డేట్ మార్పుపై ‘అల్లుడు’ పంచాయతీ

సంక్రాంతి సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే రవితేజ ట్రాక్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.  Advertisement విజయ్ మాస్టర్ సినిమా 13 విడుదల కు రెడీ అవుతోంది. 14న రామ్ సినిమా రెడ్…

సంక్రాంతి సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే రవితేజ ట్రాక్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. 

విజయ్ మాస్టర్ సినిమా 13 విడుదల కు రెడీ అవుతోంది. 14న రామ్ సినిమా రెడ్ విడుదలకు రెడీగా వుంది. 15న అల్లుడు అదుర్స్ సినిమా ప్లాన్ చేసారు. 

కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాను ఓ రోజు ముందుకు జరుపుతున్నారు. ఈ నెల 14నే విడుదలకు రెడీచేస్తున్నారు.

ఈ మేరకు ఈరోజు జరిగే అడియో ఫంక్షన్ లో అనౌన్స్ చేయాలని చూస్తున్నారు అయితే ఇలా సడెన్ గా డేట్ మార్చడంపై మిగిలిన సినిమాల జనాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సడెన్ గా సంక్రాంతి బరిలోకి వచ్చారని, ఇప్పుడు సడెన్ గా డేట్ మారుస్తున్నారని అభ్యంతరాలు గిల్డ్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గిల్డ్ దగ్గర డిస్ట్రిబ్యూటర్లతో పంచాయతీ నడుస్తోందని తెలుస్తోంది.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ