ప‌వ‌న్‌ను వెంటాడుతున్న వాలంటీర్ల కేసు

ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌జాప్ర‌తినిధి అని, కాబ‌ట్టి ఆయ‌న కేసు ఆ కోర్టులోనే ప‌రిష్క‌రించాల్సి వుంటుంద‌ని జ‌డ శ్ర‌వ‌ణ్ వాదిస్తున్నారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వాలంటీర్ల కేసు వెంటాడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు, ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాలంటీర్ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్ప‌డుతున్నారంటూ ప‌వ‌న్ చేసిన కామెంట్స్ రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపాయి. అప్ప‌ట్లో ప‌వ‌న్ కామెంట్స్‌కు వ్య‌తిరేకంగా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కూడా నిర్వ‌హించారు.

వాలంటీర్ల ఫిర్యాదు మేర‌కు ప‌వ‌న్‌పై కేసు కూడా న‌మోదు చేశారు. అయితే కూట‌మి స‌ర్కార్ కొలువుదీరిన త‌ర్వాత గుంటూరు కోర్టులో ప‌వ‌న్‌పై కేసును ఉప‌సంహ‌రించుకున్నారు. కానీ కేసు ఉప‌సంహ‌ర‌ణ చెల్ల‌దంటూ ప్ర‌ముఖ న్యాయ‌వాది జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ అంటున్నారు. ఈ మేర‌కు ప‌వ‌న్‌పై కేసు ఉప‌సంహ‌ర‌ణ‌ను స‌వాల్ చేస్తూ హైకోర్టులో జ‌డ పిటిష‌న్ వేసిన‌ట్టు తెలిసింది.

ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌జాప్ర‌తినిధి అని, కాబ‌ట్టి ఆయ‌న కేసు ఆ కోర్టులోనే ప‌రిష్క‌రించాల్సి వుంటుంద‌ని జ‌డ శ్ర‌వ‌ణ్ వాదిస్తున్నారు. గుంటూరు కోర్టు నుంచి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టుకు ప‌వ‌న్ కేసును బ‌దిలీ చేసుకోవాల్సి వుంటుంద‌ని జ‌డ శ్ర‌వ‌ణ్ చెబుతున్నారు.

అందుకే ప‌వ‌న్‌పై కేసు ఎత్తేసిన విధానం స‌రైంది కాద‌ని జ‌డ్ శ్ర‌వ‌ణ్‌కుమార్ న్యాయ పోరాటం మొద‌లు పెట్టారు. మ‌రీ ముఖ్యంగా వాలంటీర్లంద‌రిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డంతో, ఎవ‌రో ఒక‌రు ఉప‌సంహ‌రించుకున్నంత మాత్రాన చెల్ల‌ద‌ని జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ అంటున్నారు. వాలంటీర్ల‌లో ఎవ‌రైనా ప‌వ‌న్‌పై ప‌రువు న‌ష్టం కేసు వేయొచ్చ‌ని ఆయ‌న అంటున్నారు. మొత్తానికి ప‌వ‌న్‌ను వాలంటీర్ల కేసు వెంటాడుతోంది.

17 Replies to “ప‌వ‌న్‌ను వెంటాడుతున్న వాలంటీర్ల కేసు”

  1. వలటీర్లు ట్రాఫికింగ్ పాల్పడ్డారు అన్నాడు… మరి వీల్ల ప్రభుత్వం లో కూడ మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతునే ఉన్నాయి.. అవెవ్వరు చేస్తున్నట్టొ

  2. ఈ అరజడ KI 400 ఓట్లు VACHINAPPUDU NUNCHI వాటిని ఏమి చేసుకోవాలో తెలియక కోర్ట్ లో కేసు వేసినట్టున్నాడు —

  3. జనసేన లో చేరబోతున్న వైసీపీ లీడర్స్

    -పెద్దిరెడ్డి

    – విజయ సాయిరెడ్డి

    – అంబటి రాంబాబు

    – పేర్ని నాని

    – గుడివాడ అమర్నాథ్

    – మార్గాన్ని భారత్

    వీళ్లంతా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నru. ok cheppina DCM pawan

Comments are closed.