ఆగస్టు నుంచి సీటీమార్ షూట్

దర్శకుడు సంపత్ నంది సారథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మిస్తున్న సినిమా సీటీమార్.  ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో…

దర్శకుడు సంపత్ నంది సారథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మిస్తున్న సినిమా సీటీమార్.  ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌ మిగిలిన భాగాన్ని ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో  కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.   జూన్ 12 ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా `సీటీమార్` టీమ్ శుభాకాంక్ష‌లు తెలిపి న్యూ స్టిల్ విడుద‌ల చేసింది.  

ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న నటిస్తున్నారు.  మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యంలో ఒక పాట మిన‌హా ఇప్ప‌టికే నాలుగు  పాట‌లు రికార్డ్ చేయ‌డం జ‌రిగింది. మాస్ ప్రేక్ష‌కుల కోసం ఒక మాస్ ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేస్తున్నారు మ‌ణిశ‌ర్మ‌ అని నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు తెలిపారు.