సితార ఎంటర్ టైన్ మెంట్స్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మీద చకచకా అడుగులు వేస్తోంది. సినిమాలో కథ అలాగే వుంచి, కొన్ని కీలక అడిషన్స్ మాత్రం చేస్తున్నారు.
ఇద్దరు హీరోల విషయంలో ఎక్కడా ఏ తగ్గించడాలు, హెచ్చించడాలు చేయడం లేదు. రెండు క్యారెక్టర్లు మలయాళంలో ఎలా వున్నాయో అలాగే సరిసమానంగా వుంటాయి.
అయితే తెలుగు నేటివిటీకి, ఇక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు కథకు ఒకటి అదనపు సంఘనటలు జోడిస్తున్నారు. వీటివల్ల కథలో పాత్రలకు మరింత ఇంటెన్సిటీ పెరిగి, నిండుదనం వస్తుందన భావిస్తున్నారు. కథలో కనిపించే ప్రతి పాత్ర కాస్త ప్రాముఖ్యతతో వుండేలా చూస్తున్నారు.
ముఖ్యంగా 'కోషియమ్' ఫ్యామిలీ లో తండ్రి, తల్లి, భార్య పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే అయ్యప్పన్ చుట్టూ వుండే డ్రైవర్, సిఐ ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యత వుండేలా చూస్తున్నారు. దీనివల్ల ఈ పాత్రలు అన్నింటికీ చాలా కీలకమైన నటులను తీసుకుంటున్నారు.
ప్రస్తుతం రానా కు ఫైనల్ నెరేషన్ ఇవ్వాల్సి వుంది. అది ఇవ్వగానే రానా పేరును అఫీషియల్ గా ప్రకటిస్తారు. సినిమాలో అయ్యప్పన్ పాత్ర కోసం కోషియమ్ పాత్రను విలన్ గా మారుస్తున్నారన్న గ్యాసిప్ లను యూనిట్ కొట్టి పారేసింది.
సినిమాలో ఒక్క సీన్ కూడా మార్చడం లేదని, ఇంకా బెటర్ చేస్తున్నామని యూనిట్ పేర్కొంది.