అచ్చెన్నకు సొంత వియ్యకుడే షాక్?

అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. సరే నిర్ణయాలు అన్నీ కూడా చంద్రబాబే ప్రకటిస్తారు. వాటి మీద మరో మారు పార్టీ జనాలకు చెప్పడమే అచ్చెన్న బాధ్యత. చంద్రబాబు తాపీగా ఒక డెసిషన్ తీసేసుకున్నారు. Advertisement…

అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. సరే నిర్ణయాలు అన్నీ కూడా చంద్రబాబే ప్రకటిస్తారు. వాటి మీద మరో మారు పార్టీ జనాలకు చెప్పడమే అచ్చెన్న బాధ్యత. చంద్రబాబు తాపీగా ఒక డెసిషన్ తీసేసుకున్నారు.

పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయరాదు అన్నది ఆ నిర్ణయం. దానిమీద పెద్ద ఎత్తున సొంత పార్టీలో నిరసన వ్యక్తం అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన అచ్చెన్నాయుడు అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని పాటించి తీరాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు. అధినేత డెసిషనే ఫైనల్. ఈ విషయంలో ఎలాంటి పునరాలోచనలు ఉండవని తేల్చేశారు.

పార్టీలో ఒకరిద్దరు వ్యతిరేకించినా దాన్ని తాము అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అచ్చెన్న కుండబద్ధలు కొట్టారు. అందువల్ల ఈ బహిష్కరణ నిర్ణయాన్ని పార్టీ నేతలు అంతా అమలు చేయాల్సిందే అంటూ అచ్చెన్న అల్టిమేటం జారీ చేశారు.

సరే ఒక‌రిద్దరు వ్యతిరేకించినా పట్టించుకోవాల్సింది లేదు కానీ అచ్చెన్న కుటుంబ సభ్యుడు, అది కూడా ఆయన సొంత వియ్యంకుడు అయిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా వ్యతిరేకిస్తున్నారే. 

ఆయన ఏకంగా తన సొంత నియోజకవర్గంలో టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం కూడా మొదలెట్టేశారు. ఇలా సొంత వియ్యకుడే అచ్చెన్నకు షాక్ ఇచ్చెస్తే బాబు మాటే ఫైనల్ అని అచ్చెన్న ఎలా చెబుతారు అంటున్నారు తమ్ముళ్ళు మరి.