బీజేపీ అత్యాశ!

రాష్ట్రంలో బీజేపీ ఒకసారి అధికారంలోకి వస్తే శాశ్వతంగా అధికారంలో ఉంటుంది” అని అన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కొన్ని దశాబ్దాలపాటు అధికారం కొనసాగుతామని చెబుతుంటుంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులు తమ పార్టీ 30 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు.

కానీ రెండో ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ నాయకులూ అదే పాట పాడారు. కానీ ఏం జరిగిందో చూశాం. జగన్ “వై నాట్ 175” అన్నాడు. కానీ ఎంత దారుణమైన ఫలితాలు వచ్చాయో చూశాం. తెలంగాణా ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా తాను శాశ్వత అధికారి అన్నట్లుగా ఫీలయ్యాడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఈ పరిణామాల ద్వారా రాజకీయ పార్టీల అత్యాశ ఎలా ఉంటుందో స్పష్టమవుతోంది. ఏ పార్టీ కూడా దశాబ్దాలపాటు అధికారంలో ఉండడం సాధ్యం కాదు. ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే సీపీఎం సీఎం జ్యోతి బసుకు సాధ్యమైంది. కానీ మూడు దశాబ్దాల తరువాత ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఎదురయ్యిందో చూశాం.

తాజాగా హైదరాబాదులో బీజేపీ సభ నిర్వహించింది. ఆ సభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరయ్యాడు. ఆయన కూడా గులాబీ పార్టీ మాదిరిగానే కాంగ్రెస్‌ను విమర్శించాడు. ఆయన తెలిపినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అబద్ధాలు చెప్పి, మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అవును, కాంగ్రెస్ హామీలను పూర్తిగా అమలు చేయలేక తంటాలు పడుతున్నది.

ప్రస్తుతం ఏ పార్టీ అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా హామీలు ఇవ్వదు. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపు కాదు. అధికారంలోకి రావడమే లక్ష్యం కాబట్టి పార్టీలు ముందుగా హామీలు ఇచ్చేస్తాయి. అధికారంలోకి వచ్చాక పరిస్థితులను తేల్చుకుంటాయి.

ఇదిలా ఉంటే, నడ్డా ఏమన్నాడు? “రాష్ట్రంలో బీజేపీ ఒకసారి అధికారంలోకి వస్తే శాశ్వతంగా అధికారంలో ఉంటుంది” అని అన్నారు. అంటే, తమ పాలన అంత బాగుంటుందని చెప్పడమే. కానీ గెలుపోటములు శాశ్వతం కాదన్న విషయం నడ్డాకు తెలియదా?

తెలుసు. కానీ ఇది అధికార పట్ల అత్యాశ. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతే ఆ స్థానాన్ని మళ్లీ గులాబీ పార్టీయే భర్తీ చేసే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే, రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.

6 Replies to “బీజేపీ అత్యాశ!”

  1. అత్యాశ ఎందుకు అనుకోవాలి? కేంద్రం లో 3 సార్లు వరసగా వచ్చారా లేదా,? గుజరాత్ లో ఆరవసారి గెలిచారు. మహారాష్ట్రలో మూడవసారి. మధ్యప్రదేశ్ లో చిన్న గాప్ తో నాలుగు సార్లు. చట్టిస్ ఘడ్ లో ఇప్పుడు ఉన్నది నాలుగోసారి. హర్యానా యూపీ ఉత్తరాఖండ్లో రెండుసార్లు వరసగా గోవా అరుణాచల్ త్రిపుర మణిపూర్ లో వరసగా రెండవసారి గెలవలేదా? చేతకానివాడు ప్రగల్బాలు పలికితే అత్యాశ. సమర్ధుడు పలికితే ఆత్మవిశ్వాసం.

    ఆ తేడా నీకు తెలియదులే

    1. sarina opposition leader leka bjp ki votlu padutunnayi.

      Congress was watching eyes wide open when 2008 Mumbai attacks happened.

      no citizen approve that kind of actions.

      With help from China, pak planned those attacks without any fear from India. Why, congress action is wait and watch, people forgets. But with social media, people know the truths and they forget Congress party.

      for now, bjp success is because of weak opposition

Comments are closed.