తిరుప‌తిలో బ‌య‌టప‌డ‌ని దారుణ భ‌ద్ర‌తా వైఫ‌ల్యం!

కీల‌క‌మైన వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టోకెన్ల జారీ స‌మ‌యంలో కూడా భ‌ద్ర‌తా చ‌ర్య‌ల గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

తిరుప‌తి అంటే ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన పుణ్య‌క్షేత్రం. ఈ క్షేత్రాన్ని అనునిత్యం కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై వుంటుంది. చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ల‌క్ష్యం వ‌హించిన దారుణ భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై పోలీస్ వ‌ర్గాల్లో విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. నిఘా వ‌ర్గాల నుంచి అందిన విశ్వస‌నీయ స‌మాచారం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి.

తిరుప‌తి న‌గ‌రానికి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్ గుండెకాయ లాంటిది. ఈ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోనే దుర్ఘ‌ట‌న జ‌రిగిన బైరాగిప‌ట్టెడ ప్రాంతం కూడా వ‌స్తుంది. ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌కు మూడు నెల‌లుగా స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. చివ‌రిగా మ‌హేశ్వ‌ర‌రెడ్డి సీఐగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత న‌గ‌రంలో అత్యంత ప్రాధాన్యం క‌లిగిన ఈ పోలీస్‌స్టేష‌న్‌కు సీఐని నియ‌మించ‌క‌పోవ‌డం… కూట‌మి స‌ర్కార్‌కు ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తి భ‌ద్ర‌త‌పై ఎలాంటి శ్ర‌ద్ధాస‌క్తులున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ పోలీస్‌స్టేష‌న్‌కు వెస్ట్ సీఐ రామ‌కృష్ణ‌ను ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. అయితే ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లంటే, స‌హ‌జంగా ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోర‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ నేప‌థ్యంలో బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన పోలీస్ అధికారికి, న‌గ‌రంలోని ముగ్గురు సీఐల మ‌ధ్య కోల్డ్ వార్ సాగుతోంది. సీఐ స్థాయికి మించిన హోదాలో ఉన్న ఆ అధికారితో ముగ్గురు సీఐల‌కు అస‌లు ప‌డ‌ద‌ని నిఘా వ‌ర్గాలు తెలిపాయి.

సీఐల‌తో సంబంధం లేకుండా ఆ అధికారే ఆర్థిక లావాదేవీలు చేసుకుంటుండాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆ అధికారితో సీఐలు, అలాగే ఎస్ఐలు, పోలీసుల‌కు ఓ రేంజ్‌లో విభేదాలున్నాయ‌నే సంగ‌తి తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడుకు తెలుస‌ని నిఘా వ‌ర్గాలు తెలిపాయి. కానీ కీల‌క‌మైన ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌కు ఓ సీఐని వేయించుకోవాల‌న్న స్పృహ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు లేక‌పోయింది. దీంతో తిరుప‌తి భ‌ద్ర‌త గాలిలో దీప‌మైంది. కీల‌క‌మైన వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టోకెన్ల జారీ స‌మ‌యంలో కూడా భ‌ద్ర‌తా చ‌ర్య‌ల గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

చివ‌రికి సామాన్య భ‌క్తులు బ‌ల‌య్యారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇంత జ‌రిగినా ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌కు రెగ్యుల‌ర్ సీఐ లేర‌ని, అలాగే పోలీసు అధికారుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విభేదాలున్న సంగ‌తిని బ‌య‌టికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం తిరుప‌తి భ‌ద్ర‌త కోసం ముందుకొస్తే బాగుంటుంద‌ని నిఘా వ‌ర్గాలు చెబుతున్నాయి.

-ప‌సుపులేటి ప‌వ‌న్ రాయ‌ల్‌

15 Replies to “తిరుప‌తిలో బ‌య‌టప‌డ‌ని దారుణ భ‌ద్ర‌తా వైఫ‌ల్యం!”

  1. అంతా లడ్డూ కల్తీ ఫలితమే!! ఈ అనర్ధాలు కి కారణమైన వాళ్ల టైం దగ్గర పడింది- పావురాల గుట్ట part 2 త్వరలో!!

    1. ఆయనా ఏమనేవాడో తెలియదు కానీ మన చైర్మన్ గారు మాత్రం తప్పంతా ప్రజలదే అని తేల్చేసారుగా, ఇలాంటి విపత్కర పరిస్థితులు అన్ని మన బాబోరుకే ఎందుకు వస్తున్నాయో, మళ్లీ ఒకసారి విజయవాడ గుడిలో అర్ధరాత్రి పూజలు జరిపిస్తే మంచిది అనుకుంట.

  2. మావోడైతే ప్రతీ ఊరిలో

    “వీధికొక వైకుంఠద్వారం సెట్టింగ్” వేయించి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకునేవాడు +

    భక్తుల సెంటిమెంట్ ని కూడా టికెట్ కి అమ్ముకుని ఓ వంద కోట్లు ఈజీ గా దోచుకునేవాడు తెలుసా??

    పేరుకి పేరు.. డబ్బుకి డబ్బు

    కదరా A1ఐటమ్??

  3. Government should take severe steps and suspend people who are responsible for. Use latest technologies and try to issue the tickets in the respective mee seva or some other local places linking up with Aadhar and every mandal should have limit in terms of passes

  4. Tirupathi lo poleecula collection mamuluga vundadanta kada, Bangalore Majestic area tarahalo. Vellaki jeethalu lenchi, c0llections nivariste baguntundi.

  5. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  6. CBN sir should retire as a state Governor and leave the CM post to Pawan sir and elevate Lokesh sir as DCM. CBN sir is unable to focus on administration as actively as he could because of his age and that is leading to a lot of lapses in administration. That is why we are seeing floods and stampedes in ticket lines due to bad administration.

  7. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా దొరకని Exclusive Visualsని వైసీపీ సోషల్ మీడియాలో ఘటన జరిగిన వెంటనే అందరూ ఒకేసారి ఎలా వేశారు. అంత వేగంగా వీడియోలు ఎలా దొరికాయి. తొక్కిసలాటలో జరిగిన ప్రమాదాన్ని యాక్సిడెంట్‌లా చూడకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వాడుకుంటూ వెంటనే ఇలా వీడియోస్ వేసి పిచ్చి రాతలు రాస్తున్నారు అంటే ఇంత బరితెగింపు దేనికి సంకేతం.. శవం కనపడితే గుద్దలు వాలిపోయినట్లు వాలిపోవడమే వైసీపీ మార్క్ రాజకీయమా? ఈ ఘటనలో కుట్రకోణం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

  8. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా దొరకని Exclusive Visualsని వై సీ పీ సోషల్ మీడియాలో ఘటన జరిగిన వెంటనే అందరూ ఒకేసారి ఎలా వేశారు. అంత వేగంగా వీడియోలు ఎలా దొరికాయి. తొక్కిసలాటలో జరిగిన ప్రమాదాన్ని యాక్సిడెంట్‌లా చూడకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వాడుకుంటూ వెంటనే ఇలా వీడియోస్ వేసి పి చ్చి రాతలు రాస్తున్నారు అంటే ఇంత బరితెగింపు దేనికి సంకేతం.. శ వం కనపడితే గుద్దలు వాలిపోయినట్లు వాలిపోవడమే వై సీ పీ మార్క్ రాజకీయమా? ఈ ఘటనలో కుట్రకోణం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

Comments are closed.