టాలీవుడ్ లెక్కలు కొన్ని ఉంటాయి. ఏపీ మొత్తం హక్కులు 50 పైసలు అయితే, సీడెడ్ 20 పైసలు, నైజాం 30 పైసలు అని సాధారణంగా లెక్క. కానీ ఈ మధ్య కాలంలో లెక్కలు మారుతున్నాయి.
ఇప్పుడు నైజాం కూడా 50 పైసల రేంజ్‌కి ఎదిగింది. రూపాయి బదులు రూపాయి ఇరవై పైసల లెక్కగా మారుతోంది. ఆదిపురుష్ కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఏపీ (సీడెడ్ మినహా) కంటే నైజాం ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు. అమ్ముతున్నారు. కలెక్షన్లు కూడా అలాగే వుంటున్నాయి.
పుష్ప 2 సినిమా విషయానికి వస్తే, ఏపీ (సీడెడ్ కాకుండా) ఏరియాను 85 కోట్లకు విక్రయించగా, నైజాం ఏరియాను 100 కోట్లకు విక్రయించారు. వంద కోట్ల రేటు అనగానే కొంతమంది ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పటికి దాదాపు 82 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే జీఎస్టీ 18% తో కలిపితే టార్గెట్ చేరినట్టే. ఈ రోజు నుంచి వచ్చే వసూళ్లన్నీ కమిషన్‌గా పరిగణించవచ్చు. వంద కోట్ల షేర్ అయితే 18 కోట్ల కమిషన్ వస్తుంది, ఎందుకంటే అప్పుడు కూడా జీఎస్టీ ఎలాగూ ఇస్తారు.
ప్రస్తుతం రోజుకు 60 లక్షల పైగానే వసూళ్లు వస్తున్నాయి. క్రిస్మస్ సెలవులు ప్రారంభం అవుతున్నాయి. నైజాంలో థియేటర్లు ఫుల్ గా వుంచారు. న్యూ ఇయర్ కూడా దగ్గరలో ఉంది. అందువల్ల టార్గెట్ కు చేరుతామనే నమ్మకంతో వున్నారు మైత్రీ పంపిణీ దారులు. సంక్రాంతికి కూడా ఎన్నో కొన్ని థియేటర్లు వుంటాయి. రాబిన్ హుడ్ ను ఎలాగూ వెనక్కు పంపారు కనుక. అందువల్ల నైజాం వంద కోట్లు చేస్తే మంచి ఫీట్ సాధించినట్లే అవుతుంది.
పుష్ప 2 చేస్తుంది 100 కోట్లు పక్క.
allu gaari pushpala jhallu.
chirru burru lade sainikulaku kullu.
allu gaari pushpala jhallu.
chirru burru lade vaariki kullu.
allu gaari pushpala jhallu.
chirrburru lade vaallaki kullu.
Robin hood cinema postpone ainde puspha2 ni adinchataniki ani feel avuthunnavu GA.. aa Nathin gadiki anta scene ledu raja..