యంగ్ హీరోకి బాడీ డబుల్!

ఓ యంగ్ హీరో మాత్రం ఫైట్లు, రోప్ షాట్స్ అంటే బాడీ డబుల్ అంటున్నారట.

ఇటీవల టాలీవుడ్‌లో బాడీ డబుల్స్ అనే కల్చర్ వచ్చింది. బాలీవుడ్‌లో ఏనాడో వుంది. టాలీవుడ్‌లోకి ఇప్పుడు వచ్చింది. పెద్ద హీరోలు మరీ ఎక్కువ డేట్‌లు ఇవ్వకుండా, క్లోజ్‌లు మాత్రం తాము వర్క్ చేస్తూ, మిగిలిన షూట్ బాడీ డబుల్స్‌తో కానిచ్చేస్తున్నారు. హీరోలకు క్రేజ్ వుండడం, కోట్ల వ్యాపారం వుండడంతో నిర్మాతలు, దర్శకులు కూడా సరే అంటున్నారు.

అయితే యంగ్ హీరోలు మాత్రం ఎంత డిమాండ్ వున్నా ఈ బాడీ డబుల్స్ వరకు రాలేదు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఫైట్లు, రోప్ షాట్స్ అంటే బాడీ డబుల్ అంటున్నారట. అతగాడో యంగ్ హీరో. ఇతగాడితో సినిమాలు చేసిన నిర్మాతల్లో నూటికి తొంభై శాతం మంది కోట్లకు కోట్లు నష్టపోయిన వారే.

కాస్త గ్యాప్ అనిపించినా, నిర్మాతలకు సినిమాలు కావాలి కనుక, వరుసగా చేతిలోకి సినిమాలు వచ్చాయి. అంత వరకు బాగానే వుంది. కానీ ఇతగాడు కూడా ఇప్పటి నుంచీ బాడీ డబుల్‌ను వాడడం ఏమిటి అని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.

ఈ బాడీ డబుల్‌కు తోడు ఇప్పటికే ఎప్పుడో ఒప్పుకున్న సినిమా యాభైశాతం కూడా పూర్తి కాలేదని, ఒకేసారి నాలుగు సినిమాలు ఓకె చేసి, మెలమెల్లగా పూర్తి చేస్తున్నారని, నిర్మాతలు అంత అసంతృప్తితో వున్నారని టాక్ వినిపిస్తోంది.

22 Replies to “యంగ్ హీరోకి బాడీ డబుల్!”

    1. డైరెక్టర్ బోయపాటి ఐతే బావుంటుంది, లాస్ట్ టైం 29 మందిని గాలిలో కలిపేసాడు. ఈసారి కనీసం 50 కి తగ్గకుండా టార్గెట్ చేయొచ్చు

  1. ఎవరికైనా సినిమా లో సింహం తో షూటింగ్ ఉంటే సంప్రదించండి ..

    ” సింగల్ సింహం “

    HNo: 11

    ప్యాలెస్

    తాడేపల్లి

    గుంటూరు

  2. అంటే వాడే అసలు హీరో, సదరు నటుడు డూప్ అన్నమాట.. ఏదో తెలుగు సినిమాలో సినిమా వాళ్ల మీద వ్యంగ్యంగా ఇలాంటి డైలాగు ఉంటుంది.

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.