టీడీ జ‌నార్ద‌న్‌ను దూరం పెట్టిన టీడీపీ

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి స‌న్నిహితుడిగా పేరు పొందిన టీడీ జ‌నార్ద‌న్‌ను పార్టీ దూరం పెట్టింది.

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి స‌న్నిహితుడిగా పేరు పొందిన టీడీ జ‌నార్ద‌న్‌ను పార్టీ దూరం పెట్టింది. ముఖ్యంగా దివంగ‌త నేత ఎన్టీఆర్ పేరు చెప్పుకుని టీడీపీ ఎన్ఆర్ఐల నుంచి భారీ మొత్తంలో వ‌సూళ్లు చేసిన‌ట్టు వారి నుంచి ఫిర్యాదులు వెళ్లిన‌ట్టు తెలిసింది. అలాగే పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ ప‌ద‌వులు ఇప్పిస్తాన‌ని టీడీ జ‌నార్ద‌న్ అధికారాన్ని సొమ్ము చేసుకుంటున్నాడ‌నే ఫిర్యాదులు అధిష్టానానికి వెల్లువెత్తిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబుతో స‌న్నిహిత సంబంధాల‌ను సాకుగా తీసుకుని వ‌సూళ్ల‌కు తెర‌లేపిన‌ట్టు ఆయ‌న‌పై టీడీపీ వ‌ర్గాల నుంచి ఫిర్యాదులు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. టీడీపీలో టీడీ జ‌నార్ద‌న్ అత్యంత కీల‌క నాయ‌కుడు. టీడీ జ‌నార్ద‌న్ సిఫార్సుతో చాలా మందికి ప‌ద‌వులు కూడా వ‌చ్చాయి. అలాగే చంద్ర‌బాబుకు వివిధ వ‌ర్గాల వారిని ద‌గ్గ‌ర చేయ‌డంలో టీడీ జ‌నార్ద‌న్ కీల‌క పాత్ర పోషించార‌నే అభిప్రాయం కూడా వుంది.

కానీ వీటిని అలుసుగా తీసుకుని ఏమైనా చేసుకోవ‌చ్చ‌నే బ‌రి తెగింపున‌కు జ‌నార్ద‌న్ పాల్ప‌డ్డార‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అంటున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐల‌ను ప్ర‌లోభ పెడుతూ బాగా సొమ్ము చేసుకున్నారనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఎన్ఆర్ఐల నుంచి ఫిర్యాదులు పెద్ద సంఖ్య‌లో రావ‌డంతో చంద్ర‌బాబు, లోకేశ్ త‌దిత‌ర నాయ‌కులు ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్టు తెలిసింది.

మ‌రీ ముఖ్యంగా టీడీపీలో బ్రాహ్మ‌ణ నాయ‌కుల్ని కుట్ర‌పూరితంగా టీడీ జ‌నార్ద‌న్ ప‌క్క‌న పెట్టార‌ని పార్టీ అధిష్టానం ప‌సిగ‌ట్టింది. త‌న‌కు ఇష్ట‌మైన వారిని మాత్ర‌మే చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర చేస్తున్నార‌నే ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే టీడీపీ మ‌హిళా నాయ‌కుల్ని వేధించార‌నే తీవ్ర ఆరోప‌ణ‌లు జ‌నార్ద‌న్‌పై వెల్లువెత్తాయి. బాధిత మ‌హిళ‌లు టీడీపీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్ల‌డంతో తీవ్రంగా ప‌రిగ‌ణించిన‌ట్టు తెలిసింది.

దీంతో జ‌నార్ద‌న్ సేవ‌ల‌కు ముగింపు ప‌ల‌కాల‌నే షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. అందుకే కొంత కాలంగా జ‌నార్ద‌న్ టీడీపీలో చురుగ్గా క‌నిపించ‌క‌పోవ‌డాన్ని సీనియ‌ర్ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. అయితే జ‌నార్ద‌న్‌ను స‌మ‌ర్థించే వారి అభిప్రాయం మ‌రోలా వుంది. టీడీపీలో త‌ర్వాత త‌రం నాయ‌కుల్ని ప్రోత్స‌హించే ఉద్దేశంతో సీనియ‌ర్ నాయ‌కుల్ని ప‌క్క‌న పెడుతున్నార‌ని, ఆ కోణంలోనే జ‌నార్ద‌న్‌ను దూరం పెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీలో టీడీ జ‌నార్ద‌న్ శ‌కం ముగిసిన‌ట్టే!

10 Replies to “టీడీ జ‌నార్ద‌న్‌ను దూరం పెట్టిన టీడీపీ”

  1. ఎందుకు రా సామీ ఇలాంటి వి రాస్తావు.. Ippudu జనాల్లో comparison వస్తుంది…ఇదే మన అన్న ఇంకా కోటరీ సంకెళ్ళ లోనే ఉన్నారు ఒకవేళ తెలిసిన వాటా తీసుకుంటారు… అదే vere party లో ఐతే చంబా దుంప తెంపి దూరం పెడుతున్నారు అని మెసేజ్ మీరు ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్టు ఉంది…

  2. అంటే ఎవరు ఎంత బొక్కారో ఎక్కడ బొక్కలో ఈయన గారికి తెలుసన్నమాట.. అవును ఆవు చేలో మేస్తే మరి td జనార్దన్ ఆమాత్రం scam చేయటం సహజం కదా

Comments are closed.