హైదరాబాద్ కే ఓ ఐకానిక్ థియేటర్ గా మారింది ఏ ఎమ్ బి మల్టీ ఫ్లెక్స్. ఆ తరువాత మరో ఐకానిక్ థియేటర్ గా మారబోతోంది ఓల్డ్ సత్యం థియేటర్. ఎఎఎ మల్టీ ఫ్లెక్స్ గా రెడీ అవుతోంది.
ఈ రెండూ ఇలా వుండగానే మరో క్రేజీ మల్టీ ఫ్లెక్స్ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టులో ఒకరు కాదు..ఇద్దరు కాదు..ముగ్గురు హీరోలు పాలు పంచుకోవడం విశేషం.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్సన్ థియేటర్ స్థలంలో ఓ భారీ మాల్ రూపు దిద్దుకోబోతోంది. అందులోనే ఈ కొత్త మల్టీ ఫ్లెక్స్ వస్తుంది. దీని పేరు ఎ ఎమ్ బి విక్టరీ.
ఎ ఎమ్ బి అంటే ఆసియన్ మహేష్ బాబు. దానికి విక్టరీ అన్నయాడింగ్ ఎందుకంటే విక్టర్ వెంకటేష్ కూడా భాగస్వామి కనుక. ఆయన మాత్రమే కాదు. ఆయన అన్న సురేష్ బాబు కుమారుడు రానా కూడా భాగస్వామే.
అంటే ముగ్గురు హీరోలతో కలిసి ఆసియన్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ చేయబోయే వెంచర్ అది. ఇటు మాల్ గా, అటు మల్టీ ఫ్లెక్స్ గా ఇది తయారు అవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో మరో ప్రముఖుడు కూడా పాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది