ఈ అల‌వాట్లుంటే.. మీరు చాలా బెట‌ర్ ప‌ర్స‌న్!

మిగ‌తా వాళ్ల‌తో ఎప్పుడూ పోల్చుకోకూడ‌దు కానీ, మ‌న లైఫ్ స్టైల్ చాలా మెరుగ్గా ఉంది అనే విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి కొన్ని అంశాల‌ను పోల్చుకోవ‌చ్చు. ప్ర‌త్యేకించి అల‌వాట్ల విష‌యంలో! మీకు ఉన్న కొన్ని అల‌వాట్లు మీకు…

మిగ‌తా వాళ్ల‌తో ఎప్పుడూ పోల్చుకోకూడ‌దు కానీ, మ‌న లైఫ్ స్టైల్ చాలా మెరుగ్గా ఉంది అనే విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి కొన్ని అంశాల‌ను పోల్చుకోవ‌చ్చు. ప్ర‌త్యేకించి అల‌వాట్ల విష‌యంలో! మీకు ఉన్న కొన్ని అల‌వాట్లు మీకు తెలియ‌కుండానే మిమ్మ‌ల్ని ఒక బెట‌ర్ పొజిష‌న్లో నిలుపుతుంటాయని అంటున్నారు ఎక్స్ ప‌ర్ట్స్. మీ ఆరోగ్యం, మాన‌సిక స్థితి, ప్రొఫెష‌న‌ల్ గా మీ స్థానం.. ఇవ‌న్నీ కూడా.. మీకు ఉన్న కొన్ని అల‌వాట్ల వ‌ల్ల ద‌క్కుతున్న‌వే అని వారు చెబుతుంటారు. కొన్ని ర‌కాల అల‌వాట్లు మీకు తెలియ‌కుండానే మిమ్మ‌ల్ని మ‌రింత బెట‌ర్ గా చేస్తుంటాయ‌నే వారు చెప్పే మాట‌! మ‌రి ఆ అల‌వాట్లు ఏవంటే..!

ఉద‌యాన్నే లేచే అల‌వాటు!

ఆశ్చ‌ర్యం క‌లిగినా ఇది నిజం, ఉద‌యం ఆరు గంట‌ల్లోపు లేచే అల‌వాటు ఉందంటే.. ప్ర‌స్తుత సొసైటీలో కూడా మీరు చాలా బెట‌ర్ ప‌ర్స‌న్ అయిన‌ట్టే! ఆరు గంట‌ల‌కే లేచి .. వ్యాయ‌మం చేయ‌డ‌మో లేక ఉద‌యాన్నే లేచి ద‌గ్గ‌ర్లోని పార్క్ కు వెళ్లి వాకింగ్ చేయ‌డం, అదీ కాదంటే.. ఇంటి ప‌రిస‌రాల‌ను గ‌మ‌నిస్తూ ఒక రౌండ్ కొట్ట‌డం.. ఈ అల‌వాటు ఉందంటే మీరు చాలా ఎన‌ర్జిటిక్ ప‌ర్స‌న్ అయిన‌ట్టే! మార్నింగ్ స‌న్ లైట్ కు ఎన‌ర్జీని పెంచే శ‌క్తి ఉంటుంద‌ట‌! ఉద‌యం లేచి వాకింగ్ కు వెళ్ల‌డం అనేది చాలా మంచి ఐడియా. వాకింగ్ మీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అయిన ఎండోర్ఫిన్స్ ను విడుద‌ల చేస్తుంది. ఇలా ఈ అల‌వాటు చాలా గొప్ప‌ది. ఉద‌యాన్నే లేవ‌డం వ‌ల్ల రోజులో అధిక స‌మ‌యం మీ చేతిలో ఉన్న‌ట్టే. అలాగే ఉద‌యం లేచి వ్యాయ‌మ‌మో, వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శారీర‌కంగా మేలు క‌లుగుతుంది. ఎంతో ఎన‌ర్జీ కూడా మీ సొంతం అవుతుంది!

చెప్పుకోద‌గిన హాబీలు!

తిన్నామా, ప‌డుకున్నామా, తెల్లారిందా.. అనే త‌త్వం ప‌ర‌మ బ్యాడ్ అనేది ప‌రిశోధ‌కుల మాట‌. ఆఫీసుకు వెళ్లామా, ఇంటికి వ‌చ్చామా, తిన్నామా, ప‌డుకున్నామా.. అని గ‌డిపేయ‌డానికి భిన్నంగా ఏం చేసినా మీరు నిజంగా చాలా మంది క‌న్నా బెట‌ర్ ప‌ర్స‌న్ అయిన‌ట్టే! ఏ వీకెండ్ లోనో ట్రెక్కింగ్ వెళ్తుంటారా, లేక సైకిల్ లో ఒక లాంగ్ రైడ్, లేదా కారులో అయినా ఒక లాంగ్ డ్రైవ్.. ఇలాంటి ప‌నుల‌ను పెట్టుకునే త‌త్వం ఉన్నా, లేదంటే ఖాళీ స‌మ‌యాల్లో మీకంటూ ఏదైనా ఒక హాబీ ఉన్నా.. క‌చ్చితంగా మీరు బెట‌ర్ ప‌ర్స‌న్ అయిన‌ట్టే! చ‌ద‌వ‌డం, రాయ‌డం, ఇంకోరికి ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేయ‌డం వంటివి బెస్ట్ హాబీస్!

మీ ప‌ట్ల మీ కేరింగ్!

మ‌రీ నార్సిస్టిక్ గా ఉండ‌న‌క్క‌ర్లేదు కానీ, మీ ప‌ట్ల మీరు కేర్ తీసుకోవాల్సిందే! అది అందం విష‌యంలో, బాడీ మెయింటెయినెన్స్ విష‌యంలో, మంచి డ్ర‌స్సింగ్ విష‌యంలో.. మీ ప‌ట్ల మీకు కేరింగ్ ఉండాలి! ఇవంత నెగ్లెక్ట్ చేయాల్సిన అంశాలు ఏమీ కాదు. ఇలాంటి విష‌యంలో ప‌ట్టింపు లేద‌ని, ఏదో అలా అన్న‌ట్టుగా.. కేర్ లెస్ గా ఉండ‌టం కూడ‌ద‌ని ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు. విప‌రీతంగా మేక‌ప్పులు వేసేయ‌మ‌ని కాదు, మినిమం కేర్ పాటించాల‌ని, ఎల్ల‌ప్పుడూ నీట్ డ్ర‌స్సింగ్ లో ఉండాల‌ని వారు సూచిస్తుంటారు!

ప్ర‌యారిటీస్ ను లిస్ట్ చేసుకోవ‌డం!

చేయాల్సిన ప‌నుల జాబితాను అంటూ ఒక‌టి పెట్టుకుంటే ఏదీ మిస్ కాకుండా ఉంటుంది! ఆఫీసు ప‌నులు, వ్య‌క్తిగ‌త‌మైన ప‌నులు ఇలా చాలా బిజీగా రోజుల‌ను గ‌డిపేస్తూ ఉంటారంతా! మ‌రి వీటి విష‌యంలో ఒక లిస్ట్ ను పెట్టుకుని, అది కూడా ప్ర‌యారిటీ ప్ర‌కారం చేసుకుంటూ వెళ్తే.. లైఫ్ స్టైలే మారిపోతుంది! ఆల్రెడీ ఈ అల‌వాటు ఉంటే మీరు బెట‌ర్ ప‌ర్స‌న్ అయిన‌ట్టే!

మీ ఆరోగ్యంపై అవ‌గాహ‌న‌ను క‌లిగి ఉండ‌టం!

మీకు ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ కాదు.. అది ఫుడ్ అయినా, మ‌రోటైనా.. ఆరోగ్య‌ప‌రంగా మీ ప‌రిస్థితి ఏమిటో మీకు అవ‌గాహ‌న క‌లిగి ఉండి, దాన్ని కాపాడుకునేలా మీ లైఫ్ స్టైల్ ను మీరు డిజైన్ చేసుకుంటున్నారంటే.. ఏకంగా ప్ర‌పంచంలోని 97 శాతం మంది క‌న్నా మీరు బెట‌ర్ అయిన‌ట్టే అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. మీ ఆరోగ్యానికి కాపాడుకునే అవగాహ‌న‌, అలాంటి లైఫ్ స్టైల్ ను అనుస‌రించ‌డానికి మించిన బెట‌ర్ లైఫ్ ఏముంటుంది!