వైరల్‌: సమంత చేతులకు గాయాలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత సిటాడెల్ చిత్రీకరణలో గాయపడినట్లుగా తెలుస్తోంది. స‌మంత త‌న చేతుల‌కు స్వల్ప గాయాలు, ర‌క్త‌పు మ‌ర‌కల‌తో క‌నిపిస్తున్నా ఫోటోలు త‌న ఇన్ స్టాలో షేర్ చేసింది. స‌మంత మ‌యోసైటిస్ స‌మ‌స్య నుంచి…

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత సిటాడెల్ చిత్రీకరణలో గాయపడినట్లుగా తెలుస్తోంది. స‌మంత త‌న చేతుల‌కు స్వల్ప గాయాలు, ర‌క్త‌పు మ‌ర‌కల‌తో క‌నిపిస్తున్నా ఫోటోలు త‌న ఇన్ స్టాలో షేర్ చేసింది. స‌మంత మ‌యోసైటిస్ స‌మ‌స్య నుంచి కోలుకొని కొద్ది రోజులుగా ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ మేక‌ర్స్ రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్నా సిటాడెల్ సిరిస్ లో పాల్గొంటోంది.

బాలీవుడ్ స్టార్ హీరో వ‌రుణ్ ధావ‌న్ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నా సిటాడెల్ సిరిస్ లో సామ్ పాత్ర పూర్తిగా యాక్ష‌న్ ఉంటుంద‌ని అందుకే యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర సామ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంది. యాక్షన్ షూట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో సామ్ ప్రాక్టిస్ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానులతో​ పంచుకుంటునే ఉన్నారు.

తాజాగా స‌మంత షేర్ చేసిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. మయోసైటిస్‌ కారణంగా ‘యశోద’  చిత్రం తర్వాత విరామం తీసుకున్న సమంత.. తిరిగి తన ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడింది. ‘శాకుంతలం’  ప్రమోషన్స్‌ చేస్తూనే రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్‌’వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. త్వరలోనే ‘ఖుషి’ చిత్రీకరణలోనూ సామ్‌ జాయిన్‌ కాబోతోంది.