జమిలి ఎన్నికలు ఎందుకయ్యా అంటే.. ఎన్నికల ఖర్చు ఆదాకు అంట! మరి ఈ బ్యూరో క్రసీ లో ఈ పాలిటిక్స్ లో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎన్నికల ఖర్చు అనేది ఏ మూలకు? అంటే ఎన్నికల ఖర్చు ఆదా అంటే.. అది ఎన్నికల నిర్వహణ ఖర్చు ఆదానా లేక రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చులు తగ్గించుకునేందుకా! లోక్ సభ ఎన్నికలు ఒక సారి, అసెంబ్లీ ఎన్నికలు ఒక సారి వస్తే.. రెండు సార్లు నేతలు ఓటుకు నోటు ఇవ్వాలి, ప్రచారానికి భారీగా ఖర్చు పెట్టాలి, మందు ముక్క కు ఖర్చు పెట్టాలి.. అదే ఒకేసారి ఎన్నికలు వచ్చేస్తే ఖర్చులో ఖర్చు తగ్గిపోతుంది!
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు రెండు సార్లు నోటు ఇవ్వాల్సిన పని ఉండదు, ఇక ప్రచార ఖర్చు అయితే మరింతగా తగ్గిపోతుంది! బహుశా నేతలకు ఒకేసారి ఖర్చు చేసి ఐదేళ్ల పాటు ఇష్టానుసారం వ్యవహరించుకోవడానికే ఈ జమిలి ఎన్నికల ఆలోచన కాబోలు!
అయితే ఈ మాత్రం ఆలోచన, ఈ మాత్రం జ్ఞానం అమెరికా వంటి దేశానికి ఎందుకు లేదో మరి. అక్కడి ప్రతి నాలుగేళ్లకూ ఒకసారి ఎన్నికలు పెట్టుకున్నారు. శతాబ్దాల నుంచి అలాగే కొనసాగిస్తూ ఉన్నారు! మన దగ్గర ప్రధానికి అవకాశం ఐదేళ్లు, ముఖ్యమంత్రికి అవకాశం ఐదేళ్లు.. అన్ని ప్రజాస్వామ్య బద్ధ పదవులకూ ఐదేళ్ల కాలాన్ని ఇచ్చింది భారతరాజ్యాంగం.
అమెరికాలో మరీ నాలుగేళ్లే అవకాశం. ఐదేళ్లతో పోలిస్తే నాలుగేళ్లు ఒక ఏడాది ముందుగానే గడిచిపోతాయి. సర్దుకోవడానికి ఏడాది పడుతుంది, చివరి ఏడాది ఎన్నికల ఏడాది. మధ్యలో మిగిలింది రెండేళ్ల సమయమే.. అయితే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా నాలుగేళ్లు మరీ తక్కువ కాలం, దాన్ని ఐదేళ్లు చేయాలనో, ఆరేళ్లు చేయాలనో వాదించలేదు! అలా తమ పదవీ కాలాన్ని పెంచుకునే ప్రయత్నాలనూ చేయలేదు!
ఎన్నికల ఖర్చు గురించి తెగ బాధపడిపోతూ ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక దేశం ఒక ఎన్నికలు అంటూ వాదిస్తూ ఉంది. అయితే ఏదైనా ఒకటి అనేది ఇండియాకు చెల్లనిది. మనది భిన్నత్వం! భిన్నత్వంలో ఏకత్వమే భారత ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తూ వచ్చింది. అయితే మరీ ముఖ్యంగా 2014 నుంచి ఒకటే ఒకటే.. అనే మాట బాగా వినిపిస్తూ ఉంది. ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే పౌరసత్వం, ఒకటే ఎన్నిక.. ఇలాంటి వాదనలు ముఖ్యమైన పదవుల్లోని వారి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కక్కటిగా సాధించుకుంటూ ఉన్నారు! మరి ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిగిపోతే ఆ తర్వాత ఐదేళ్లు ఇక ఏం చేసినా అడిగే వారు ఉండరనా!
మొన్నటి వరకూ మోడీజీకి చాలా కష్టం ఉండేది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలంటే కర్ణాటక చుట్టూ నెల రోజుల పాటు తిరగాలి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలంటే మహారాష్ట్ర కు తనే సీఎం అభ్యర్థిని అన్నట్టుగా ప్రచారం చేయాలి.. ఇలా దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా.. ప్రధానిగా కన్నా.. ఆ రాష్ట్రానికి తనే సీఎం క్యాండిడేట్ అన్నట్టుగా మోడీ ప్రచారం చేసి పెట్టే వాళ్లు! మరి ఈ ఇబ్బంది వద్దనే.. ఒక దేశంలో అన్ని రాష్ట్రాలకూ, అన్ని లోక్ సభస్థానాలకూ ఎన్నికలు జరిగేస్తే… ఆ తర్వాత మోడీ కి ఇలా ముఖ్యమంత్రి అభ్యర్థి తరహాలో ప్రచారం చేయాల్సిన అవసరం తప్పుతుంది! ఇక ఆయన ఎంచక్కా ప్రధానిగా తన పనుల్లో మునిగిపోవచ్చు.
అలాగే యూపీ అసెంబ్లీ ఎన్నికలంటే పెట్రో ధరలను పెంచకుండా కొన్నాళ్లు ఓపిక పట్టే వారు, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి పోలింగ్ ముగిసే రోజు వరకూ ధరల హెచ్చులు ఉండేవి కావు. అలాగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నప్పుడు కొన్ని ప్రజాకర్షక పథకాలు ఉండేవి. ఇక వాటి అవసరం కూడా ఉండదు. ఎలాగూ దేశమంతా ఐదేళ్లకు ఒకసారి అన్ని ఎన్నికలూ అయిపోతాయి కాబట్టి… ఇక ఆ రెన్నాళ్లూ ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తే చాలు, ఆ తర్వాత ఐదేళ్లూ ఆడింది ఆట, పాడింది పాట! కార్పొరేట్లకు వంత పాడుకోవచ్చు , సామాన్య ప్రజలతో ఇక ఐదేళ్లకు ఒక్కసారే పని! ఆ తర్వాత అంతే సంగతులు చిత్తగించవలెను!
ప్రజాస్వామ్యం అనేది కాలం గడిచే కొద్దీ, అంటే ఎన్నికల ప్రక్రియలు అనేకమార్లు జరిగే కొద్దీ పరిఢమిల్లుతుందని, పరిణతి సాధిస్తుందని గతంలో ఎంతోమంది ప్రజాస్వామ్య వాదులు చెప్పారు! ఎన్నికల నిర్వహణ అనేది ఖర్చుతో కూడుకున్న అంశంగా చూడకూడదని.. ఒక దేశ ప్రజాస్వామ్య పరిణతికి అక్కడ ఎన్ని సార్లు ఎన్నికలు జరిగాయనేది కూడా ఒక కీలకమైన అంశం అని విశ్లేషించే వారు. అయితే భారత ప్రజాస్వామ్య ఉద్దోరకులకు ఇప్పుడు ఎన్నికలే భారంగా కనిపిస్తూ ఉన్నాయి!
కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు భారం కాదు, కాంట్రాక్టర్లకు ఇచ్చే సౌలభ్యాలు భారం కాదు, బ్యాంకులకు ఎగ్గొట్టే లోన్లు భారం కాదు, గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న స్కామ్ లు భారం కాదు, ధరల పెంపుదలలు భారం కాదు, ప్రతి నలభై కిలోమీటర్ల ప్రయాణానికి కడుతున్న టోక్ ట్యాక్స్ లు భారం కాదు.. ఇవేవీ భారం కాదు ప్రజల మీద! కేవలం ఎన్నికల నిర్వహణ ఖర్చు ఒక్కటే భారం అని దాదాపు పదేళ్ల పాటు ప్రధానమంత్రి హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత మోడీ జీ కనుగొన్నారు!
కాబట్టి.. ప్రజలపై ఎన్నికల ఖర్చు ను తగ్గించే పని పెట్టుకున్నారు! మరి ఇది ఐదేళ్లకు ఒకసారే సేవ్ చేస్తారా.. లేక మోడీ జీ ఉన్నాకా ఈ దేశంలో ఎన్నికలే అవసరం లేదని.. శాశ్వతంగా ఎన్నికల ఖర్చు, భారం ఖజానా మీద పడకుండా నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారో.. వేచి చూస్తూ ఉండాలంతే!
mana daridram enti ante PM gaa vunna vaallu gallee lo roads meedha prachaaram.
ఏ దేశమైనా అంతే…biden putin ping trump తిరగలేదా
Har Har Modi Ghar Ghar Modi Jai BJP , Jai Kootami , Jai JSP
సరే ఇదంతా బాగానే ఉంది… జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయనే రీజన్ తప్ప… ఎందుకు ఒకేసారి అసెంబ్లీకి, పార్లమెంట్ కి ఎన్నికలు పెట్టకూడదో చెబుతూ ఓ ఆర్టికల్ రాయండి మీరు.
ఎందుకంటే, ఒకే రోజు రెండు ఈవీఎం మెషిన్లు పెట్టి మీకు నచ్చిన వాడికి వోట్ వేయమంటే, అందులో ఏది ఎంపీ ది, ఏది mla దో తెలుసుకునే తెలివి ఎంత మందికి ఉంది?
Adenti GA …2027 ki ready avvodda ithe ippudu….😂😂
పర్లేదు బాసు…cangee వంటి isis కన్నా bjp rss మిన్న… అది permanent ఐనా ok
90% of opposition leaders are charged with one or other corruption cases. Some are even ant nationals to mortgage the country for their electoral benefits. Then What is wrong we have non corrupt Modi government for ever
One Nation one Election does not work in a country like India which has huge population. Election security and law&order will be challenging
Election security and law&order will be a problem only if we have multiple elections at multiple times.
vacchE 2029 ki I pArty ruling ki raadu..
మీ అన్నకి చెప్పి బుల్లుకు వ్యతిరెకంగా ఉండమను
పంచుడు తో ప్రభుత్వం గెలవాలి..అనేగా దీని అర్థం..ఆతర్వాత ప్రతిపక్షం దంచుడు ఉంటుందేమో ఓటర్లకు…జాగ్రత్త!
దీనికి బేషరతుగా మద్దతు ఇచ్చిన ఇరుపార్టీలకు అర్థమవుతుందో లేదో తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారని, పాపం.
Who wrote this article. Initially we have elections in all states at same time for both assembly and parliament. Later b cause of so many reasons it is derailed. I don’t see anything wrong in conducting elections at same time. People are more intelligent than any other political leader. One party may get advantage in first elections and once people get used to this, they will elect based on who is right for them.
Because of current system, central leaders are part of one or other elections in one or other states wasting their time.
Get it done with elections and then concentrate on development and other issues for rest of the time.
This is also right, some politicians contest in both assembly as well as MP . Moreover, some voters cast their vote in different states. Yeah lot of Pros and Cons are debatable.
Excellent article Venkat garu. If any state government dissolved after couple of years due to lack of majority or any other issue , then CEC should conduct elections for that state, it may happen to any state at any time . I don’t think practically it would be possible.
Are you gone mad
9019471199
Vc