సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రానా

లాక్ డౌన్ ముగుస్తోంది, ఇక థియేటర్లు తెరుస్తారనే సమాచారం అందుకున్న వెంటనే సినిమాలన్నీ క్యూ కట్టాయి. ప్రతి సినిమాను సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించేశారు. అలా దాదాపు 10 సినిమాల వరకు సంక్రాంతి రిలీజ్…

లాక్ డౌన్ ముగుస్తోంది, ఇక థియేటర్లు తెరుస్తారనే సమాచారం అందుకున్న వెంటనే సినిమాలన్నీ క్యూ కట్టాయి. ప్రతి సినిమాను సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించేశారు. అలా దాదాపు 10 సినిమాల వరకు సంక్రాంతి రిలీజ్ అంటూ తమకుతాము ప్రకటించుకున్నాయి.

రోజులు గడిచేకొద్దీ ఒక్కో సినిమా తప్పుకోవడం మొదలైంది. రంగ్ దే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఉప్పెన.. సినిమాలు సంక్రాంతికి రావట్లేదు. ఇప్పుడీ జాబితాలోకి రానా నటించిన అరణ్య సినిమా కూడా చేరింది.

తమ సినిమా సంక్రాంతి కానుకగా పాన్-ఇండియా మూవీగా వస్తుందంటూ.. గత అక్టోబర్ లోనే ప్రకటించాడు రానా. కానీ ఇప్పుడీ సినిమా సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అయింది. మార్చి 26న అన్ని భాషల్లో అరణ్య ఒకేసారి రిలీజ్ అవుతుందంటూ స్వయంగా రానా ప్రకటించాడు.

సంక్రాంతికి తమిళనాట విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా ఉంది. ఇక తెలుగులో క్రాక్, రెడ్ సినిమాలు ఉండనే ఉన్నాయి. దీనికితోడు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడిచేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అరణ్య సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ-మలయాళ-హిందీ భాషల్లో రిలీజ్ చేయడం మంచి నిర్ణయం కాదని భావించింది ఈరోస్ నిర్మాణ సంస్థ.

పైగా రానాతో ఇండియావైడ్ ప్రమోషన్స్ ప్లాన్ చేసింది ఈ సంస్థ. దానికి ఇప్పుడు సమయం లేదు. అందుకే లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా మార్చి 26ను లాక్ చేసింది. 27, 28 తేదీలు శని-ఆదివారాలు పడ్డాయి. 29న హోలీ పడింది. ఈ 4 రోజుల లాంగ్ వీకెండ్, దేశవ్యాప్తంగా తమ సినిమాకు కలిసొస్తుందని భావిస్తోంది.

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి

నీకు ఉన్నదల్లా కుల పిచ్చే !!!