ఒక ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి పదిమంది చనిపోయారు. నిండు ప్రాణాలు అలా గాల్లో కలిసి పోయాయి. ఈ సంఘటనపై విచారణ జరపడం ప్రభుత్వ కనీస బాధ్యత. చనిపోయిన వారికి పరిహారాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. అసలు ఈ సంఘటన లో ఏం జరిగింది? అనే అంశం గురించి విచారణకు ఆదేశించింది. మామూలుగా అయితే.. ఇలాంటి ఘటనల్లో యాజమాన్యాలు బుక్ అవుతుంటాయి.
అందుకు ఉదాహరణ.. ఏదైనా ఒక ట్రావెల్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు, సదరు ట్రావెల్స్ సంస్థల యజామానులపై కేసులు నమోదు చేస్తారు. ఆ బస్సులకు పర్మిట్లున్నాయా? ప‌్రమాణాలు పాటించారా? అనే అంశాలన్నింటి మీదా అప్పుడు విచారణ జరుగుతుంది. ఆ ప్రమాద తీవ్రతను, ప్రమాణాలను పాటించకపోవడం గురించి.. యజమానులను అరెస్టు చేయడం వంటి పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి.
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో హై కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలని ప్రభుత్వం కోరుతోంది. రమేష్ ఆసుపత్రి యజమాని ఇంకా పరారీలోనే ఉన్నాడని, ఈ కేసు విచారణలో ఆయనను విచారించడం కీలకం అని ప్రభుత్వం సుప్రీం కు విన్నవిస్తోంది!
తాము తప్పేం చేయలేదనేది రమేష్ ఆసుపత్రి వాదన అని స్పష్టం అవుతోంది. తప్పు చేయనప్పుడు పరారీలో ఎందుకున్నట్టు? విచారణకు సహకరించవచ్చు కదా? అనేది సామాన్యుడి ప్రశ్న. మరి ఈ అంశంపై సుప్రీం కోర్టులో ఏం జరుగుతుందో!