కొత్త తెలంగాణ తల్లిపై గులాబీ పార్టీ ఇంకా మండిపడుతూనే ఉంది. కేటీఆర్, కవిత విపరీతంగా ఫైర్ అవుతున్నారు. వీరికి కొందరు కవులు, కళాకారులు కూడా తోడయ్యారు. కవిత పాత తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసింది. కొత్త తెలంగాణ తల్లిని తాము అంగీకరించబోమని తెగేసి చెప్పింది.
కొత్త తెలంగాణ తల్లికి బంగారమేదీ అని గులాబీ పార్టీ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణా సంస్కృతిలో భాగమైన, తెలంగాణ ఆడపడుచుల సెంటిమెంటైన బతుకమ్మను తొలగించారని ఆవేదన చెందుతున్నారు. పాత బతుకమ్మకు ఒక చేతిలో బతుకమ్మ ఉండేది. తాము అధికారంలోకి రాగానే కొత్త బతుకమ్మను గాంధీ భవన్ కు పంపుతామని కేటీఆర్ అన్నాడు.
కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తాను తయారుచేయించిన తెలంగాణ తల్లికి బంగారం లేకుండా చేశాడని మండిపడ్డారు. తెలంగాణ తల్లి బంగారానికి అర్హురాలు కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసినందుకు నిరసనగా ప్రభుత్వం తనను సత్కరించి ప్రదానం చేస్తానన్న కోటి రూపాయలను తిరస్కరించానని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి చెప్పారు. కొత్త తెలంగాణ తల్లి అభయహస్తం చూపిస్తోంది కాబట్టి ఆమె తెలంగాణా తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అనే విమర్శలు వస్తున్నాయి.
కొత్త తెలంగాణ తల్లిపై గులాబీ పార్టీ మండిపాటు మామూలుగా లేదు. విగ్రహం ఆవిష్కరిస్తే దానికి ప్రత్యేకంగా జీవో జారీ చేయడమేమిటని కేటీఆర్ ప్రశ్నించాడు. కేసీఆర్ ఈ పిచ్చి పని చేయలేదన్నాడు. తల్లి అని చెబుతూనే దానికి జీవో జారీ చేయడమేమిటన్నాడు. భరతమాత, తెలుగుతల్లి, కన్నడతల్లి విగ్రహాలు ఆవిష్కరించినప్పుడు ఏ జీవోలు జారీ చేశారని అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.
కేసీఆర్ కూడా ఆగ్రహం ఉంటుంది. కానీ ఎప్పటిమాదిరిగానే మౌనంగా ఉన్నాడు. తాను నోరు తెరిచి మాట్లాడితే రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అవుతాడు. ఆ రచ్చ ఎందుకని ఊరుకున్నాడేమో ! తెలంగాణ తల్లి రచ్చ ఇలాగే కంటిన్యూ అవుతుందా?
liquor కవిత అని క్లియర్ గా రాయండి అర్థం అవుతుంది!!
అసలు బతుకమ్మ కి తెలంగాణ కి సంబంధమే లేదు, ఇంక బంగారం ముక్కోడి ఫార్మ్ హౌస్ లో ఉంది , లిక్కర్ దందాలు చేసుకునే కవిత , ఫోన్ టేప్ చేసి బెదిరించి హీరోయిన్స్ తో కలిసి డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ దగ్గర నీతులు చెప్పించునే స్థితి లో రేవంత్ రెడ్డి లేడు
super sir
తెలంగాణ..ఎప్పుడు..పేద..రాష్ట్రమే, HYD..లేక..పోతే..పెద్ద..గుండు.సున్నా. ఆంధ్ర..పెట్టుబడులతో..బతుకుతున్న..రాష్ట్రము..తెలంగాణ. అమరావతి..క్లిక్..అయితే..పచ్చ..బ్యాచ్..షిఫ్ట్..అయితే..సగము..HYD..ఖాళీ..అవుతుంది.ఫ్రీ..గా..వచ్చిన..డబ్బులు..దర్జా..ఎక్కువ..కాలము..ఉండదు.
‘shikkati shirunavvu’ tho telangana talli “good morning” chebutunnattu vunte mee bidda ki bavuntadi !!!