బీజేపీ అంటే ఆయనే

బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఇలా కనిపిస్తాయి.

ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి, ఉత్తరాంధ్రాలోని పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి నెగ్గిన సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో చాలా కీలక నేతగా మారారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర బీజేపీ నేతగా ఆయన పేరే వినిపిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో సీఎం రమేష్ హవా బాగా కనిపించింది. ఆయన మోడీకి స్వాగతం పలుకుతూ సభలో ప్రసంగించడం విశేషం. బీజేపీకి చెందిన అనేక ఇతర నేతలు ఉన్నప్పటికీ సీఎం రమేష్‌కి ఆ అవకాశం ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్దలకు ఆయన ఎంతటి సన్నిహితులో ఉన్నారో చాటి చెప్పినట్లు అయిందని అంటున్నారు.

సామాజిక సమీకరణాలు కుదరక కేంద్ర మంత్రి పదవి ఆయనకు దక్కలేకపోయింది కానీ, లేకపోతే ఆయన ఆ ఉన్నత పదవిని కూడా అందుకునేవారని అంటున్నారు. అయినా సరే, ఆ లోటు ఏమీ లేకుండా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ వంటి ముఖ్యమైన పదవిని ఆయనకు కేంద్ర పెద్దలు కట్టబెట్టారు. బీజేపీకి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జమిలి ఎన్నికలకు సంబంధించి నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనూ రమేష్‌కి చోటు దక్కింది.

బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఇలా కనిపిస్తాయి. ఈ రోజు కాకపోయినా ఈ టెర్మ్‌లో ఆయన తప్పనిసరిగా కేంద్ర మంత్రి అవుతారని అంటున్నారు. విశాఖలో నరేంద్ర మోడీ వస్తే బీజేపీ ఫ్లెక్సీల్లో మోడీ, సీఎం రమేష్ ఫోటోలు ఎక్కువగా కనిపించడం ద్వారా కాషాయం పార్టీలో ఆయన పరపతి ఏ స్థాయిలో ఉందో అందరూ అనుకుంటున్నారు.

4 Replies to “బీజేపీ అంటే ఆయనే”

  1. 2024 ఎన్నికలకు 175 అసెంబ్లీ అభ్యర్థులు, 24 ఎంపీ అభ్యర్థులను ప్రకటించి.. ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచినప్పుడే అర్థమయింది..

    ఈ సీఎం రమేష్ అంటే.. అప్పటి సీఎం జగన్ కి ఎంత ఉచ్చో..

    పేరుకే సింగల్ సింహం.. చేష్టలన్నీ ముదనష్టం..

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.