నిరాశ‌ప‌రిచిన సింగ‌ర్ సునీత ప్ర‌క‌ట‌న‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని సింగ‌ర్ సునీత నిరాశ‌ప‌రిచారు. సింగ‌ర్ సునీత గాయ‌నిగా విశేష సంఖ్య‌లో అభిమానుల్ని సంపాదించు కున్నారు. మ‌ధుర‌మైన కంఠంతో పాటు ఆమె అందం అద‌నం. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా గ్లామ‌ర్ రంగంలో రాణించారామె.…

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని సింగ‌ర్ సునీత నిరాశ‌ప‌రిచారు. సింగ‌ర్ సునీత గాయ‌నిగా విశేష సంఖ్య‌లో అభిమానుల్ని సంపాదించు కున్నారు. మ‌ధుర‌మైన కంఠంతో పాటు ఆమె అందం అద‌నం. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా గ్లామ‌ర్ రంగంలో రాణించారామె. సెల‌బ్రిటీ కావ‌డంతో సునీత‌పై ఎప్పుడూ ఏదో ఒక అంశంపై సోష‌ల్ మీడియాలో నిత్యం ఏదో ఒక‌టి ప్ర‌చారంలో ఉండ‌డం చూస్తున్నాం. ఇటీవ‌ల సునీత స‌మీప బంధువని, సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని  న‌మ్మించి అనంత‌పురానికి చెందిన ఓ యువ‌కుడు భారీగా డ‌బ్బు వ‌సూలు చేశాడు.

ఈ విష‌యం తెలుసుకున్న సునీత సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేసి అత‌ని ఆట క‌ట్టించారు. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో స్టార్ మా చాన‌ల్‌లో మోస్ట్ పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్‌-4 కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. ఈ సీజ‌న్‌లో సింగ‌ర్ సునీత పాల్గొన‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప్ర‌చారంపై తాజాగా సునీత స్పందించారు. ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం లేద‌ని ప్ర‌క‌టించి ఇంత కాలం సాగిన ప్ర‌చారానికి ఆమె తెరదించారు. ఫేస్‌బుక్ ద్వారా సునీత స్పందిస్తూ తాను బిగ్‌బాస్-4లో లేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు మాత్ర‌మే కాదు, భవిష్యత్తులో కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనేది లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

డియర్‌ ఫ్రెండ్స్‌.. నేను `బిగ్‌బాస్-4`లో లేను. భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్` అని ప్ర‌క‌టించ‌డంతో బుల్లితెర ప్రేక్ష‌కులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. సింగ‌ర్ సునీత ఉన్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతున్న నేప‌థ్యంలో…ఈ ద‌ఫా రియాల్టీ షో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని  ఆశించిన వారికి నిరాశే మిగిలిన‌ట్టైంది. 

ప్రస్తుతం ఒక ట్రాప్ లో ఉన్నాను

యధా మోడీ..తథా పవన్