బాహుబలిని మించిన పుష్పరాజ్

561.50 కోట్ల రూపాయల వసూళ్లతో పుష్ప-2 హిందీ వెర్షన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 11 రోజుల్లో పుష్ప-2 ఈ ఘనత సాధించింది.

బాహుబలి గెలుస్తాడా.. పుష్పరాజ్ గెలుస్తాడా.. బాహుబలిని పుష్పరాజ్ ఓడించగలడా..? నార్త్ బెల్ట్ లో మొన్నటివరకు జరిగిన ఈ చర్చకు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడింది. ఉత్తరాదిన ఇకపై బాహుబలి-2 నంబర్ వన్ డబ్బింగ్ సినిమా కాదు. ఆ రికార్డ్ ఇప్పుడు పుష్పరాజ్ సొంతమైంది.

బాహుబలి-2 హిందీ వెర్షన్ ను కొట్టే డబ్బింగ్ సినిమా ఇప్పటివరకు రాలేదు. కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ సినిమాల హిందీ వెర్షన్లు కూడా బాహుబలి-2 వెనకే ఆగిపోయాయి. ఇప్పుడు పుష్ప-2 వచ్చింది. నంబర్-1 హిందీ డబ్బింగ్ సినిమాగా నిలిచింది.

రూ. 510.99 కోట్ల రూపాయల వసూళ్లతో మొన్నటివరకు బాహుబలి-2 హిందీ వెర్షన్ అగ్రస్థానంలో కొనసాగగా.. 561.50 కోట్ల రూపాయల వసూళ్లతో పుష్ప-2 హిందీ వెర్షన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 11 రోజుల్లో పుష్ప-2 ఈ ఘనత సాధించింది.

పుష్ప-2 సినిమా హిందీ వెర్షన్ కు ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆదరణ చూపిస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు. అంతేకాదు, సెకెండ్ వీకెండ్ లో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి హిందీ చిత్రంగా పుష్ప-2 నిలిచింది.

ఉత్తరాదిన ఈ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. రేపోమాపో ఇది 600 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటర్ కానుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ లైఫ్ టైమ్ వసూళ్లు 700 కోట్ల రూపాయలను తాకొచ్చనేది బాలీవుడ్ ట్రేడ్ అంచనా.

టాప్-5 హిందీ డబ్బింగ్ సినిమాలు (నెట్ వసూళ్లు)
1. పుష్ప-2 – 561.50 కోట్లు (11 రోజుల నెట్)
2. బాహుబలి 2 – 510.99 కోట్లు
3. కేజీఎఫ్ 2 – 434.70 కోట్లు
4. కల్కి – 294.25 కోట్లు
5. ఆర్ఆర్ఆర్ – 274.31 కోట్లు

6 Replies to “బాహుబలిని మించిన పుష్పరాజ్”

Comments are closed.