చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్.. టాలీవుడ్ టాప్ స్టార్స్ వీళ్లంతా. నిత్యం ఏదో ఒక సినిమా అప్ డేట్ తో వీళ్లు ట్రెండింగ్ లో కనిపిస్తూనే ఉంటారు. మరి, ఈ ఏడాది వీళ్లు నటించిన సినిమాలేంటి? దీనికి సమాధానం సున్నా. అవును.. వీళ్లు మాత్రమే కాదు.. ఏకంగా 12 మంది పేరున్న హీరోలు ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండానే 2024ను ముగించారు. అదే విచిత్రం.
ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ ఏడాది తమ సినిమాల్ని రిలీజ్ చేశారు. అదే టైమ్ లో చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ ఈ ఏడాదిని మిస్సయ్యారు. చకచకా సినిమాలు చేసే చిరంజీవి నుంచి ఒక ఏడాది మొత్తం మూవీ రాకపోవడం విచిత్రమే. దీనికి కారణం భోళాశంకర్. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో చిరంజీవి వెనక్కు తగ్గక తప్పలేదు. అప్పటికే అంగీకరించిన సినిమాలపై ఆయన మరోసారి రివ్యూ చేశారు. కొన్ని సినిమాలు పక్కనపెట్టారు. మరికొన్నింటిని పట్టాలపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఏడాది గడిచిపోయింది.
వరుసపెట్టి సినిమాలు చేసే బాలకృష్ణ కూడా 2024లో సినిమాలు చేయలేకపోయారు. ఆయన వరుసగా హిట్స్ కొడుతున్నారు. అయినప్పటికీ గ్యాప్ రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు బాలయ్య. అలా ఈ ఏడాదిని ఆయన మిస్సయ్యారు. వచ్చే ఏడాది బాలకృష్ణ నుంచి కచ్చితంగా 2 సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి డాకు మహారాజ్, రెండోది అఖండ-2.
బాలయ్య కంటే చాలా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో సత్తా చాటాల్సిన క్లిష్ట పరిస్థితి ఆయనది. అందుకే చేతిలో ఉన్న సినిమాలన్నీ పక్కనపెట్టి మరీ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అందుకే ఈ ఏడాది పవన్ నుంచి సినిమా రాలేదు. వచ్చే ఏడాది కచ్చితంగా 2 సినిమాలు వస్తాయి. ఎందుకంటే, ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు రెండూ దాదాపు షూటింగ్స్ పూర్తిచేసుకున్నాయి.
రామ్ చరణ్ కు కూడా గ్యాప్ తప్పలేదు. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత శంకర్ డైరక్షన్ లో నటించడానికి ఒప్పుకున్నాడు. శంకర్ తో సినిమా అంటే డెడ్ లైన్స్ ఉండవనే సంగతి తెలిసిందే. కదా.. అలా ఒకేడాది కాదు, ఏకంగా రెండేళ్లు బాక్సాఫీస్ కు దూరమయ్యాడు ఈ హీరో.
నితిన్, నాగచైతన్య, సాయిదుర్గతేజ్ కూడా ఒక్క సినిమా రిలీజ్ చేయలేకపోయారు. ఈ విషయంలో ఎవరి కష్టాలు వాళ్లకున్నాయి. వరుస ఫ్లాపులతో నితిన్ కు గ్యాప్ తప్పలేదు. అటు నాగచైతన్యకు కూడా థ్యాంక్ యూ, కస్టడీ లాంటి ఫ్లాప్స్ తర్వాత గ్యాప్ తప్పలేదు. అయితే సాయిదుర్గతేజ్ కు మాత్రం విరూపాక్ష, బ్రో లాంటి సినిమాల తర్వాత కూడా ఫ్లాప్ తప్పలేదు. యాక్సిడెంట్ నుంచి కోలుకునే క్రమంలో సాయితేజ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
అఖిల్, నాగశౌర్య, అడివి శేష్ కూడా 2024 మిస్సయ్యారు. అఖిల్, నాగశౌర్య ఫ్లాపుల వల్ల గ్యాప్ తీసుకోగా.. అడివి శేష్ కు మాత్రం తనకొచ్చిన క్రేజ్ ను కాపాడుకునే క్రమంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల గ్యాప్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఒకేసారి 2 సినిమాలు చేయడం వల్ల ఏ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. మామూలుగానే శేష్ టైమ్ ఎక్కువ తీసుకుంటాడు, ఈసారి ఇంకాస్త ఎక్కువ గ్యాప్ వచ్చిందంతే
ఇక బెల్లంకొండ సాయిశ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు కూడా ఈ ఏడాది బాక్సాఫీస్ ను మిస్సయ్యారు. ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టి ఫ్లాప్ తెచ్చుకున్న బెల్లంకొండ, టాలీవుడ్ సినిమాలకు కూడా గ్యాప్ ఇవ్వడంతో ఈ ఏడాది మిస్సయ్యాడు. అటు వైష్ణవ్ తేజ్ ను వరుస ఫ్లాపులు వెక్కిరించాయి. రంగరంగ వైభవంగా, ఆదికేశవ డిజాస్టర్స్ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య ఈ ఏడాది మొత్తం అతడు వెయిటింగ్ లో ఉన్నాడు. ఇలా 2024 బాక్సాఫీస్ ను దాదాపు 12 మంది ప్రముఖ హీరోలు మిస్సయ్యారు. వచ్చే ఏడాది వీళ్లంతా యాక్టివ్ అవ్వబోతున్నారు.
Ott tv ఏ future…money waste halls కి…బదులుగా gals best
Andhuke telugu movie industry sankanaki poindhi
కింది వరుసలో ఉన్న వాళ్లలో అడివి శేష్ తప్ప మిగతా వాళ్ళను ప్రేక్షకులు హీరోలుగా భావించలేదు/గుర్తించలేదు
అందుకే వాళ్ళ సినిమాలు ఎడా పెడా ప్లాప్ చేసేసారు
nashtam ldu
మాకు అవసరం లేదు