జైళ్ల‌లో 110 మంది వైసీపీ యాక్టివిస్టులు!

సుమారు 110 నుంచి 120 మంది వ‌ర‌కూ వైసీపీ సోష‌ల్ మీడియా, అలాగే వివిధ స్థాయిల్లోని యాక్టివిస్టుల‌ను జైళ్లో పెట్టిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత‌, వివిధ కార‌ణాల‌తో సుమారు 110 నుంచి 120 మంది వ‌ర‌కూ వైసీపీ సోష‌ల్ మీడియా, అలాగే వివిధ స్థాయిల్లోని యాక్టివిస్టుల‌ను జైళ్లో పెట్టిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నెల‌ల త‌ర‌బ‌డి వాళ్ల‌కు బెయిల్ కూడా రావ‌డం లేదు. అయినప్ప‌టికీ ఇంకా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేద‌నే నిల‌దీత టీడీపీ, ఆ పార్టీ మీడియా నుంచి ఎదురు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ముఖ్యంగా కూట‌మి స‌ర్కార్‌పై గ‌తంలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టార‌నే కార‌ణంతోనే ఎక్కువ మందిని అరెస్ట్ చేసిన‌ట్టు వైసీపీ నేత‌లు అంటున్నారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్‌, ఇంటూరి ర‌వికిర‌ణ్‌, వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి, సుధారాణి దంప‌తులతో పాటు రెండు మూడు రోజుల క్రితం కూడా అర్ధ‌రాత్రి వేళ వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్ని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

వీళ్లంద‌రికీ న్యాయ సాయాన్ని వైసీపీ అందిస్తోంది. స్థానికంగా కాకుండా, దూర ప్రాంతాల్లో కేసులు న‌మోదు చేసి ముప్పుతిప్ప‌లు పెడుతున్నార‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. కొంద‌రికి ముంద‌స్తు బెయిళ్లు ల‌భించాయి. మ‌రికొందరు అజ్ఞాతంలో ఉన్నారు.

మొత్తానికి కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత వైసీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌కు కేసుల‌తో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.

10 Replies to “జైళ్ల‌లో 110 మంది వైసీపీ యాక్టివిస్టులు!”

  1. May be more than that..

    it’s ok..ivi anni sollu case lu..

    elagu serious offense ledu kabatti vadilesthaaru..

    it’s just 6 months..

    papam tdp pigs ki satisfaction kosam chestunnaru

  2. గుంపుగా వున్నా కూటమి భయపడుతుంది ఇలా ఐతే అయ్యన్న పులకేశి చంబా మాట్లాడిన బూతు తిట్ల మాటలకు ఇంతకంటే ఎక్కువ శిక్ష పడుతుంది

  3. బన్నీ కి వాడిన లాయర్ నే వీళ్ళకి వాడితే గంటలో బయటికి వచ్చేస్తారేమో..బేరం కుదర్లేదా?

  4. వాళ్ళను లోపలేయడం వల్లే మన వెబ్సైటు లో బూతు పోస్ట్లు పెట్టె ఆస్థాన విద్వాన్సులు అన్ని మూసుకొని పడివున్నారు దరిద్రం వదిలింది అది మీకు సంతోషమే కదా

Comments are closed.