కొత్త రుచులు అక్కర్లేదు.. కరోనా రాకుంటే చాలు

అన్ లాక్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీలో సినిమా థియేటర్లు తప్ప అన్నిటికీ ప్రభుత్వాలు అనుమతిచ్చేశాయి. అయితే హోటళ్లు, రెస్టారెంట్ల విషయానికొస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసున్నాయి. పదేళ్ల లోపు పిల్లలు,…

అన్ లాక్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీలో సినిమా థియేటర్లు తప్ప అన్నిటికీ ప్రభుత్వాలు అనుమతిచ్చేశాయి. అయితే హోటళ్లు, రెస్టారెంట్ల విషయానికొస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసున్నాయి. పదేళ్ల లోపు పిల్లలు, 60ఏళ్ల పైబడినవారు, గర్భిణిలకి హోటళ్లు, రెస్టారెంట్లలోకి అనుమతి లేదని తేల్చి చెప్పాయి. సహజంగానే ప్రజల్లో ఉన్న భయం, దీనికితోడు ప్రభుత్వాల నిబంధనలతో హోటళ్లు, రెస్టారెంట్లలో రద్దీ కనిపించడంలేదు.

ఈ ఉపద్రవాన్ని ముందుగానే ఊహించిన కొంతమంది యజమానులు అసలు హోటళ్లనే తిరిగి ప్రారంభించలేదు. వంట మాస్టర్లు, స్టాఫ్.. చాలావరకు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో వారి కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో చాలావరకు హోటళ్లు మూతపడే కనిపిస్తున్నాయి. మరోవైపు తెరచిన హోటళ్లకు కూడా ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది.

పిల్లలు లేకుండా తల్లిదండ్రులు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లలేరు, అటు పెద్దవారికి కూడా అనుమతి లేకపోవడంతో కస్టమర్ల సంఖ్య పూర్తిగా తగ్గింది. దీంతో తెరచిన రెండు మూడు రోజులకే కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కస్టమర్లు తగ్గినా రెంటు, కరెంటు, స్టాఫ్ జీతాలు.. ఇలాంటివన్నీ ఇక్కడ కామన్. ఖర్చు తగ్గదు, దానికి తగ్గ ఆదాయం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాలు ప్రారంభించడం కంటే.. మూసి ఉండటమే మంచిదని యాజమాన్యాలు భావించాయి. దీంతో చిన్నచిన్న పట్టణాలతో పాటు, నగరాల్లో కూడా హోటళ్ల వ్యాపారం దారుణంగా దెబ్బతింది.

మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ 2 నెలల కాలంలో.. ప్రజలంతా ఇంటి భోజనానికి అలవాటు పడ్డారు. కరోనా భయంతో పాటు, ఇటు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని చాలామంది హోటళ్లకు మొహం చాటేశారు. దీనికి తోడు ప్రభుత్వాల నిబంధనలు కూడా ఉత్సాహవంతులకు కళ్లెం వేశాయి. వీటన్నిటితో హోటల్ బిజినెస్ దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్నారు నిర్వాహకులు. మరికొన్ని హోటళ్లు పూర్తిగా ఆన్ లైన్ డెలివరీలకే పరిమితమయ్యాయి. 

నిమ్మగడ్డ వ్యవహారంలో ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం