార్యకర్తలను మాత్రం నేల నాకించి,

    ఇప్పుడు కార్యకర్తలు మీ కోసం అదికార ప్రభుత్వం చేత వీపు, వల్లు పగల కొట్టించుకుంటే మరలా ముఖ్యమంత్రి అవుదా మని పగటి కలలు కంటున్నావా జగన్ అన్నా. తెలుగు ప్రజలు అంత విపి లు కాదనుకుంటా 🤔

Comments are closed.