మళ్లీ ఇలాంటి సందడి ఎప్పుడు?

దగ్గర్లో విడుదల వున్న క్రేజీ ప్రాజెక్ట్ లు మూడు వున్నాయి. ప్రభాస్ రాజాసాబ్, పవన్ ఓజి, హరిహర వీరమల్లు వున్నాయి. వీ

పెద్ద సినిమా వస్తే ఆ సందడే వేరు. ఆ హడావుడి వేరు. థియేటర్ దగ్గర వుండే పండగ వాతావరణం వేరు. సినిమా జనాలు అంతా ఫలితం కోసం ఆతృతగా ఎదురుచూసే వైనం వేరు. ఈ సంక్రాంతికి కాస్త తక్కువగా అయినా అలాంటి సందడి కొంత వరకు వుంది. గడచిన సంక్రాంతులతో పోల్చుకుంటే ఈసారి కాస్త తక్కువే. కానీ ఈ మాత్రం సందడి కూడా మళ్లీ ఇప్పట్లో ఎప్పుడు కనిపిస్తుంది థియేటర్ల దగ్గర అన్నది చూడాలి.

దగ్గర్లో విడుదల వున్న క్రేజీ ప్రాజెక్ట్ లు మూడు వున్నాయి. ప్రభాస్ రాజాసాబ్, పవన్ ఓజి, హరిహర వీరమల్లు వున్నాయి. వీటిలో రాజాసాబ్, ఓజి సినిమాలకు మంచి క్రేజ్ వుంది. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఆ సినిమాల టైమ్ లో హడావుడి కచ్చితంగా వుంటుంది. పైగా ఈ సినిమాల్లో రెండు 2025 ఫస్ట్ హాఫ్ లో రావడానికి చాన్స్ వుంది. మెగాస్టార్ విశ్వంభర కూడా సమ్మర్ వేళ్లకు వస్తుంది. అప్పుడు కూడా హడావుడి వుండొచ్చు.

సమ్మర్ దాటితే మళ్లీ దసరా లేదా డిసెంబర్ వరకు సరైన హడావుడి వుండే సినిమాలు లేనట్లే అనుకోవాలి. బాలయ్య అఖండ-2 కనుక వస్తే సందడి వుంటుంది. మరే పెద్ద హీరోల సినిమాలు దగ్గరలో లేవు. ఎన్టీఆర్ వార్ 2 ఎప్పుడు వస్తుందన్నది చూడాలి.

ఇకపై స్పెషల్ షో లు, స్పెషల్ రేట్లు నైజాంలో సమస్యగానే వుంటుంది. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అక్కడ ఏమైనా తీర్పు అనుకూలంగా వస్తే ఓకె. లేదూ నెగిటివ్ అయితే ఈ హడావుకి ఫుల్ స్టాప్ పర్మనెంట్ గా. పడిపోతుంది.

5 Replies to “మళ్లీ ఇలాంటి సందడి ఎప్పుడు?”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.