బుద్ధా వెంకన్న అంత అతి చేస్తున్నారు ఎందుకో?

ఇలాంటి వ్యాఖ్యల గురించి పోలీసు కేసు పెట్టడం అనేది బుద్ధా వెంకన్న చేస్తున్న అతిగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, ఒకసారి కేసులు పెట్టిన తర్వాత.. వేధించడానికి తగినట్టుగా పోలీసుల మీద ఒత్తిడి తేవడం ఈ వ్యవహారాలన్నీ చాలా రొటీన్ గా, కూటమి పార్టీల నాయకులకు, ప్రత్యేకించి తెలుగుదేశం నాయకులకు ఒక దైనందిన కార్యక్రమంలాగా మారుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది.

ఇంకా సూటింగా చెప్పాలంటే.. కేసుల ముసుగులో తెలుగుదేశం నాయకులు చాలా అతి చేస్తున్నారని కూడా అనిపిస్తోంది. తాజాగా విజయసాయరెడ్డి మీద తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న పెట్టిన కేసు అలాంటిదే.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడును జైల్లో పెడతాం అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారట. అందుకని ఆయనమీద బుద్ధా వెంకన్న పోలీసు కేసు పెట్టారు.

నిజంగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు లేదా సోషల్ మీడియా కార్యకర్తలు ఎవ్వరైనా సరే.. అధికారంలో ఉన్న పార్టీల నాయకులు అని మాత్రమే కాదు.. ప్రెవేటు వ్యక్తుల గురించి అయినా సరే.. అనుచితమైన అసభ్యమైన పోస్టులు పెడితే వారిమీద చర్యలు తీసుకోవాల్సిందే. దానిని ఎవ్వరూ కాదనరు. అసభ్యమైన దూకుడుకు ఎక్కడో ఒకచోట నియంత్రణ ఉండాల్సిందే.

అయితే ఇలా అధికారంలో తామే ఉన్నాం కదా అని.. తాము ఏ కేసులు పెట్టినా సరే.. పోలీసులు రిజిస్టరు చేస్తారు కదా అనే ఉద్దేశంతో అయినదానికీ కానిదానికీ కేసులు పెడుతూ పోతే.. చాలా చిల్లరగా ఉంటుంది. పైగా పెడుతున్న కేసుల్లో సీరియస్ నెస్ పోతుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. కావాలనే కేసులు పెడుతున్నారనే సంగతి ప్రజలు గుర్తిస్తారు. ప్రభుత్వం పరువు పోతుంది. బుద్ధా వెంకన్న, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసు కూడా అలా ప్రభుత్వం పరువు తీసేదే అని పలువురు అనుకుంటున్నారు.

ఎందుకంటే.. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులను అరెస్టులు, విచారణ వంటి పేర్లతో హెచ్చరించడం చాలా సహజం. తెలంగాణ రేవంత్ రెడ్డి ఏకంగా.. తాను సీఎం అయిన తర్వాత.. కేసీఆర్ ను వందడుగుల గొయ్యి తీసి బొంద పెడతా అని అన్నారు. అలాగని కేసీఆర్ సర్కారు రేవంత్ మీద అప్పట్లో హత్యాయత్నం, హత్యకు కుట్ర లాంటి కేసులు నమోదు చేసి ఉంటే ఎంత కామెడీగా ఉండేదో ఇప్పుడు బుద్ధా వెంకన్న కేసు కూడా అలాగే ఉంది.

సీఎం అవినీతికి పాల్పడుతున్నారు.. తాము అధికారంలోకి వచ్చాక ఆయన అవినీతిపై విచారించి జైల్లో పెడతాం అనేది చాలా సాధారణమైన విమర్శ మాత్రమే. ఇలాంటి విమర్శలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ తదితరులు గత అయిదేళ్లు కాలంలో జగన్ గురించి కొన్ని వందల వేలసార్లు అని ఉంటారు. కానీ ఎవ్వరూ ఆ మాటలపై కేసులు పెట్టిన దాఖలాలు లేవు. అందుకే ఇలాంటి వ్యాఖ్యల గురించి పోలీసు కేసు పెట్టడం అనేది బుద్ధా వెంకన్న చేస్తున్న అతిగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

6 Replies to “బుద్ధా వెంకన్న అంత అతి చేస్తున్నారు ఎందుకో?”

  1. A2మాటలు కరెక్టు అని మీరు చెప్పండి మీ మీద నేను పెడతా కేసు బేవార్స్ ఛానల్గా

  2. ఈ విజయ శాంతి రెడ్డి ని వాళ్ళ సోషల్ మీడియా సైరా అని కీర్తిస్తుంటారు ఎవరికైనా తెలిస్తే ఎందుకో చెప్పగలరా?

  3. A2 గాడి నోటి విరోచనాలగురించి రాయడు, ఆ మాటల్ని ఖండిస్తే మాత్రం రాస్తాడు..

  4. Chaduvu Leni illiterate fellow ee Cycle gantala donga…veedini aa lokesh gadu kooda pattinchukodam manesadu, andukey yedo media lo undalani stunts chestunadu ee illiterate fellow.

Comments are closed.