ఆపరేషన్ అయ్యన్న…అక్రమ మైనింగ్ లో తనయుడు…?

విశాఖలో రాజకీయం శరవేగంగా మారుతోంది. తమ్ముళ్లకు తంటాగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా తమ్ముళ్ళకు ఇరకాటంగా ఉంటోంది.  విశాఖ జిల్లాలో జరుగుతున్న అక్రమాల మీద సర్కార్ గట్టిగానే దృష్టి పెడుతోంది. Advertisement…

విశాఖలో రాజకీయం శరవేగంగా మారుతోంది. తమ్ముళ్లకు తంటాగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా తమ్ముళ్ళకు ఇరకాటంగా ఉంటోంది.  విశాఖ జిల్లాలో జరుగుతున్న అక్రమాల మీద సర్కార్ గట్టిగానే దృష్టి పెడుతోంది.

దాంతో గత పాపాలకు  పసుపు నేతలు  ఇపుడు జవాబు చెప్పుకోవాల్సివస్తోంది.  మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు తాజాగా  ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన చింతకాయల విజయ్ పాత్రుడు ఇద్దరు గిరిజనులను బినామీలుగా చేసుకుని అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని జిల్లా మైనింగ్ శాఖ అధికారులు గుర్తించారు.

ఇక బినామీలుగా ఉన్న  తూర్పు గోదావరికి చెందిన ఇద్దరు గిరిజనులు కిల్లి లోవరాజు, సింగం భవానీలను 2016లో విశాఖ జిల్లాలో అప్పటి మైనింగ్ శాఖ అధికారులు లాటరైన్ ఖనిజం తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే అలా అనుమతులు ఇవ్వడం కూడా అక్రమమని మైనింగ్ అధికారులు గాజాగా తేల్చారు.

ఇక ఈ గిరిజనులు ఇద్దరూ కూడా మైనింగ్  విషయంలో ఏ మాత్రం సంబంధం లేని వారే. అయ్యన్న కుమారుడు విజయ్ కి వీరు బినామీలు అని కూడా అధికారులు అంటున్నారు. మొత్తానికి ఈ బినామీలకు నిబంధలను అతిక్రమించారని, అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని 17 కోట్ల రూపాయ‌లు భారీ జరీమానా విధించారు. 

విశాఖకు చెందిన మైనింగ్ అధికారి ప్రతాప రెడ్డి ఆద్వర్యంలో ఈ మైనింగ్ లోగుట్టుని బయటకు తీశారు. మొత్తానికి ఇన్నాళ్ళూ మీడియాలో జగన్ని ఏది పడితే అది విమర్శలు చేస్తూ వస్తున్న అయ్యన్నకు ఈ విధంగా సన్ స్ట్రోక్ తగిలింది అంటున్నారు.

అద్యక్షులవారి తత్త్వం బోధపడిందా