స్పీడ్‌గా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా

ఇప్పటివరకు ఈ సినిమా 2025లో రాదు అనే టాక్ ఉంది. కానీ ఈ వర్క్ స్పీడ్ చూస్తుంటే వచ్చినా రావచ్చు అనిపిస్తోంది, సరైన డేట్ దొరికితే.

ఉప్పెన సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈగర్‌గా వేచి ఉన్నాడు దర్శకుడు బుచ్చిబాబు. దాదాపు మూడేళ్లు బౌండ్ స్క్రిప్ట్ పట్టుకుని, మెరుగులు దిద్దుకుంటూ రామ్ చరణ్ డేట్స్ కోసం వేచి ఉన్నాడు. ఇప్పుడు టైమ్ వచ్చింది. షూట్ ప్రారంభమైంది. షూట్ మొదలు కావడమే కాదు, పరుగులు పెడుతోంది. మైసూర్‌లో ఒక షెడ్యూల్ ముగించేసారు. గ్యాప్ ఇవ్వకుండా మరో షెడ్యూల్ సిటీలో స్టార్ట్ చేసేశారు. చూస్తుంటే ఈ లెక్కన టాకీని చకచకా కంప్లీట్ చేసేసేలా ఉన్నారు.

షూటింగ్ ప్రారంభం కాకముందే రెహమాన్‌తో మూడో నాలుగో పాటలు రెడీ చేసేశారు బుచ్చిబాబు. అందువల్ల ఎప్పుడు డేట్స్ అందుబాటులో ఉంటే, అప్పుడు పాటలు షూట్ చేయవచ్చు. టాకీని చకచకా పూర్తిచేస్తే, సీజీ వర్క్స్‌కు పంపించవచ్చు. ఇప్పటివరకు ఈ సినిమా 2025లో రాదు అనే టాక్ ఉంది. కానీ ఈ వర్క్ స్పీడ్ చూస్తుంటే వచ్చినా రావచ్చు అనిపిస్తోంది, సరైన డేట్ దొరికితే.

జాన్వీ కపూర్, వివిధ భాషల కీలక నటులు నటిస్తున్న ఈ సినిమాను సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్‌కు ఇది తొలి సినిమా. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. స్పోర్ట్స్ డ్రామా మిక్స్ అయిన ఈ సినిమా పక్కా గ్రౌండ్ లెవెల్‌లో ఉండటంతో పాటు, చాలా ఎమోషనల్ కంటెంట్‌తో ఉంటుందని తెలుస్తోంది.

2 Replies to “స్పీడ్‌గా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా”

Comments are closed.